हैदराबाद : भारत ने आईसीसी अंडर-19 वर्ल्ड कप 2026 के दूसरे सेमीफाइनल में अफगानिस्तान को सात विकेट से हरा दिया। बुधवार को हरारे के हरारे स्पोर्ट्स क्लब में अफगानिस्तान ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया। अफगानिस्तान का यह फैसला काफी हद तक सही साबित हुआ, क्योंकि अफगानिस्तान ने 50 ओवर में 310/4 का विशाल स्कोर खड़ा किया। हालांकि, धुआंधार बैटर्स से सुसज्जित भारतीय टीम ने 41.1 ओवर में सिर्फ तीन विकेट के नुकसान पर 311 रन बनाकर फाइनल में पहुंच गई।
यह आईसीसी अंडर-19 वर्ल्ड कप का 16वां संस्करण। भारत ने 10वीं बार फाइनल में जगह बनाई है। अब 6 फरवरी को उसकी भिड़ंत इसी मैदान पर इंग्लैंड से होगी। इंग्लैंड ने टूर्नामेंट के पहले सेमीफाइनल में ऑस्ट्रेलिया को 27 रन से हराकर फाइनल में पहुंच गई। भारत की ओर से एरोन जॉर्ज ने शतक लगाया। एरोन जॉर्ज 15 चौके और दो छक्के की मदद से 104 गेंद में 115 रन बनाकर आउट हुए। एरोन जॉर्ज प्लेयर ऑफ द मैच चुने गए। वैभव सूर्यवंशी ने फिर ताबड़तोड़ फिफ्टी लगाई। उन्होंने 24 गेंद में अपना अर्धशतक पूरा किया। वैभव सूर्यवंशी नौ चौके और चार छक्के की मदद से 33 गेंद में 68 रन बनाकर आउट हो गया। कप्तान आयुष म्हात्रे पांच चौके और चार छक्के की मदद से 59 गेंद में 62 रन बनाकर पवेलियन लौटे। विहान मल्होत्रा 47 गेंद में 38 रन बनाकर नाबाद रहे। उन्होंने अपनी पारी के दौरान तीन चौके लगाए।

अफगानिस्तान के फैसल शिनोजादा और उजैरुल्लाह नियाजई ने शतक जड़कर अपनी टीम को 300 रन के पार पहुंचाया। फैसल शिनोजादा ने 93 गेंद पर 110 और उजैरुल्लाह नियाजई ने 86 गेंद पर 101 रन बनाए। उस्मान सादात ने 39 और खालिद अहमदजई 31 रन बनाकर आउट हुए। अजीजुल्लाह मियाखिल ने 12 रन बनाए। अब्दुल अजीज 7 रन बनाकर नाबाद रहे। इंडिया अंडर-19 की ओर से दीपेश देवेंद्रन और कनिष्क चौहान ने 2-2 विकेट लिए। टॉस जीतने के बाद अफगानिस्तान अंडर-19 टीम के कप्तान महबूब खान ने बताया कि उनकी प्लेइंग इलेवन में कोई बदलाव नहीं है। इंडिया अंडर-19 टीम के कप्तान आयुष म्हात्रे भी बिना बदलाव के साथ सेमीफाइनल मुकाबले में उतरे।
Also Read-
भारत की प्लेइंग 11: एरोन जॉर्ज, वैभव सूर्यवंशी, आयुष म्हात्रे (कप्तान), वेदांत त्रिवेदी, विहान मल्होत्रा, अभिज्ञान कुंडू (विकेटकीपर), आरएस अंबरीश, कनिष्क चौहान, खिलान पटेल, हेनिल पटेल और दीपेश देवेंद्रन।
अफगानिस्तान की प्लेइंग 11: खालिद अहमदजई, उस्मान सादात, फैसल शिनोजादा, उजैरुल्लाह नियाजई, महबूब खान (कप्तान), अजीजुल्लाह मियाखिल, नूरिस्तानी उमरजई, अब्दुल अजीज, रूहुल्लाह अरब, वहीदुल्लाह जादरान और अकील खान।
వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
హైదరాబాద్ : అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు టీమిండియా దూసుకెళ్లింది. బుధవారం హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై ఏకపక్షంగా జరిగిన సెమీ ఫైనల్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బౌలింగ్ లో విఫలమైనా బ్యాటింగ్ లో దుమ్మురేపి మన జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. భారీ ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంస క్రికెట్ ఆడితే.. ఓపెనర్ జార్జి (104 బంతుల్లో 115: 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో దుమ్ములేపాడు.
