Good News : మోటుమర్రి-విష్ణుపురం మధ్య డబుల్ లైన్ మరియు ఓవర్ రైల్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

హైదరాబాద్: మోటుమర్రి-విష్ణుపురం రైల్వేస్టేషన్ల మధ్య డబుల్‌ రైల్వేలైన్‌ నిర్మాణానికి గురువారం కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సి .హెచ్ . రాకేష్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు రూ. 1,746.20 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడినది. ఈ ప్రాజెక్ట్ వలన ప్రస్తుత లైన్ సామర్థ్యాన్ని పెంచుతూ రైళ్ల వేగం, సమయపాలన మరియు వ్యాగన్ టర్న్ రౌండ్ టైమ్‌లో మెరుగుదలకు దారితీస్తుంది. దీని ద్వారా రైళ్ల రాకపోకల రద్దీని నియంత్రించడానికి మరియు రైళ్ల రవాణాను పెంచడానికి దోహదపడుతుంది.

ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మోటుమర్రి–విష్ణుపురం మధ్య 88.81 కి.మీ.ల రైల్వే లైన్ డబ్లింగ్ మరియు మోటుమారి వద్ద 10.87 కి.మీ.ల మేర రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టు ను ఈరోజు ఆమోదించింది. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు రూ 1,746.20 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడ్డాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది.

గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నూతన భారతదేశం దార్శనికతకు అనుగుణంగా ఈ రెండు ప్రాజెక్టులు లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ కీలకమైన సెక్షన్ లో రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితోపాటు ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల కదలికలకు ప్రయోజనం చేకూరుస్తూ రైళ్ల సగటు వేగాన్నిపెంచడంలో సహాయపడుతుంది అనగా ప్యాసింజర్ రైళ్ల సమయపాలనను మెరుగుపరచడం మరియు వ్యాగన్ టర్నరౌండ్ సమయాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుంది .

మోటుమర్రి-విష్ణుపురం సెక్షన్ లో 88.82 కి.మీ.ల మేర దూరం విస్తరించి, కాజీపేట – విజయవాడ మధ్య అధిక ట్రాఫిక్ సాంద్రత నెట్‌ వర్క్‌ను సికింద్రాబాద్ – గుంటూరు హైలీ యుటిలైజ్డ్ నెట్‌వర్క్‌తో కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట & నల్గొండ జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్. టి. ఆర్ జిల్లాల గుండా విస్తరించి ఉంది. పైన తెలిపిన జిల్లాల్లోని దాదాపు 95 మండలాలకు ఈ ప్రాజెక్ట్ నేరుగా సేవలందిస్తున్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలే కాకుండా మరియు తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో కలిపే ఒక ముఖ్యమైన రైలు అనుసంధానం.

ఈ ముఖ్యమైన రైలు మార్గం సికింద్రాబాద్‌ను విజయవాడతో కలిపే దగ్గరి మార్గం. అందుకని, ఈ క్లిష్టమైన విభాగాన్ని డబ్లింగ్ చేయడం వలన సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేయడం ద్వారా సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య రైలు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది ఈ విభాగంలో రైలు ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కాజీపేట, వరంగల్ మరియు ఖమ్మం మీదుగా సాగే రద్దీగా ఉండే మార్గములో రద్దీని తగ్గిస్తుంది .

