हैदराबाद: शहर के प्रसिद्ध सनतनगर स्थित ईएसआई हॉस्पिटल में सोमवार को हादसा हुआ। बिल्डिंग की मरम्मत के दौरान सेंटरिंग गिर गई। ऊपर से स्लैब गिरने से तीन वर्कर की मौत हो गई। यह हादसा तब हुआ जब ईएसआई के इमरजेंसी डिपार्टमेंट में मरम्मत का काम चल रहा था।
हादसे के तुरंत बाद हॉस्पिटल के वरिष्ठ अधिकारी मौके पर पहुंचे। उन्होंने कर्मचारियों के साथ मिलकर रेस्क्यू ऑपरेशन शुरू किया। उन्होंने स्लैब का मलबा हटा दिया। मजदूरों की बॉडी को बाहर निकाला।
पुलिस भी मौके पर पहुंची और जानकारी एकत्रित की। पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। हादसे में मरने वालों के परिजन ईएसआई हॉस्पिटल पहुंच गए हैं। परिजन शवों को देखकर रो पड़े हैं।
Also Read-
ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం, కార్మికులు ముగ్గురు మృతి
హైదరాబాద్ : సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం ప్రమాదం జరిగింది. భవనం మరమ్మతులు చేస్తుండగా సెంట్రింగ్ కుప్పకూలింది. శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో ముగ్గురు కార్మికులు మరణించారు. ఈఎస్ఐలోని అత్యవసర విభాగంలో ఆధునీకరణ (రెనోవేషన్) పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సిబ్బందితో కలిసి సహాయక చర్యల్లో చేపట్టారు. శ్లాబ్ పెచ్చులు మీద పడడంతో వాటిని తొలగించి కార్మికుల మృతదేహాలను బయటకు తీశారు.
పోలీసులు సైతం ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు ఈఎస్ఐ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. (ఏజెన్సీలు)
