గాంధీభవన్ లో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి

హైదరాబాద్ : గాంధీభవన్ లో మహాత్మా గాంధీ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయునుల చిత్ర పటాలకు పూలతో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్లో మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలతో నివాళులు అర్పించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు

ఈ సందర్భంగా ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీజీ చూపించిన అహింసామార్గం, సత్యాగ్రహ స్ఫూర్తి నేటి తరాలకు మార్గదర్శకం అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో గాంధీ ఆలోచనలు నిత్యం వెలుగునిస్తాయని, ఆయన ఆశయాల సాధనకై అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Also Read-

దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు

మరో వైపు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ “దామోదర్ రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయన క్రమశిక్షణతో, అంకితభావంతో పార్టీ కోసం పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి తనను తీవ్రంగా కలచివేసింది. దామోదర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X