ప్రస్తుతం, పరిమిత లైన్ సామర్థ్యం కారణంగా, అనగా సింగిల్ లైన్ వలన ఈ సెక్షన్ లో సరకు రవాణా తరలింపు ప్రభావితమైంది. ఈ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, బొగ్గు మరియు ఇతర స్థానిక ఉత్పత్తుల వేగవంతమైన రవాణా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రజల నిరంతరాయ రాకపోకలను కూడా సులభతరం చేస్తుంది. దీనివలన సికింద్రాబాద్ మరియు విజయవాడ స్టేషన్ల మధ్య నడిచే వివిధ రైళ్ల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలోని తూర్పు ప్రాంతాల నుండి భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలకు సరుకు రవాణా క్రమంగా పెరుగుతోంది. అందువల్ల, ఈ రైలు అనుసంధానాన్ని డబ్లింగ్ చేయడం వల్ల అధిక ట్రాఫిక్‌ను నిర్వహించడం మరియు రైలు వేగం మరియు సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రైళ్ల నిలుపుదలను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మోటుమర్రి స్టేషన్ వద్ద 10.87 కిలోమీటర్ల పరిధి మేర విస్తరించే రైల్ ఓవర్ రైల్, విష్ణుపురం మరియు డోర్నకల్ / భద్రాచలం రోడ్ / కాజీపేట మధ్య కదులుతున్న రైళ్ల క్రాసింగ్ లను నివారిస్తుంది. ఇది రైళ్ల నిలుపుదలను నివారిస్తుంది మరియు సెక్షన్‌లో రైళ్ల యొక్క నిరంతరాయ కదలికలను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా, మోటుమర్రి – విష్ణుపురం సెక్షన్‌ను డబ్లింగ్ చేయడం మరియు మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైల్, సెక్షన్ సామర్థ్యాన్ని పెంచుతుంది, తద్వారా అదనంగా రైళ్లను ప్రవేశపెట్టడానికి / నడపడానికి మార్గం సుగమం చేస్తుంది.

గత పదేళ్లలో రైల్వే రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి Comments…

గత పదేళ్లలో భారతీయ రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఎలక్ట్రిఫికేషన్, high-speed trains, ప్రయాణికులకు వసతుల ఆధునీకరణ, భద్రతా ప్రమాణాల్లో మెరుగుదల, ఈ-టికెటింగ్, ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది.

అమెరికా, చైనా, రష్యా తర్వాత అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారత్ దే. మన రైల్వే వ్యవస్థ భిన్న సంస్కృతులను, భిన్న ప్రదేశాలను కలుపుతోంది. అందుబాటు ధరల్లో ప్రయాణాన్ని అందిస్తూనే.. దేశప్రగతిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. సరుకుల రవాణా నుంచి, ప్రయాణికుల సేవలందించడం, అనుసంధానతలో రైల్వేలు ‘జీవనాడి’లా సేవలందిస్తున్నాయి.

ప్రతిరోజూ 2కోట్ల మంది ప్రయాణికులు రైల్వేల సేవలందుకుంటున్నారు. ఏడాదికి దాదాపు 800 కోట్ల మంది ప్రయాణీకులు రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారు. 2022‑23లో 151 కోట్ల టన్నుల సరుకుల రవాణా భారతీయ రైల్వేల ద్వారా జరిగింది. రైల్వేలు ప్రయాణికుల వద్దనుంచి నిర్వహణ వ్యయంలో కేవలం 53శాతమే వసూలు చేస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి విజన్ కారణంగా.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైల్వే వ్యవస్థగా భారతదేశం ముందుకెళ్తోంది. 2022-23లో మొత్తం స్విట్జర్లాండ్ లోని రైల్వే నెట్‌వర్క్‌తో సమానంగా 5,243 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ నిర్మాణం జరిగింది. 2014-23 మధ్యలో 9 ఏళ్లలో.. 25,434 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ నిర్మాణం, ఆధునీకరణ జరిగింది. ఇది మొత్తం జర్మనీలోని రైల్వే వ్యవస్థతో సమానం. 2004-05లో రైల్వే బడ్జెట్ రూ.8వేల కోట్లుండగా.. 2013-14నాటికి ఇది రూ.29,055కు చేరింది.
2023-24 రైల్వే బడ్జెట్ రూ.2.52 లక్షల కోట్లకు పెరిగింది. ఇది మోదీ గారి హయాంలో రైల్వేల అభివృద్ధికి చేస్తున్న కృషికి ఉదాహరణ మాత్రమే. 2004-05తో పోలిస్తే ఈ రైల్వే బడ్జెట్ 30 రెట్లు ఎక్కువ 2013-14తో పోలిస్తే 8 రెట్లు ఎక్కువ.

కొత్త రైల్వే లైన్లు:
2004-14 మధ్యలో.. 14,985 రూట్ కిలోమీటర్ల రైల్వే ట్రాక్ వేస్తే.. గత 10 ఏళ్లలో 25,871 రూట్ కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం జరిగింది. 2022-23లో రోజుకు 14 కిలోమీటర్ల ట్రాక్ వేయగా.. ఈ ఏడాది రోజుకు 16 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2014 నుంచి 14,337 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్ పనులు పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. 2014 నుంచి 5,750 కిలోమీటర్ల పొడవైన ట్రాక్ ను బ్రాడ్ గేజ్ గా మార్చారు. 2014 నుంచి రైల్వేల విద్యుదీకరణ ప్రాజెక్టులపై ఖర్చుచేసే మొత్తం 5 రెట్లు పెరిగింది (375%). 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు 38,650 కిలోమీటర్ల పొడవైన రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తయింది. ఇది కాకుండా.. 2030 నాటికి ‘నెట్ జీరో కార్బన్ ఎమిటర్’ (కాలుష్య రహిత వ్యవస్థగా) నిలిచే లక్ష్యంతో భారతీయ రైల్వే పనిచేస్తోంది.

దేశవ్యాప్తంగా.. 20,296 కిలోమీటర్ల పొడవైన 231 డబ్లింగ్ ప్రాజెక్టులు.. ప్లానింగ్, అప్రూవల్, నిర్మాణ దశల్లో ఉన్నాయి. వీటి విలువ రూ.2.70లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇందులో 2023 మార్చి వరకు రూ.1.03 లక్షల కోట్ల ఖర్చుచేశారు. అమృత భారత్ పథకంలో భాగంగా.. ఇప్పటివరకు 1309 స్టేషన్లను డెవలప్ చేసేందుకు గుర్తించారు. ఈ స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు, వివిధ ప్లాట్‌ఫామ్ లపైకి ప్రయాణికులు సులభంగా వెళ్లేందుకు సౌకర్యాలు, సైన్ బోర్డుల వంటివి ఉంటాయి. ప్రతి స్టేషన్ డిజైన్.. అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. 508 రైల్వే స్టేషన్ల రీ-డెవలప్‌మెంట్ కోసం శంకుస్థాపన చేసిన సంగతి మీకు తెలిసిందే. ఇందుకోసం రూ.24,470 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు. స్వదేశ సాంకేతికతతో రూపొందిన సెమీ-హై-స్పీడ్ వందేభారత్ రైళ్లు ప్రజలకు సిద్ధమయ్యాయి.

దేశవ్యాప్తంగా 247 జిల్లాల ప్రజలకు ఈ రైళ్ల సేవలు అందుతున్నాయి. ఆధునిక సాంకేతికతతో కూడిన రైలు ప్రయాణం అందుతోంది. ప్రపంచస్థాయి సేవలు, అత్యున్నత భధ్రతా ప్రమాణాలు, హై స్పీడ్ తో గమ్యస్థానాలకు చేర్చడం ఈ రైళ్ల ప్రత్యేకతలు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 52 సెకండ్లలోనే అందుకుంటాయి. గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. దివ్యాంగులకోసం ఈ రైళ్లలో ప్రత్యేక వసతులున్నాయి. ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో రివాల్వింగ్ సీట్లతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది.

