“ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం”

హైదరాబాద్ : ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై జనసేన పార్టీ, ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర ప్రభుత్వం కేసుల పేరుతో వేధింపులకు గురి చేస్తోందని “ఎక్స్” వేదికగా మండిపడ్డారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కు కవిత మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ విశ్లేషణలు చేసే నాగేశ్వర్ పై కావాలనే అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, తెలుగు ప్రజలు ఎంతగానో గౌరవించే మేధావి, ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం

ఏపీ పోలీసులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ను అక్రమ కేసులతో వేధిస్తున్నారని కవిత విమర్శించారు. ఆయన విశ్లేషణలతో ఏకీభవించకపోతే ఖండించాలే తప్ప ఇలా కేసులు పెట్టటం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. గతంలో తన పై ఆయన చేసిన విశ్లేషణలను కూడా వ్యక్తిగతంగా విభేదించానని కవిత గుర్తు చేశారు. అభిప్రాయ బేధాలు ఉన్న సరే రాజ్యాంగం కల్పించిన “భావప్రకటన స్వేచ్ఛ”ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడే విషయంలో టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదని చెప్పారు. ఈ విషయంలో ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కు అండగా ఉంటామని చెప్పారు. ప్రొఫెసర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుందని… అదే గనుక నిజమైతే దీన్ని తెలంగాణ మేధావులపై ప్రత్యక్ష దాడిగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఏపీ పోలీసుల ప్రయత్నాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని వార్తలు వస్తున్నాయని అలాంటి ప్రయత్నాలను తెలంగాణ పోలీసులు మానుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసించేలా ఏపీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే దాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలన్నారు. లేదంటే తాము హైదరాబాద్ లోని ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని కవిత హెచ్చరించారు.

Also Read-

రేవంత్ రెడ్డిది అమానవీయ ప్రభుత్వం

వడదెబ్బతో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ లో మార్చురీ వాహనం ఇవ్వకపోవటంతో కిలోమీటర్ కు పైగా మృత దేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లిన సంఘటనపై కవిత తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఇంతకన్నా అమానుషం, అమానవీయం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పట్ల ఎంత నిర్దయగా ఉందో ఈ ఉదంతంతో అర్థమవుతుందన్నారు. మృతదేహాన్ని తరలించే ఆర్థిక స్థోమత కూడా లేక తమ భుజాలపై శవాన్ని మోసుకెళ్లారనే వార్త పేపర్లో చదవుతుంటే హృదయం చలించిందని కవిత అన్నారు. రేవంత్ సర్కార్ సిగ్గు పడాలని విమర్శించారు. మానవత్వం లేని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా ఎలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని… ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar