“నన్ను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదు”

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం…

 • బోడుప్పల్ లో వక్ఫ్ బాధితుల సమస్య పరిష్కారం కానేకాదు
 • బీజేపీని గెలిపిస్తే పరిష్కరించే బాధ్యత తీసుకుంటాం
 • జవహార్ నగర్ డంపింగ్ యార్డ్, 59 జీవో బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం
 • బాధితులంతా ఏకమై ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ తీరును ఎండగట్టండి
 • మీకు అండగా నేనుంటా… ఎవరైనా అడ్డొస్తే అంతు చూస్తాం
 • మంత్రి మల్లారెడ్డి జోకర్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడు
 • నన్ను విమర్శించే అర్హత డ్రైనేజీ మంత్రికి లేదు
 • హిందూ సమాజ సంఘటితం కోసం బరాబర్ మాట్లాడతా…
 • 12 శాతమున్న ఎంఐఎంకు 7 సీట్లు వస్తే…. 80 శాతం హిందువులున్న పార్టీకి ఎన్ని సీట్లు రావాలి?
 • హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితేనే బోడుప్పల్ సమస్యకు పరిష్కారం
 • బోడుప్పల్ ‘‘వక్ఫ్ బాధితుల గోస – బీజేపీ భరోసా’’ దీక్షలో బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్ : ‘‘రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బోడుప్పల్ లోని వక్ఫ్ భూముల బాధితుల సమస్య పరిష్కారం కానేకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్ సహా మరే పార్టీ వచ్చినా ఎంఐఎం చెప్పినట్లే నడుచుకుంటాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. దీంతోపాటు జవహార్ నగర్ డంపింగ్ యార్డ్, 59 జీవో బాధితుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ లో ‘‘వక్ఫ్ బాధితుల గోస – బీజేపీ భరోసా’’ పేరిట నిర్వహించిన దీక్షలో బండి సంజయ్ పాల్గొన్నారు. వక్ఫ్ బాధితులకు బాసటగా గంటకుపైగా దీక్షలో పాల్గొని ప్రసంగించారు.

అందులోని ముఖ్యాంశాలు…

• మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లో ‘‘వక్ఫ్ బాధితుల గోస – బీజేపీ భరోసా’’ నిర్వహించిన దీక్షలో బాధితులకు బాసటగా బండి సంజయ్ కుమార్ గంటకుపైగా దీక్ష చేశారు. అనంతరం బాధితులను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు..

• నేను హిందుత్వ ఎందుకు మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. మేం ఏ మతానికి వ్యతిరేకం కాదు.. మన దేవుడిని తిడితే బరాబర్ వీపంతా సాఫ్ చేస్తం.

• ప్రజల బాధ తెలుసుకుని బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పడానికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ మాదిరిగా బీరు, బిర్యానీ, డబ్బులిచ్చి ప్రజలను తీసుకొచ్చే అలవాటు బీజేపికి లేదు.

• ఏ వీఐపీ అయినా ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలపై షెడ్యూల్ ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆ షెడ్యూల్ లేదు. పొద్దున్నే లేస్తే మందు తాగడమే పని. ప్రగతి భవన్ లేదంటే ఫాంహౌజ్ లో పండటమే పని. కేసీఆర్ పోతుంటే ఎవరు అడ్డుకుంటారోననే భయంతో అడుగుకో పోలీసు బందోబస్తు పెట్టుకుంటున్నడు.

• అట్లాంటి కేసీఆర్ ను ఫాంహౌజ్ నుండి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చినం. అక్కడి నుండి జనంలోకి తీసుకొచ్చినం. ఇప్పుడు బీఆర్ఎస్ పేరిట పేరు మార్చుకుని దేశమ్మీద తిరుగుతున్నరు. మూసేసిన ఫైనాన్స్ సంస్థకు కొత్త పేరు పెట్టినట్లే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు.

• మీ ఎమ్మెల్యే జోకర్ అనుకుంటున్నారు. అదంతా స్ట్రాటజీ. ఆయన చేసే అరాచకాలు, అవినీతిని ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో జోకర్ లా మాట్లాడుతున్నడు. లోపల మాత్రం భూ కబ్జాలు, కాలేజీలు, దోపిడీలు నిరాటంకంగా కొనసాగిస్తున్నడు.

• బోడుప్పల్ లో ఇండ్లు కట్టుకుని దశాబ్దాల నుండి 7 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. అన్ని రకాల ఛార్జీలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నరు. 2018 వరకు ప్రైవేటు భూమి అని చెప్పిన ప్రభుత్వం ఎన్నికలై పొంగనే వక్ఫ్ భూములని అమ్మకాలు, కొనుగోలు బంద్ చేయించిండు..

• బీఆర్ఎస్ ఉన్నంత కాలం ఈ సమస్య పరిష్కారం కానేకాదు. ఎందుకంటే ఎంఐఎం మాటలే వింటుంది. బీజేపీ గెలిస్తేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జవహర్ నగర్ డంప్ సమస్య తీరాలన్నా, 59 జీవో రెగ్యులరైజేషన్ కావాలన్నా బీజేపీ అధికారంలోకి రావాలి. మేడ్చల్ ఇలాంటి బాధితులే లక్షల మంది ఉన్నరు .మీరు తల్చుకుంటే బీఆర్ఎస్ ఓడిపోతుంది. బీజేపీ గెలుస్తుంది.