మోదీ ప్రభుత్వం ఉపాధికల్పన కోసం ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గత ఐదేళ్లలో (సెప్టెంబర్ 2023 వరకున్న లెక్కల ప్రకారం) రైల్వే శాఖ 2.94 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.
గత పదేళ్లలో 4.9 లక్షల మంది రైల్వేల్లో కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. (ఇందులో లెవల్ 1 నుంచి సెక్యూరిటీ ఉద్యోగం వరకు)

ప్రయాగ్ రాజ్ లో 100 మీటర్ల పొడవైన స్క్రీన్ ద్వారా రైళ్ల రాకపోకలను గమనించే ‘అతిపెద్ద ఆపరేషనల్ కమాండ్ సెంటర్’ పనిచేస్తోంది. రూ.1.09 లక్షల కోట్ల వ్యయంతో.. 2,513 కిలోమీటర్ల పొడవైన ‘2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్’ను రైల్వేశాఖ నిర్మించింది. ఇవి వినియోగంలోకి కూడా వచ్చాయి. పంజాబ్ లోని లూథియానా నుంచి బిహార్ లోని సోన్‌నగర్ వరకు 1,337 కిలోమీటర్ల ఈస్ట్రన్ ఫ్రైట్ కారిడార్.. ముంబై సమీపంలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్ టర్మినల్ (JNPT) నుంచి ఉత్తరప్రదేశ్ లోని దాద్రి వరకు 1,506 కిలోమీటర్ల ప్రాజెక్టులో.. 1,176 కిలోమీటర్ల పని పూర్తయింది. ఇది వెస్ట్రన్ కారిడార్

స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన అటోమేటిక్ రైల్వే భద్రతా వ్యవస్థ – ‘కవచ్’.. 1,465 కిలోమీటర్ల మేర.. 139 లోకోమోటివ్స్ లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. లింగంపల్లి – వికారాబాద్ – వాడి, వికారాబాద్ – బీదర్ సెక్షన్ లో 265 కిలోమీటర్లు మన్మాడ్ – ముద్‌ఖెడ్ – డోన్ – గుంతకల్ సెక్షన్‌ లో 959 కిలోమీటర్లు బీదర్ – పర్భణి సెక్షన్ లో 241 కిలోమీటర్ల మేర కవచ్ వినియోగంలో ఉంది. త్వరలోనే మిగిలిన సెక్షన్లలోనూ ఇది అందుబాటులోకి రానుంది. కవచ్ వ్యవస్థ.. లోకో పైలట్ కు సహాయకారిగా ఉంటుంది. నిర్దిష్ట దూరంలో వేరే రైలు ఉందని తెలిస్తే.. వెంటనే కవచ్ సిస్టమ్ నెమ్మదిగా బ్రేక్ వేస్తుంది. వాతావరణం సరిగ్గా లేని పరిస్థితుల్లోనూ రైలు వేగాన్ని ఈ వ్యవస్థ తగ్గిస్తుంది.

లెవల్ క్రాసింగ్స్, రైల్వేల నిర్వహణ, రైళ్ల మొబిలిటీ, రోడ్డుపై వెళ్లే వారిపై ప్రభావం తదితర అంశాలపైనా రైల్వే ప్రత్యేక దృష్టి సారించింది. 2014-2023 మధ్యలో రూ.30,602 కోట్లు ఖర్చు చేసి.. 1,654 ROBs – రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ 9,213 RUBs – రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మించింది. ప్రపంచంలో తక్కువ సమయంలో ఇంత సంఖ్యలో ROBs, RUBs నిర్మించిన ఏకైక దేశం భారత్. తాజాగా.. 1,863 ROBలు, 2,490 RUBలు మంజూరయ్యాయి. ఇవి ప్లానింగ్, అమలుకు సంబంధించిన వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుకోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి Rs. 8,000 కోట్లు కేటాయించారు.

మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా.. రైల్వే శాఖ ఇటీవల ‘వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్’ (OSOP) పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ నినాదమైన ‘వోకల్ ఫర్ లోకల్’ను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం.
1,083 స్టేషన్లలో 1,200 OSOP ఔట్ లెట్స్ ఆయా ప్రాంతాల్లోని వస్తువులను విక్రయిస్తున్నాయి.
2024 డిసెంబర్ వరకు దాదాపు అన్ని స్టేషన్లలో ఈ OSOP పథకాన్ని అమలు చేసే దిశగా రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.
దీని ద్వారా..
184 మంది కళాకారుల
630 మంది చేతివృత్తులవారు
147 మంది నేతన్నల
202 మంది వ్యవసాయ/అటవీ ఉత్పత్తులను విక్రయించే ఔట్ లెట్స్ ఏర్పాటయ్యాయి.

