विवादित टिप्पणी करने के लिए अक्सर चर्चा में रहने वाले विधायक टी राजा सिंह उन तीन मामलों में बरी, झूम उठे प्रशंसक

हैदराबाद: ज्ञातव्य है कि विवादित टिप्पणी करने के लिए अक्सर चर्चा में रहने वाले गोशामहल के भाजपा विधायक टी राजा सिंह के खिलाफ मामले भी उसी प्रकार दर्ज किए गए हैं जो चर्चा के विषय बन गये। हालांकि, नामपल्ली विशेष अदालत ने राजा सिंह को उनके खिलाफ दर्ज तीन प्रमुख मामलों में बरी कर दिया। नामपल्ली विशेष न्यायालय ने अंततः उन्हें नफरत भरे भाषण, चुनावी रैली और श्री राम नवमी रैली के दौरान नियमों का उल्लंघन करने के लिए पुलिस द्वारा दर्ज मामलों में बरी कर दिया है।

तेलंगाना में दिलचस्प घटनाक्रम हो रहे हैं। यह सर्वविदित है कि हाल ही में लगातार राजनीतिक नेताओं के खिलाफ मामले दर्ज किये जा रहे हैं। गिरफ्तारियां हो रही है। जांच के नाम पर काफी हंगामा खडा किया जा रहा है। हालांकि, यह सब विपक्षी बीआरएस नेताओं तक ही सीमित थे, लेकिन गौर करने वाली बात यह है कि गोशामहल से भाजपा विधायक राजा सिंह के खिलाफ इससे पहले भी कई मामले दर्ज हो चुके हैं। इसके तहत, नामपल्ली विशेष अदालत ने एक महत्वपूर्ण फैसला सुनाते हुए राजा सिंह को तीन दर्ज मामलों में बरी कर दिया।

इस बीच 2022 में पुलिस ने राजा सिंह के खिलाफ पीडी एक्ट का पहली बार मामला दर्ज किया गया था। कथित तौर पर विवादास्पद धार्मिक टिप्पणी करने के आरोप में 19 फरवरी, 2022 को मंगलहाट थाने में दर्ज एक मामले के आधार पर पीडी अधिनियम लागू किया गया था। इसी क्रम में राजा सिंह को गिरफ्तार कर चेरलापल्ली जेल भेज दिया गया। तेलंगाना में पहली बार किसी विधायक के खिलाफ पीडी एक्ट का प्रयोग करना उस समय चर्चा का विषय बन गया था।

हालांकि, इस मामले में राजा सिंह को रिमांड पर लेने की अनुमति देने का अनुरोध किया, तो नामपल्ली अदालत ने इस आधार पर राजा सिंह की रिमांड खारिज कर दी कि गिरफ्तारी के समय 41 सीआरपीसी का नोटिस नहीं दिया गया था और सुप्रीम कोर्ट के दिशानिर्देशों का पालन नहीं किया गया था। अदालत ने पुलिस को राजा सिंह को तुरंत रिहा करने का आदेश दिया। राजा सिंह की रिमांड खारिज होने के बाद पुलिस ने कानूनी राय मांगी। उनके खिलाफ पहले दर्ज मामलों की पुनः जांच की गई।

पुलिस ने मंगलहाट और शाहिनायतगंज थानों में दर्ज ऐसे मामलों की पहचान की जो पीडी अधिनियम लागू करने के पक्ष में थे। हालांकि, यह उल्लेखनीय है कि नामपल्ली विशेष अदालत ने अब उन तीनों मामलों में राजा सिंह को बरी करते हुए फैसला सुनाया है। इस फैसले के बाद राजा सिंह के समर्थक खुश से झूम उठे।

Also Read-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ నిర్దోషి, నాంపల్లి కోర్టు తీర్పు

హైదరాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద కేసులు కూడా అదే స్థాయిలో నమోదవటం తెలిసిందే. అయితే రాజాసింగ్ మీద నమోదైన ఓ మూడు కేసుల్లో ఆయనను నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది నాంపల్లి ప్రత్యేక కోర్టు. విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ సందర్భాల్లో రూల్స్ అతిక్రమించారంటూ పోలీసులు పెట్టిన కేసుల్లో చివరికి నిర్దోషిగా తేల్చింది నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం.

తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటివరకు వరుసగా రాజకీయ నాయకులపై కేసులు, అరెస్టులు, విచారణలు అంటూ ఉత్కంఠ రేపిన విషయం తెలిసిందే. అయితే.. ఇదంతా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నేతలకే పరిమితం కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద అంతకుముందు నుంచే రకరకాల సందర్భాల్లో పలు కేసులు నమోదవటం గమనార్హం. ఇందులో భాగంగా నమోదైన మూడు కేసుల్లో రాజాసింగ్‌ను నిర్దోషిగా తేల్చుతూ నాంపల్లి ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

విద్వేషపూరిత ప్రసంగం, ఎన్నికల ర్యాలీ, శ్రీరామ నవమి ర్యాలీ సందర్భాల్లో నియమాలను ఉల్లంఘించారంటూ రాజాసింగ్ మీద పోలీసులు మూడు కేసులు పెట్టారు. మంగళ్‌హాట్, షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. కాగా ఈ కేసులను విచారించిన నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది.

కాగా 2022లో రాజాసింగ్ మీద పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు. మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 2022 ఫిబ్రవరి 19న మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఈ క్రమంలో రాజాసింగ్‌ను అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్ ప్రయోగించడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ కేసులో రాజాసింగ్‌ను రిమాండ్‌కు అనుమతించాలంటూ పోలీసులు న్యాయస్థానాన్ని కోరగా అరెస్టు సమయంలో 41 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించలేదని రాజాసింగ్ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. రాజాసింగ్‌ను వెంటనే విడుదల చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. రాజాసింగ్‌‌‌‌ రిమాండ్‌‌‌‌ రిజెక్ట్‌‌‌‌ కావడంతో పోలీసులు లీగల్‌‌‌‌ ఒపీనియన్ తీసుకున్నారు. ఆయనపై గతంలో నమోదైన కేసులను కొత్తగా పరిశీలించారు.

పీడీ యాక్ట్‌‌‌‌ ప్రయోగించేందుకు అనుకూలంగా మంగళ్‌‌‌‌హాట్‌‌‌‌, షాహినాయత్‌‌‌‌ గంజ్‌‌‌‌ స్టేషన్లలో నమోదైన కేసులను పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పుడు ఆ మూడు కేసుల్లోనూ రాజాసింగ్‌ను నిర్దోషిగా తేల్చుతూ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించటం గమనార్హం. (ఏజెన్సీలు)

BJP MLA T Raja Singh Acquitted in Three Cases by Special Court

Hyderabad: In a significant development, the Special Court in Nampally has acquitted BJP MLA T Raja Singh in three major cases registered against him. The cases pertained to hate speech, violation of rules during election rallies, and Sri Rama Navami rallies.

Raja Singh was booked under the PD Act for the first time in 2022 for allegedly making controversial religious remarks. He was subsequently arrested and lodged in Cherlapally Jail.

However, the Nampally Court had earlier rejected the police’s plea for Raja Singh’s remand, citing non-compliance with Supreme Court guidelines and failure to serve notice under Section 41 CRPC. With the Special Court’s verdict, Raja Singh’s supporters have erupted in joy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X