న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా సింగరేణికి సంబంధించిన ఒడిశా లోని నైనికోల్ బ్లాక్ పై చర్చ జరుగుతోంది.
8 జిల్లాలకు పైగా విస్తరించిన సింగరేణి. తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించింది.
సింగరేణి సంస్థకు 136 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది.
బొగ్గు ఉత్పత్తిలో పలు రికార్డులు కూడా సింగరేణి సిగలో చేరాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత.. సింగరేణి ఇబ్బందులను ఎదుర్కొంది.
లాభాల్లో ఉన్న సింగరేణిలో.. తెలంగాణ వచ్చిన సమస్యల్లో చిక్కుకుంది.
ఈ సంస్థలో తెలంగాణ రాష్ట్రం వాటా 51% .. కేంద్రం వాటా 49% ఉన్నా.. అనేక సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వానిదే.
ఏ రకమైన జోక్యం, అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు.
ముగ్గురు కేంద్రం నుంచి 7 గురు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోర్డు డైరెక్టర్లుగా ఉంటారు.
BRS హయాంలో.. రాష్ట్రంలో పదేళ్లపాటు ‘కల్వకుంట్ల ఫ్యామిలీ’ మాటే సింగరేణిలో చెల్లుబాటైంది.
టెండర్ల దగ్గర్నుంచి.. చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు ప్రతిచోటా కేసీఆర్ కుటుంబం ఆడింది ఆట అన్నట్లు సాగింది.
సింగరేణి కార్యక్రమాల్లో రాజకీయ జోక్యంతో.. సమస్యల్లోకి నెట్టేశారు.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.32వేల కోట్ల బకాయిలు పెట్టారు.
ఎన్నిరకాలుగా సింగరేణిలో విధ్వంసం చేయవచ్చో.. BRS అన్ని ప్రయత్నాలు చేసింది.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతోంది.
తమ అవినీతి అక్రమాలకు.. సింగరేణిని బంగారు బాతుగా వాడుకున్నాయి.
సింగరేణి కార్మికుల చెమట కష్టాన్ని దోచుకున్నాయి.
Also Read-
ఒకప్పుడు BIFR (బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్) లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సింగరేణిని NDA ప్రభుత్వం ఆదుకుంది.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో రూ.684 కోట్ల అప్పుపై మారిటోరియం విధించి సింగరేణిని కాపాడారు.
తద్వారా సింగరేణి లాభాల బాటలో పడింది.
కానీ 2014 తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చింది. అవినీతి అక్రమాలకు కేంద్రంగా మారిపోయింది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతోంది.
తెలంగాణ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం.. సింగరేణి సంస్థకు నైని కోల్ బ్లాక్ ను కేటాయించింది.
2015లోనే ఈ బ్లాక్ కేటాయించి.. కేంద్రం నుంచి రావాల్సిన అన్ని అనుమతులను సరైన సమయంలో అందించింది.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నైని కోల్ బ్లాక్ విషయంలో.. టెండర్లను ఆహ్వానించి.. ముఖ్యమంత్రి చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు.
ఇవాళ కాంగ్రెస్ కూడా.. అదే పద్ధతిలో.. టెండర్లను ఆహ్వానించి.. వెనక్కు తగ్గారు.
2024లో నేను బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఒడిశా లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. నైని కోల్ బ్లాక్ కు సంబంధించిన చివరి అనుమతులు రావడంలో సీఎం ఒడిశా, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ గారితో మాట్లాడి అనుమతులు వచ్చేలా చొరవతీసుకున్నాను.
అనేక రివ్యూ మీటింగ్స్ లో నేను స్వయంగా మాట్లాడాను
ఈ ప్రయత్నాల కారణంగా.. సహకార సమాఖ్య స్ఫూర్తితో.. 643 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణికి అప్పగించేందుకు ఆమోదముద్రవేస్తూ.. 4 జూలై, 2024 నాడు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నైని బ్లాక్ కు తుది అనుమతులు వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనులను ప్రారంభించాల్సింది పోయి.. పారదర్శకమైన పద్ధతిలో పనులు చేపట్టాల్సింది పోయి ఆలస్యం చేశాయి.
అనేక అక్రమాలు, అవినీతి జరిగినట్లు వార్తలు రావడం.. దురదృష్టకరం.

Site Visit Certificate
బొగ్గు వెలికి తీయడం, బొగ్గు రవాణాకు సంబంధించి.. టెండర్లో.. ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ నిబంధనను సింగరేణి యాజమాన్యం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేర్చింది.
అనేక చోట్ల సైట్ విజిట్ చేయాలనే నిబంధన ఉంది. కానీ అది సెల్ఫ్ డిక్లరేషన్.
బ్లాక్ కు సంబంధించి.. సరైన వివరాలు తెలియకుండా.. టెండర్ కు వస్తే.. ఇబ్బందులుంటాయని.. అవగాహన కోసం ఈ నియమాన్ని తీసుకొచ్చాం.
దీనికి ఒక కారణం ఉంది. సైట్ విజిట్ చేసిన తర్వాతే.. సదరు కాంట్రాక్టర్ కు మినరల్ నిల్వలపై, అక్కడి భౌగోళిక స్థితిపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందనేది ఆ నిబంధనకు అర్థం.