సరుకుల రవాణాలో రైల్వేల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో.. దాదాపు 50 ‘గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్స్’ వినియోగంలోకి వచ్చాయి. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్‌వర్క్‌ను మరింత పెంచేందుకు బడ్జెట్ కేటాయింపులను రూ.10,269 కోట్లకు పెంచింది. గతంలో ఇది కేవలం రూ.2,122 కోట్లు మాత్రమే ఉండేది. ఒక్క సిక్కిం మినహా ఈశాన్య రాష్ట్రాలన్నీ రైల్ నెట్ వర్క్ తో అనుసంధానం అయ్యాయి. సిక్కింలోనూ వేగవంతంగా పని జరుగుతోంది. 2014 తర్వాత మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం రాష్ట్రాలకు రైల్ కనెక్టివిటీ అందింది.

ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే పియర్స్ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది. ఈ బ్రిడ్జ్ మణిపూర్ లోని జిరిబామ్ వద్దనున్న నోని బ్రిడ్జ్ ను, ఇంఫాల్‌తో అనుసంధానం చేస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ‘బోగీ-బీల్ బ్రిడ్జ్’ అస్సాంలో నిర్మాణంలో ఉంది. దీన్ని బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్నారు. ఈశాన్య భారతంలో త్వరలోనే రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. జమ్మూకశ్మీర్లో.. దేశ స్వాతంత్ర్యం తర్వాత ఓ ప్రతిష్టాత్మకమైన, అత్యంత సంక్లిష్టమైన రైల్వే ప్రాజెక్టును కేంద్రం చేపట్టింది. ఉధమ్‌పూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్ లింక్ (USBRL) నిర్మాణంలో ఉంది. మొత్తం 272 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టులో 161 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. ఇది వినియోగంలోకి కూడా వచ్చింది. ఇందులో కాట్రా – బేనిహాల్ సెక్షన్ లోని 111 కిలోమీటర్లలో 97.41 కిలోమీటర్లు టన్నెల్ లోనే ఉంది. T-49 అనే టన్నెల్ 12.77 కిలోమీటర్లతో దేశంలోనే అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ గా రికార్డులకెక్కింది.

జమ్మూకశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిమీద ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ ను భారతీయ రైల్వే నిర్మించింది. ప్రతిష్టాత్మకమైన ఈ చీనాబ్ బ్రిడ్జ్.. 1.3 కిలోమీటర్ల పొడవుతో.. 467 మీటర్ల ఆర్క్ స్పాన్‌తో (రెండు పిల్లర్ల మధ్య గ్యాప్).. రివర్ బెడ్ కంటే 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఇది ఫ్రాన్స్ లోని ఐఫిల్ టవర్ కంటే 100 ఫీట్లు ఎక్కువ పొడవైనది. భారతీయ రైల్వేలు మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జ్ ను జమ్మూకశ్మీర్లోని అంజిఖాడ్ లో నిర్మించింది. చీనాబ్ నదిపైన 331 మీటర్ల ఎత్తులో ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మితమైంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం 653 కిలోమీటర్ల కేబుల్ వినియోగం జరగగా.. 11 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది.

