తెలంగాణ ఉద్యమకారుడు మురళీధర్ దేశ్ పాండే పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ : కొత్త పేట్ లోని మురళీధర్ దేశ్ పాండే నివాసం లో ఆయన పార్థీవ దేహానికి బుధవారం కవిత నివాళులు అర్పించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత. మురళీధర్ దేశ్ పాండే ఈ రోజు తెల్లవారు జామున గుండెపోటుతో కొత్తపేట లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

మురళీధర్ దేశ్ పాండే

చివరి శ్వాస వరకు ప్రజా సమస్యలపై పోరాడారు

తెలంగాణ ఉద్యమకారుడు, సోషలిస్ట్ నాయకుడు మురళీధర్ దేశ్ పాండే మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. వారి మృతి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా కళాకారుల లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జానపద, సాంస్కృతిక కళాకారులను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు.

కళాకారుల హక్కుల కోసం, వారి గుర్తింపు, సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు కొట్లాడరన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తిన సోషలిస్టు నాయకుడు మురళీధర్ దేశ్‌పాండే గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తోటి ఉద్యమకారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read-

రేవంత్ పాలనలో నిత్యం ఆడబిడ్డలపై అఘాయిత్యలే

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలనలో మహిళలపై నిత్యం అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఖమ్మం నగరంలో 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ బాలికను నాలుగో అంతస్తు నుంచి తోసేసి హత్య చేయాలని ప్రయత్నించిన ఘటన దారుణమని కవిత అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతుంటే మారుమూల ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రత సంగతేంటనీ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలో నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

అటు మల్కాజ్ గిరిలో ఓ వ్యక్తి తన భార్యను తుపాకీ తో కాల్చి చంపిన ఘటన దారుణమన్నారు. మూడు నెలల క్రితమే నిందితుడు తన భార్యను కాల్చిచంపుతానంటూ బహిరంగంగా బెదిరించాడని కవిత గుర్తు చేశారు. అప్పుడే పోలీసులు స్పందించి చర్యలు తీసుకునే ఉంటే ఓ మహిళ నిండు ప్రాణం బలయ్యేదని కాదన్నారు.

సీఎం పాలనపై పట్టుకోల్పోయారు

మహిళల నేరాలను అరికట్టటంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని కవిత అన్నారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని… ఖమ్మం, మల్కాజ్ గిరి ఘటనలే అందుకు సాక్ష్యమని కవిత అన్నారు. పాలన పై సీఎం రేవంత్ రెడ్డి పట్టు కోల్పోయారని కవిత విమర్శించారు. ఇకనైనా మేల్కొని మహిళల రక్షణ పై యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం, మల్కాజ్ గిరి ఘటనల్లో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X