కానీ సింగరేణి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి నిబంధనగా మార్చి అవినీతికి బాటలు వేసింది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోచాలా చోట్ల.. టెండర్ల ప్రక్రియలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. పారదర్శంగా పనిచేస్తున్నాం.
కానీ.. సింగరేణిలో.. ‘సైట్ విజిట్’ నిబంధనను తప్పనిసరి చేసి.. బొగ్గు వెలికి తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారు.
కోల్ బ్లాక్ కు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు జరపాలి, కేంద్రమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
సీబీఐ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి. కానీ కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది. నాడు కేంద్రానికి 49% భాగస్వామ్యం ఉన్న విషయాలు మరిచిపోయారా?
కొన్ని సంస్థలకు, కొందరు వ్యక్తులకు లాభం చేసేలా వ్యవహరించిన మాట వాస్తవం కాదా?
తాడిచర్ల కోల్ బ్లాక్ ను జెన్కోకు కేటాయించాం. దీని మైనింగ్ చేసేందుకు సింగరేణి ముందుకొస్తే.. వారితో ‘మేం పనిచేయలేమని లేఖ రాయించుకుని’ ప్రైవేటు కంపెనీకి 25 ఏళ్ల టెండర్ కట్టబెట్టిన మాట వాస్తవం కాదా?
ఇవాళ సుమారు.. రూ.47వేల కోట్ల రూపాయలను సింగరేణికి బకాయి పడింది.
దేశంలో ఏ కోల్ మైనింగ్ కంపెనీ కూడా.. ఈ స్థాయిలో ఇబ్బందుల్లేవు.
సింగరేణి పట్ల, కార్మికుల సంక్షేమం పట్ల.. నాడు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి.
బ్యాంకులనుంచి డబ్బులు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది.
సింగరేణిలో G11 grade coal అమ్మకం ధర.. టన్నుకు రూ. 4,088.
ఇదే కోలిండియాలో.. G11 grade coal ఈ ధర రూ. 1,605. దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ.
రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిమీద పడి దోచుకుంటున్నాయి కాబట్టే.. సంస్థను నడిపేందుకు వారి వద్ద ధరలను పెంచడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
సింగరేణి కోల్ కొంటున్న జెన్కో కూడా ప్రభుత్వ సంస్థనే కాబట్టి.. సింగరేణి ధరలు పెంచుకుంటూ పోతోంది.
సింగరేణి బొగ్గు క్వాలిటీ.. 58% ఉండగా.. కోలిండియాలో బొగ్గు క్వాలిటీ 86%.
సింగరేణి అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది కాబట్టి.. క్వాలిటీ విషయంలో, రేట్ విషయంలో తప్పటడుగులు వేస్తోంది.
NTPC , AP ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా.. సింగరేణి బొగ్గు మాకు వద్దని అంటున్నాయి.
అవినీతి, అక్రమాల కారణంగా సింగరేణి భవిష్యత్తు అంధకారంలో పడే పరిస్థితి నెలకొంది.
సింగరేణి భూములు.. గతంలో బీఆర్ఎస్.. నేడు కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆక్రమణలకు గురవుతున్నాయి.
అనేక పత్రికలు, చానళ్లలో.. సింగరేణి అక్రమాలపై చాలా కథనాలు వచ్చాయి. దీనిపై బోర్డు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లు లేవనెత్తిన అంశాలపైనా చర్చించడం లేదు.
సీబీఐ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే.. కేంద్రం దీన్ని పరిశీలిస్తుంది.
సింగరేణి కార్మికుల భవిష్యత్తును రక్షించుకునేందుకు.. వ్యవస్థను పక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
మంత్రుల మధ్య వాటాల పంపిణీతోనే ఈ వివాదాలు బయటకొచ్చాయి.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఎలా చెల్లిస్తారు? వివిధ దశల్లో చెల్లిస్తారా? ఒకేసారి ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాను.
ఇవాళ.. సింగరేణి ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెట్టి ఈ అంశాలన్నీ చర్చించారు.
కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులు చర్చించారు.
ఇది రాజకీయ పార్టీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం మాత్రమేకాదు.. ఇది సింగరేణి భవిష్యత్తుకు, దీనిపై ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విషయం.
సంస్థకు సంబంధించిన అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉంది.
దీనిపై మా కోల్ సెక్రటరీ.. విదేశీ పర్యటన పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాస్తారు.
కేంద్ర మంత్రిగా.. కేంద్ర ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారానికి సిద్ధంగా ఉన్నాను.
టెండర్ల ప్రక్రియ విషయంలో.. ప్రత్యేక కమిటీ ఏర్పాటును కూడా పరిశీలిస్తున్నాం.
బోర్డులో మేం లెవనెత్తిన చాలా విషయాలను.. వారు విస్మరించారు.
త్రైపాక్షిక ఒప్పందం జరగాల్సిన అవసరం ఉంది.. భవిష్యత్తులో జరిగే టెండర్లు, ఇతర ప్రక్రియపై విస్తృతంగా చర్చిస్తాం.
నేను కేంద్రమంత్రి అయిన తర్వాత.. వ్యవస్థలో మార్పులను తీసుకొస్తున్నాను. ఎప్పటికప్పుడు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రశ్నిస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి.. సింగరేణిని లాభాల బాటలో నడిపేందుకు మాకు అప్పగిస్తే.. ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
