డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం, మనస్తత్వ వేత్త డా. శ్రీకృష్ణ ఏమన్నారంటే…

హైదరాబాద్ : “విద్యా వారోత్సవాల్లో” భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో “మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు” అనే అంశంపై ఉద్యోగులకు, విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా ప్రఖ్యాత మనస్తత్వ వేత్త డా. శ్రీకృష్ణ పాల్గొని ప్రసంగించారు.

అయన మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం, మానవ హక్కులకు, సామాజిక, ఆర్థిక ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ మానసిక ఆందోళన కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బందికి గురైనప్పుడు వారిలో ఆందోళన తగ్గించి మానసికంగా కోలుకునే శక్తి, వచ్చేలా మనస్తత్వ వేత్తలు ప్రయత్నిస్తున్నారని వివరించారు. భావోద్వేగాలను ఆరోగ్యకరమైన మార్గాల్లో అర్థం చేసుకోవడం, వారి ఆత్మవిశ్వాసం, లక్ష్యం, దృఢత్వం, వ్యక్తిగత ఎదుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. సరైన నిద్ర, మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య, మానసిక సమస్యలు రాకుండా ఎకారికి వారే నివారించుకోవచ్చని వివరించారు.

Also Read-

ఈ కార్యక్రమానికి అకడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించగా, ప్రొ.పల్లవి కాబ్డే, ఒఎస్ది ప్రొ.రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఐ. ఆనంద్ పవార్, బోధనేతర సంఘం అధ్యక్షులు కాంతం ప్రేమ కుమార్ అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X