కెప్టెన్ ఆయుష్ మాత్రే (62) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏకపక్షంగా సాగిన సెమీస్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 41.1 ఓవర్లలో 313 పరుగులు చేసి గెలిచింది.
311 పరుగుల భారీ ఛేజింగ్ లో ఇండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్ కు 9.3 ఓవర్లలోనే 90 పరుగులు జోడించి ఛేజింగ్ ఈజీ చేశారు. ముఖ్యంగా వైభవ్ కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. ఇన్నింగ్స్ 10 ఓవర్లో భారీ షాట్ కు ప్రయత్నించి సూర్య ఔట్ కావడంతో అతని గ్రేట్ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. సూర్యవంశీ ధాటికి టీమిండియా తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. వైభవ్ ఇచ్చిన ఆరంభంతో ఇండియా ఛేజింగ్ ఈజీ అయింది.
ఈ దశలో ఆయుష్ మాత్రే, ఆరోన్ జార్జ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్ కు 114 పరుగులు జోడించిన తర్వాత ఆయుష్ మాత్రే 62 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ దశలో జార్జ్ విహాన్ మల్హోత్రాతో కలిసి మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో తన సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ గెలిపించాడు.
ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ నిర్ణయం సరైనదే అని నిరూపిస్తూ ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఖలీద్ అహ్మద్జాయ్, ఉస్మాన్ సదాత్ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించారు. ఖలీద్ అహ్మద్జాయ్ పరుగులు చేసే ప్రయత్నం చేయగా.. మరో ఓపెనర్ ఉస్మాన్ సదాత్ క్రీజ్ లో కుదురుకునేందుకు సమయం తీసుకున్నాడు. తొలి వికెట్ కు 53 పరుగులు జోడించిన తర్వాత ఈ జోడీని దీపేష్ దేవేంద్రన్ విడగొట్టాడు. 31 పరుగులు చేసిన ఖలీద్ అహ్మద్జాయ్ ను ఔట్ చేసి ఇండియాకు తొలి వికెట్ అందించాడు.
ఈ దశలో ఫైసల్ షినోజాడా, ఉస్మాన్ సదాత్ మరో కీలక భాగస్వామ్యాన్ని నిర్మించారు. రెండో వికెట్ కు 64 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత సేపు వేగంగా ఆడడంలో విఫలమైన ఉస్మాన్ సదాత్ 70 బంతుల్లో 39 పరుగువులు చేసి పెవిలియన్ కు చేరాడు. 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ ఆ తర్వాత అద్భుతంగా ఆడింది. వచ్చిన మంచి ఆరంభాన్ని ముందుకు తీసుకెళ్లారు. వీరిద్దరూ ఒకవైపు వికెట్ కాపాడుకుంటూనే మరోవైపు వేగంగా ఆడారు. ఈ క్రమంలో ఫైసల్ షినోజాడా తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఉజైరుల్లా నియాజై తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సెంచరీ హీరో ఫైసల్ షినోజాడా (104) ఔటైనా చివరి వరకు క్రీజ్ లో ఉండి ఉజైరుల్లా నియాజై కూడా సెంచరీ మార్క్ అందుకొని జట్టు స్కోర్ ను 300 పరుగులు దాటించాడు. ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై వికెట్ కు ఏకంగా 148 పరుగులు జోడించడం ఇన్నింగ్స్ కే హైలెట్ గా నిలిచింది. (ఏజెన్సీలు)
