జై తెలంగాణ: ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

हैदराबाद: मुख्यमंत्री रेवंत रेड्डी ने शुक्रवार को तेलंगाना विधानसभा में तेलंगाना मूवमेंट जर्नलिस्ट एसोसिएशन (टीयूजेएस) के लोगो का अनावरण किया। इस अवसर पर मुख्यमंत्री ने कहा कि वे टीयूजेएस को हरसंभव सहायता प्रदान करेंगे। टीयूजेएस के संयोजक एमएम रहमान ने कहा कि तेलंगाना आंदोलन में भाग लेने वाले पत्रकारों के कल्याण और विकास के लिए पिछली सरकार की विफलता के मद्देनजर, आंदोलन के पत्रकारों का संघ बनाया गया है और वे युवा पत्रकारों को शामिल करने के लिए काम कर रहे हैं।

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) లోగోను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టియూజెఎస్‌ కన్వీనర్‌ ఎం.ఎం. రహమాన్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎవఓం చీఫ్‌ పిఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు, సంఘం నేతలు ధన్యావాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘం నేతలు మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్‌, పసూనూరి రవీందర్‌, తాటికొండ రమేష్‌బాబు, సాధిక్‌, ఖాజీపేట నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X