Telangana Jagruthi President, BRS MLC K. Kavitha to Stage Day-Long Hunger Strike in Hyderabad Tomorrow, Demanding Installation of Jyotirao Phule Statue in Telangana Assembly
MLC K. Kavitha Fights to Honour the Legacy of Phule: BRS Leader to Sit on Hunger Strike Demanding Statue in Telangana Assembly
Leaders from Telangana Jagruthi and the United Phule Front inspected the arrangements at the protest site earlier today
Hyderabad: BRS MLC K. Kavitha will hold a day-long hunger strike at Dharna Chowk, Indira Park, on April 8, demanding the immediate installation of a statue of social reformer Jyotirao Phule in the Telangana Assembly.
MLC Kalvakuntla Kavitha had earlier urged the Speaker and demanded the State Government to ensure the installation of the statue ahead of Phule’s birth anniversary on April 11. With no action taken so far, she is set to lead the protest to honour Phule’s legacy and his contributions to social justice.
MLC Kavitha will begin the hunger strike tomorrow at Indira Park, Hyderabad, from 11 AM to 5 PM.
As part of a sustained political campaign spanning over 14 roundtable meetings across Telangana, MLC Kavitha has launched and led an unprecedented movement for BC (Backward Classes) rights. She has conducted extensive consultations across districts in Telangana to amplify BC concerns and demanded the implementation of the Kamareddy BC Declaration made by the Congress party during the assembly elections.
Additionally, MLC Kavitha has been at the forefront of demanding the implementation of 42% reservations for BCs in the state. Due to her constant efforts and pressure, the state government has introduced two separate bills in the Assembly to provide 42% reservations for BCs in politics, employment, and education.
Also Read-
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకై రేపు ఎమ్మెల్సీ కవిత దీక్ష
ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ దీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి సోమవారం నాడు తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బొళ్ల శివ శంకర్ నేతృత్వంలో నాయకులు ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
బీసీల ఆత్మ బంధువు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా కాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్న విషయం విధితమే. పలు సార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను రెండు సార్లు కలిసి వినతి పత్రాలు కూడా అందించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పోరాటాన్ని ఉదృతం చేశారు. ఈ నెల 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా, ఇందిరా పార్కు వద్ద బొళ్ల శివ శంకర్ విలేకరులతో మాట్లాడుతూ…. బీసీల విషయంలో ప్రభుత్వం చిన్న చూపు తగదని సూచించారు. బీసీల ఆరాధ్య దైవమైన పూలేను చట్టసభల ఆవరణలో ఏర్పాటు చేసి గౌరవించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ ను ప్రభుత్వం విస్మరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
బీసీల అంశాలు, సమస్యలపై అనేక జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించామని, వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని వివరించారు. బీసీలను మోసం చేస్తూ సహించేదే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత దీక్షకు వేలాది మంది ప్రజలు, బీసీలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు నవీన్ ఆచారి , శ్రీధర్ రావు, పెంటా రాజేష్ , యునైటెడ్ ఫుల్ ఫ్రంట్ నాయకులు అలకుంటల హరి, గోపు సదనందు, మారయ్య, నిమ్మల వీరన్న, విజేందర్ సాగర్ , డి నరేష్ కుమార్, అశోక్ యాదవ్ , లింగం శాలివాహన , పుష్ప చారి , తదితరులు పాల్గొన్నారు.
