हैदराबाद: तेलंगाना मंत्रिमंडल के विस्तार के लिए समय तय हो गया है। रविवार को दोपहर 12 से 1 बजे के बीच तीन मंत्री पद की शपथ लेंगे। इनमें चेन्नूर विधायक विवेक वेंकटस्वामी, मानकोंडूर विधायक कव्वमपल्ली सत्यनारायण और मक्तल विधायक वाकिटी श्रीहरि शामिल हैं। इनके नाम शनिवार रात कांग्रेस आलाकमान ने तय किए। राज्यपाल जिष्णु देव वर्मा तीनों को मंत्री पद की शपथ दिलाएंगे। राजभवन में शपथ ग्रहण के लिए व्यवस्था कर रहे हैं।
तेलंगाना मंत्रिमंडल में कुल छह पद खाली हैं। इस समय तीन पद अभी भरे जा रहे हैं। रविवार को मृगशिरा व्रत है और यह शुभ समय है। इसलिए आलाकमान ने मंत्रिमंडल विस्तार को हरी झंडी दे दी है। खबर है कि शेष तीन पद जल्द ही भरे जाएंगे। सीएम रेवंत रेड्डी ने शनिवार शाम को दिल्ली में मौजूद राज्यपाल जिष्णु देव वर्मा से शपथ ग्रहण के बारे में बात की है।
राज्यपाल शनिवार रात दिल्ली से हैदराबाद के लिए रवाना हुए। भरे जाने वाले तीन मंत्री पदों में एससी माला (विवेक वेंकटस्वामी), एससी मादिगा (कव्वमपल्ली सत्यनारायण) और बीसी मुदिराज (वाकिची श्रीहरि) को मंत्री बनाया गया है। इस बीच, शुक्रवार को कांग्रेस की प्रदेश मामलों की प्रभारी मीनाक्षी नटराजन ने सीएम रेवंत रेड्डी से उनके आवास पर मुलाकात की और मंत्रिमंडल विस्तार पर चर्चा की।
बाद में पार्टी महासचिव केसी वेणुगोपाल को मामले से अवगत कराया गया। उसके बाद उन्होंने एआईसीसी प्रमुख मल्लिकार्जुन खड़गे और वरिष्ठ नेता राहुल गांधी से इस पर चर्चा की। इसी क्रम में टीपीसीसी के अध्यक्ष महेश कुमार गौड़, मंत्री पोन्नम प्रभाकर और अन्य नेताओं ने तीनों नये मंत्रियों को बधाई दी है।
Also Read-
తెలంగాణ కొత్త మంత్రులుగా ముగ్గురు, వారే వీరు, ఆదివారం మధ్యాహ్నం ప్రమాణం
హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య మంత్రులుగా ముగ్గురు ప్రమాణం చేయనున్నారు. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉన్నారు. వీరి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ శనివారం రాత్రి ఖరారు చేసింది. ముగ్గురితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రులుగా ప్రమాణం చేయించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రివర్గంలో పేర్లు ఉన్నవారికి ఆదివారం ఉదయంలోపు సీఎంవో నుంచి ఫోన్ ద్వారా సమాచారం వెళ్లనుంది.
తెలంగాణ కేబినెట్లో మొత్తం ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా ప్రస్తుతం మూడు బెర్త్‌లను భర్తీ చేయనున్నారు. ఆదివారం మృగశిర కార్తె కావడం, మంచి ముహూర్తం ఉండడంతో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన మూడు బెర్త్‌లను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఉన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో శనివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడినట్టు తెలిసింది.
శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గవర్నర్ హైదరాబాద్‌కు బయలుదేరారు. ప్రస్తుతం భర్తీ చేయనున్న మూడు మంత్రి పదవుల్లో ఎస్సీ మాల (వివేక్ వెంకటస్వామి), ఎస్సీ మాదిగ (కవ్వంపల్లి సత్యనారాయణ), బీసీ ముదిరాజ్ (వాకిటి శ్రీహరి)కు దక్కాయి. కాగా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమై.. కేబినెట్ విస్తరణపై చర్చించారు. అనంతరం విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు తెలియజేశారు. ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే , అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించారు.
కొత్త మంత్రులకు శుభాకాంక్షలు.. అభినందనలు.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్..
కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు మంత్రులు వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి లకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్ కు కూడా టీపీసీసీ అధ్యక్షులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అమలు చేస్తుందని అందుకే కుల ఘనన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ
కొత్తగా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులకు అభినందనలు, శుభాకాంక్షలు
రాహుల్ గాంధీ గారి ఆలోచనల మేరకు కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. కుల గణన చేస్తే ఏం లాభం అన్నవారికి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఐదుగురికి ఐదు ఎమ్మెల్సీలు ,ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ లో సామాజిక న్యాయం రాహుల్ గాంధీ ఆలోచనకు అద్దం పడుతున్నాయి. రాహుల్ గాంధీ గారు కుల గణన చేస్తే ఏం ప్రాధాన్యత దొరుకుతుంధో తెలంగాణ రాష్ట్రంలో రోల్ మోడల్ గా చూస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ , కేసీ వేణుగోపాల్ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. సామాజిక న్యాయం కాంగ్రెస్ తో మాత్రమే సాధ్యం అవుతుందని మరోసారి నిరూపించింది. (ఏజెన్సీలు)
