हैदराबाद : आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू में गुरुवार को सेल्फी लेने के लिए झरने में उतरी तीन इंटर छात्राएं डूब गईं और मौत हो गई। पुलिस ने बताया कि एक ही गांव की चार छात्राएं घूमने गई थीं और एक झरने में स्नान करने उतर गई। तभी उनमें से तीन छात्राएं दुर्घटनावश गहरे पानी में चल गईं और तैरना नहीं आने के कारण डूब गई। पुलिस ने बताया कि चौथी छात्रा बच गई और उसका अस्पताल में इलाज जारी है।
यह घटना अल्लूरी सीताराम राजू जिले के मूलागुम्मी गांव में हुई है। वीडियो बनाते समय तीन छात्राओं की डूबने से मौत हो गई और एक अन्य छात्रा घायल हो गई। घायल छात्रा की पहचान एस. अंजलि के रूप में हुई है। इसका अस्पताल में इलाज जारी है। तीनों मृतक छात्राओं की पहचान तृषा (17), पवित्रा (16) और रत्नकुमारी (16) के रूप में की गई है।

पुलिस ने बताया कि तैरना नहीं जानने के बावजूद सेल्फी लेने के लिए झरने में उतरीं तीन छात्राएं डूब गईं। छात्राएं वाटरफॉल के पास फोटो और सेल्फी वीडियो ले रही थीं, तभी उनमें से एक छात्रा गहरे पानी में चली गई। उसे बचाने के लिए दोनों छात्राएं उसके पास गईं। देखते ही देखते तीनों आंखों से ओझल हो गईं।
यह भी पढ़ें-
इसी समय आसपास के लोगों ने उन्हें बचाने के लिए दौड़ आये, लेकिन तब तक पानी की तेज धारा में तीनों बह गई। तीनों के शव बरामद कर लिए गए हैं। स्कूलों में ग्रीष्मकालीन अवकाश घोषित होने के कारण सभी छात्राएं झरने पर घूमने गई थीं। पुलिस ने मामला दर्ज करने की प्रक्रिया शुरू कर दी है।
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఇంటర్ బాలికల మృతి
హైదరాబాద్ : పరీక్షలు ముగిసి సరదాగా ఎంజాయ్ చేద్దామనుకున్న ముగ్గురు బాలికల జీవితం విషాదాంతం అయింది. అల్లూరి ఏపీలోని సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం జంబువలస గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల బిడ్డలు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) తమ స్నేహితురాలు అంజలితో కలిసి సరదాగా సమయాన్ని గడపాలని అనంతగిరి మండలంలోని మలుంగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు.
ఇంటర్ పరీక్షలు ముగించుకుని సెలవులకు ఇంటికి వచ్చిన త్రిషతో కలిసి మిగిలిన వారు జలపాతం అందాలను ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని ఉత్సాహపడ్డారు. అయితే, ఆ ఉత్సాహమే వారి ప్రాణాల మీదకు వస్తుందని వారు ఊహించలేకపోయారు. జలపాతం అంచున నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో రాళ్లు జారి ఒక యువతి ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో పడిపోయింది.
ఆమెను రక్షించే ప్రయత్నంలో ఒకరినొకరు పట్టుకోబోయి మిగిలిన ముగ్గురు కూడా లోతైన గెడ్డలో జారిపడిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని నీటి నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే త్రిష, రత్నకుమారి, పవిత్ర నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అదృష్టవశాత్తూ అంజలి గాయాలతో బయటపడగలిగింది. ఒకే గ్రామంలో, అది కూడా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డలు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. (ఏజెన్సీలు)
