नामपल्ली प्रदर्शनी मैदान में मछली प्रसाद वितरण, टीजीआरटीसी चलाएगी विशेष बसें

हैदराबाद : तेलंगाना मत्स्य निगम के अध्यक्ष मेट्टू साई कुमार ने कहा कि नामपल्ली प्रदर्शनी मैदान में मछली प्रसाद के वितरण के लिए सभी व्यवस्थाएं की गई हैं। हर साल मृगसिरा करते के अवसर पर बत्तिनी बंधु अस्थमा के रोगियों को मछली की दवा वितरित करते हैं। आठ जून शनिवार की सुबह 9 बजे विधान सभा अध्यक्ष गड्डम प्रसाद कुमार एवं मंत्री पोन्नम प्रभाकर मछली प्रसाद वितरण कार्यक्रम का शुभारंभ करेंगे।

इस कार्यक्रम में साई कुमार ने 7 जून को वितरण से संबंधित व्यवस्थाओं का निरीक्षण किया। उन्होंने कहा कि विभाग की ओर से 1 लाख 60 हजार फिश फ्राई उपलब्ध कराये गये हैं। उन्होंने कहा कि पिछले साल की तुलना में अधिक संख्या में लोगों के आने की संभावना है। कई लोग पहले ही टोकन लेने आ चुके हैं। उन्होंने कहा कि बसवा केंद्र चरकमान संघम ने अन्य राज्यों के अस्थमा रोगियों के लिए भोजन की व्यवस्था की है।

एसोसिएशन के अध्यक्ष नागनाथ माशट्टे ने कहा कि वे दो दिन के लिए आने वालों को भोजन की व्यवस्था करेंगे। शनिवार को मछली की दवा वितरण के लिए टोकन दिये जा रहे हैं। इसलिए अलग-अलग स्थानों से बड़ी संख्या में लोग आ रहे हैं। नामपल्ली के लोग पहले से ही बड़ी संख्या में प्रदर्शनी मैदान पहुंच चुके हैं।

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మెన్ మెట్టు సాయి కుమార్. ప్రతియేటా మృగశిర కార్తె సందర్భంగా ఉబ్బసం రోగులకు బత్తిని సోదరులు చేప మందును పంపిణీ చేస్తున్నారు. జూన్ 8వ తేదీ శనివారం ఉదయం చేప మందు కార్యక్రమాన్ని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు.

ఈక్రమంలో జూన్ 7వ తేదీ పంపిణీకి సంబంధిత ఏర్పాట్లను సాయి కుమార్ పర్యవేక్షించారు. డిపార్ట్మెంట్ నుంచి 1లక్ష 60వేల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. గతేడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఇప్పటికే టోకన్ తీసుకునేందుకు చాలామంది తరలివచ్చారన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన ఆస్తమా రోగులకు బసవ కేంద్ర చార్కామన్ సంఘం భోజన ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.

రెండు రోజుల పాటు ఎంత మంది వచ్చిన వారికి బోనజాన్ని అందిస్తామని సంఘం అధ్యక్షుడు నాగ్ నాత్ మశాట్టే తెలిపారు. శనివారం చేప మందు పంపిణీకి టోకెన్ లను ఈరోజు నుండే విక్రయిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నాంపల్లి ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కు చేరుకుంటున్నారు.

టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త

ఈ నేపథ్యంలోనే.. చేప మందు కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. జూన్ 8, 9వ తేదీల్లో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప మందు పంపిణీ చేయనున్నారు. ఈ రెండు రోజుల పాటు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ మార్గంలో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

వీటితో పాటు దిల్సుఖ్నగర్, ఎన్జీవోస్ కాలనీ, మిథాని, ఉప్పల్, చార్మినార్, గోల్కొండ, రాంనగర్, రాజేంద్రనగర్, రిసాల్ బజార్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, పటాన్చెరు, జీడిమెట్ల, కేపీహెచ్బీ కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు మొత్తం 80 బస్సులు నడుపనున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ప్రయాణికులకు దగ్గరిలోని బస్టాండులో కనుక్కుని.. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X