10वां अंतरराष्ट्रीय योग दिवस : देश-विदेश में धूम, पीएम मोदी ने श्रीनगर में स्कूली बच्चों साथ किये आसन

हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी ने 10वें अंतरराष्ट्रीय योग दिवस पर जम्मू-कश्मीर के श्रीनगर में आज स्कूली बच्चों साथ योग किया। इससे पहले पीएम ने शेर-ए-कश्मीर इंटरनेशनल कॉन्फ्रेंस सेंटर में आयोजित समारोह में हिस्सा लिया। इस दौरान उन्होंने योग के महत्व के बारे में समझाया।

साथ ही मोदी ने आगे कहा कि योग ने लोगों को यह महसूस कराने में मदद की है कि उनका कल्याण उनके आसपास की दुनिया के कल्याण से जुड़ा हुआ है। दुनिया योग को वैश्विक भलाई के एक शक्तिशाली माध्यम के रूप में देख रही है। योग हमें अतीत के बोझ के बिना वर्तमान क्षण में जीने में मदद करता है।

पीएम मोदी अंतर्राष्टीय योग दिवस के मौके पर श्रीनगर में स्थानीय लोगों से मिलते हुए. स्थानीय लोगों ने पीएम मोदी के साथ सेल्फी भी ली। अंतर्राष्ट्रीय योग दिवस के मौके पर डल झील किनारे 7000 लोग पहुंचे, लेकिन बारिश ने पहले से निर्धारित कार्यक्रम में खलल डाल दी। पीएम मोदी के पास खड़े लोग योग कार्यक्रम में शिरकत करने पहुंचे।

अंतर्राष्ट्रीय योग दिवस पर जम्मू-कश्मीर के श्रीनगर में डल झील किनारे पीएम मोदी को अपने बीच देख स्कूली बच्चे खुशी से खिलखिला उठे। पीएम मोदी भीड़ में पहुंच स्कूली बच्चों से बात करते हुए नजर आए। इस मुलाकात दौरान कुछ ऐसे लम्हें भी आए, जब पीएम बच्चों संग खुलकर हंसे।

హైదరాబాద్ : శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించారు. చాలా చోట్ల విద్యార్థులు, యువత ఆసనాలు వేశారు. మరోవైపు భారత ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో యోగా దినోత్సవ వేడుకలకు హాజరై ఆసనాలు వేశారు. దాల్ లేక్ ఒడ్డున ఉన్న షేర్-ఐ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (ఎస్‌కెఐసీసీ)లో ఉదయం 6.30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సింది ఉండగా, భారీ వర్షం కారణంగా దానిని సమీపంలోని ఒక హల్‌లోకి మార్చారు. మోడీతో పాటు చాలా మంది ఆసనాలు వేశారు. వర్షం ఆగిపోయిన తర్వాత దాల్ సరస్సు వద్ద ప్రజలతో సెల్ఫీ దిగారు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రధాని పంచుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ… యోగా దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రజలకు, ప్రపంచంలోని ప్రతి మూలలో యోగా చేస్తున్న ప్రజలకు శుభాకాంక్షలు. యోగా సాధన చేసే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 10 సంవత్సరాల చారిత్రక ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 2014లో ఐక్యరాజ్యసమితిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించగా, దీనికి 177 దేశాలు మద్దతు ఇచ్చాయి, అప్పటి నుండి, యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఇది ఇప్పుడు కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్నారు.

ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరుతున్నాను, ఇది మంచి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. 101 ఏళ్ల మహిళా యోగా టీచర్‌కు పద్మశ్రీ లభించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఆమె భారతదేశానికి ఎప్పుడూ రాలేదు, కానీ ఆమె తన జీవితమంతా యోగా గురించి అవగాహన కల్పించడానికి అంకితం చేసింది. యోగాపై పరిశోధన ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, సంస్థలు, పరిశోధన పత్రాలు ప్రచురించబడుతున్నాయని మోడీ అన్నారు.

ఇది కూడ చదవండి-

ఇదిలా ఉంటే ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఇతర అధికారులతో కలిసి యోగా చేశారు. న్యూఢిల్లీలో యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో కేంద్ర మంత్రి జెపి నడ్డా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. లక్నోలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ యోగా చేశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బనస్కాంత జిల్లాలోని నాడబెట్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ యోగా వేడుకల్లో పాల్గొన్నారు.

భారత ఆర్మీ సైనికులు మంచు కొండలపై యోగా చేశారు. సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో ఐటీబీపీ జవాన్లు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఆసనాలు వేశారు. న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన టైమ్స్ స్క్వేర్‌లో వేలాది మంది యోగా ఔత్సాహికులు యోగా సెషన్‌లో పాల్గొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X