BREAKING NEWS: विधायक पिन्नेल्ली की तलाश में दो राज्यों की पुलिस, फिल्मी अंदाज में आ रहे हैं मोड़ पर मोड़

हैदराबाद: माचर्ला विधायक पिन्नेल्ली रामकृष्ण रेड्डी के ईवीएम क्षति मामले में फिल्म से परे कई मोड़ आ रहे हैं। पिन्नेल्ली की तलाश जारी है। जहां एपी पुलिस ईवीएम तोड़फोड़ मामले में आरोपी पिन्नेल्ली को गिरफ्तार करने की कोशिश कर रही है, वहीं पिन्नेल्ली गिरफ्तारी से बचने के लिए यहां-वहां भागने की कोशिश कर रहे हैं।

ताजा जानकारी के मुताबिक, पुलिस टीमों को सूचना मिली कि पिन्नेल्ली रामकृष्ण रेड्डी तेलंगाना की सीमा पार कर बीदर की ओर जा रहे हैं। इससे पहले, एपी पुलिस की टीमों ने पाया कि पिन्नेली ने अपनी कार, ड्राइवर और मोबाइल को संगारेड्डी शहर के पास कंदी में छोड़ दिया और दूसरे वाहन में चले गये। वहां से पुलिस ने पता लगाया कि वे महाराष्ट्र के बीदर की ओर जा रहे हैं। इसी क्रम में अलर्ट होकर एपी पुलिस के अधिकारियों ने एपी और तेलंगाना की टीमों को बीदर की ओर भेज दिया। नतीजतन, एपी और तेलंगाना पुलिस दोनों ने टीमें बनाई हैं और पिन्नेल्ली को पकड़ने की कोशिश कर रही हैं।

चुनाव आयोग ने पलवई गेट गांव में पोलिंग बूथ पर ईवीएम की तोड़फोड़ को गंभीरता से लेते हुए उनकी गिरफ्तारी के आदेश दिए हैं। तब से पिन्नेल्ली रामकृष्ण रेड्डी अपनी कार में हैदराबाद से भाग निकले। सबसे पहले संगारेड्डी के पास अपनी कार से उतरे और अपना मोबाइल फोन वहीं छोड़कर रामकृष्ण रेड्डी फरार हो गये।

संबंधित खबर-

कुल मिलाकर यह मामला आंध्र प्रदेश की राजनीति में और भी रसीला हो गया है। विधायक को पकड़ने के लिए पुलिस जी जान कोशिश कर रही है तो वही पिन्नेल्ली पुलिस से बचने के लिए फिल्मी अंदाज में फरार होते जा रहे हैं। अगर पिन्नेल्ली पकड़ा गया तो उसके खिलाफ गंभीर मामले दर्ज होने की संभावना है। ईवीएम तोड़फोड़ की घटना में दो साल की कड़ी सजा हो सकती है। पिन्नेल्ली इसी डर से भागते जा रहे हैं।

इसके अलावा, पुलिस ने पिन्नेल्ली के खिलाफ अतिरिक्त धाराएं लगाने के लिए अदालत में एक मेमो दाखिल करने का फैसला किया है। यह भी चर्चा है कि पिन्नेल्ली के खिलाफ हत्या के प्रयास का मामला दर्ज होने की संभावना है। आंध्र प्रदेश की राजनीति में यह मामला आखिर में कहां तक ​​जाएगा ये दिलचस्प हो गया है।

పిన్నెల్లి కోసం పోలీసుల, సినిమాను మించిన ట్విస్ట్‌లు

హైదరాబాద్ : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్‌లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తుండగా అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలంగాణ సరిహద్దులు దాటి బీదర్ వైపు వెళ్తున్నట్లు పోలీస్ బృందాలకు సమాచారం అందింది. అంతకు ముందు సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని కంది వద్ద తన కారు, డ్రైవర్, మొబైల్‌ను వదిలేసి పిన్నెల్లి వేరే వాహనంలో వెళ్లిపోయినట్లు ఏపీ పోలీస్ బృందాలు గుర్తించాయి. అక్కడి నుంచి మహారాష్ట్రలోని బీదర్ వైపు వెళ్తున్నారని ట్రాక్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో అలర్ట్ అయిన ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు బీదర్ వైపునకు ఏపీ, తెలంగాణ టీమ్స్ వెళ్లాలని కోరారు. దీంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ పోలీసులు బృందాలుగా ఏర్పడి.. పిన్నెల్లిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

పాల్వయి గేట్ గ్రామంలో పోలింగ్ బూత్‌లో ఈవీఎం ద్వంసం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆయన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి తన కారులో పరార్ అయ్యారు. తొలుత సంగారెడ్డి సమీపంలో తన కారు దిగి మొబైల్ ఫోన్‌ను కూడా అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు రామకృష్ణారెడ్డి.

మొత్తంగా ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరింత రసవత్తరంగా మారింది. పిన్నెల్లో పట్టుకునేందుకు పోలీసులు.. ఆ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి సినిమాను మించిన ఛేజింగ్ నడుస్తోంది. ఒకవేళ పిన్నెల్లి దొరికితే ఆయనపై తీవ్రమైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనపై రెండు సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ భయంతో పిన్నెల్లి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు పిన్నెల్లిపై అదనపు సెక్షన్లు కూడా పెట్టేందుకు కోర్టులో మెమో వేయాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వ్యవహారం చివరకు ఎంత వరకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X