• బోడుప్పల్ లో భూములు కొన్నప్పుడు ఏ లిటిగేషన్ లేదని ప్రభుత్వమే క్లియరెన్స్ ఇచ్చింది. ఈసీలు తీస్తే కూడా నిషేధిత జాబితాలో ఈ భూములు లేవని తేల్చింది. అన్ని రకాల పన్నులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టించుకుని ఇండ్లు కట్టింది. మరి ఇన్నేళ్ల తరువాత ఇప్పుడు వక్ఫ్ భూములని ఎట్లా అంటావ్? అవి వక్ఫ్ భూములని ప్రభుత్వానికే సోయి లేకపోతే కొన్న ప్రజలకు ఎట్లా తెలుస్తుంది?

• 80 శాతం హిందువులున్న మనం …. ఎంఐఎంకు భయపడాలా? వాళ్లు వక్ఫ్ బోర్డు భూములంటే ఊరుకోవాల్నా? బీహార్ లో ఎలాంటి హామీలివ్వకుండానే 12 శాతం ఓట్లున్న ఎంఐఎం పార్టీకి 5 సీట్లు ఎట్లా వచ్చాయి? తెలంగాణలో 80 శాతం ఓట్లున్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే ఎన్ని సీట్లు గెలవాలే? అన్ని సీట్లు మనమే గెలుస్తాం. మరి ఎందుకు ఓటు బ్యాంకుగా మారొద్దు? ఒక్కసారి ఆలోచించండి.

• నేను మతాల పేరుతో దేవుళ్లను కించపర్చేవాళ్లను ఉపేక్షించొద్దు. వక్ఫ్ బోర్డు బాధితుల సమస్య గురించి మాట్లాడుతున్నమంటే అది కూడా హిందుత్వమే. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపాలి. వక్ఫ్ బోర్డ్ సమస్యే లేదు. లేని సమస్యను స్రుష్టించి మనమధ్య కొట్లాట పెట్టే యత్నం చేస్తున్నడు. ధరణి పోర్టల్ కూడా ఇంతే. పాస్ బుక్ లు ఉన్నోడికి, పట్టాలున్నోడికి క్లియరెన్స్ ఇవ్వకుండా సతాయిస్తోంది.

• ఆదాయం కోసం ప్రభుత్వ, బంజరు భూములను అమ్ముతున్న సర్కార్ బోడుప్పల్ భూముల సమస్యను ఎందుకు పరిష్కరించదు? బీజేపీ అధికారంలోకి వస్తేనే వక్ఫ్ బోర్డు సమస్య పరిష్కారం అవుతుందే తప్ప మరే పార్టీ గెలిచినా ఎంఐఎంను సాకుగా చూపి పెండింగ్ లో పెడుతుంది.

• ఎంతోమంది అప్పోసప్పో చేసి, పైసా పైసా కూడబెట్టి బోడుప్పల్ లో ఇండ్లు కొన్నరు. ఇయాళ పిల్లల పెళ్లి కోసమో, చదువు కోసమో, అప్పులు తీర్చుకునేందుకే అమ్ముదామంటే నిషేధిస్తే వాళ్లు ఏం చేయాలే? బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఎక్కడైనా వక్ఫ్ బోర్డ్ సమస్య ఉందా? యూపీలో ఆ సమస్య లేనేలేదు.

• ఇక్కడ కేసీఆర్ ఎంఐఎంకు భయపడి చెప్పినట్లు నడుస్తున్నడు. నిజాం మనవడు ఎక్కడో ఇస్తాంబుల్ చనిపోతే శవాన్ని ఇండియా ఆహ్వానించి(వ్యంగ్యంగా) అత్యంత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిండు. సీఎం స్వయంగా టోపీ పెట్టుకుని మరి అంత్యక్రియల్లో పాల్గొన్నడు. మరి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సేవ చేసిన దళితుడు సాయన్నకు మాత్రం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడానికి మాత్రం మనసు రావడం లేదు.

• కేసీఆర్ సీఎం కాగానే నిజాం సమాధి వద్దకు పోయి మోకరిల్లిండు. అట్లాంటి వ్యక్తి వక్ఫ్ భూముల సమస్యను ఎట్లా పరిష్కరిస్తాడు…

• అందుకే మీరు దయచేసి ఈ నియోజకవర్గంలోని వక్ఫ్ భూముల, జవహార్ నగర్ డంప్ యార్డ్, 59 జీవో బాధితులంతా కలిసి లక్ష మంది దాకా ఉంటారు. వీరంతా 3 నెలలు మాకు సమయం ఇవ్వండి. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ను ఓడించాలని తిరగండి.

• కేసీఆర్ కొడుకు డ్రైనేజీ మంత్రి. సిటీ సమస్యలను పరిష్కరించడం చేతగాదు.. కానీ గప్పాలు కొడతడు. నా గురించి మాట్లాడుతున్నడు. నీ అయ్య లేకపోతే నిన్ను కుక్కలు కూడా దేకవ్. నీలెక్క, కేసీఆర్ బిడ్డ లెక్క దొంగ సారా దందా చేసి, డ్రగ్స్ దందా చేసి, భూకబ్జా చేసి జైలుకుపోలే… హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం 7 సార్లు జైలుకుపోయిన. 3 సార్లు ఎంఐఎం లుచ్చాగాళ్లు చంపే యత్నం చేసినా భయపడలే. వందేళ్లు బతకాలని కోరుకోవడం లేదు. బతికినన్ని రోజులు ధర్మం కోసం, పేదల కోసం, హిందూ సమాజం కోసం బతుకుతానే తప్ప భయపడి మనిషిని కాదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

  Archives

  Categories

  Meta

  'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

  X