దేశంలో పర్యాటక రంగాభివృద్ధిలోనూ రైల్వేల పాత్ర చాలా కీలకం. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విస్టాడోమ్ కోచ్ లను రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ప్రయాణికులు అద్భుతమైన అనుభూతిని కల్పించడం వీటి ఉద్దేశం.
కాల్కా – షిమ్లా
గువాహతి – నహర్ లగున్
గువాహతి – బదర్ పూర్
విశాఖపట్టణం – అరకు
న్యూ జలపాయ్‌గురి – అలిపూర్-ద్వారా మధ్య విస్టాడోమ్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

గత 9 ఏళ్లలో దేశవ్యాప్తంగా 6,108 రైల్వే స్టేషన్లలో ఉచిత, హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి.
ప్రపంచంలో అతి తక్కువ సమయంలో ఇన్ని స్టేషన్లకు వైఫై సేవలు అందించిన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. భారతీయ రైల్వేలు, పర్యాటక మంత్రిత్వ శాఖ సహకారంతో ‘థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్’ రైళ్లు.. ‘భారత్ గౌరవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి. భారతదేశ వైభవోపేతమైన సంస్కృతిని, చారిత్రక కట్టడాలను పర్యాటకులకు చూపించేందుకు 3,200 కోచ్ లను భారత్ గౌరవ్ ట్రైన్స్ పేరుతో వినియోగంలోకి తీసుకొచ్చింది. 26 టూరిస్ట్ సర్క్యూట్స్.. 90 పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ.. ఇంతవరకు 156 ట్రిప్పులు పూర్తయ్యాయి. దాదాపు 80వేల మంది ప్రయాణికులు/పర్యాటకులు ‘భారత్ గౌరవ్’ రైళ్ల ద్వారా వివిధ టూరిస్ట్ సర్క్యూట్స్ ను సందర్శించారు. ‘భారత్ గౌరవ్’ రైళ్ల మరో 51 ట్రిప్పుల ప్లానింగ్ పూర్తయింది.

జూన్ 2022లో షిర్డీ యాత్ర సర్క్యూట్ ప్రారంభమైంది. శ్రీ రామాయణ్ యాత్ర కూడా జూన్ 2022లో ప్రారంభమైంది. నేపాల్ లోని జనక్ పూర్ నుంచి తెలంగాణలోని భద్రాచలం వరకు రాముని జీవితంలో ముడిపడిన ప్రాంతాల గుండా ఈ రైలు వెళ్తుంది. 2023 ఏప్రిల్ లో అంబేడ్కర్ సర్క్యూట్ .అంబేడ్కర్ జీవింతో ముడిపడిన పంచతీర్థాలను కలుపుతూ ఈ యాత్ర కొనసాగుతోంది.

వీటితోపాటుగా.. దివ్య కాశీ – ఆది అమావాస్య టూరిస్ట్ రైళ్లు ఓనం హాలిడే స్పెషల్ రైళ్లు ఆస్థా పేరుతో.. అయోధ్య రామమందిరం కోసం రైళ్లు అయ్యప్ప భక్తుల కోసం రైళ్లు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగే కుంభమేళాలు, జాతరల కోసం కూడా రైల్వే అనుసంధానత, ప్రత్యేక రైళ్ల సేవలను కేంద్రం పెంచుతోంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ రైళ్లు పర్యాటకులకోసం వినియోగంలోకి వచ్చాయి.

మోదీ సర్కారు పదేళ్లలో చేసిన కృషి కారణంగా.. త్వరలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ వ్యవస్థలో మూడో స్థానానికి చేరుకుంటాం. నిధుల సద్వినియోగం, వీలైనంత త్వరగా పనుల పూర్తి ద్వారా.. ప్రయాణికులకు, రైతుల ఉత్పతులకు, పారిశ్రామిక ఉత్పత్తులకు సరైన విలువను అందించేందుకు కృషిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు 59 ఎకరాల స్థలం కావాలని అడిగాం. ఇంతవరకు భూ బదలాయింపు జరగలేదు. అందుకే ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ జరగడం లేదు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి. ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలి
అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలి. కార్యకర్తల నుంచి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి వివరాలు సేకరించాం.
ప్రాబబుల్స్ సిద్ధమయ్యాయి. త్వరలోనే కలిసి.. వీలైనంత త్వరగా పేర్లు ప్రకటిస్తాం. బీజేపీ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో తెలంగాణ పేర్లు వీలైనన్ని ఎక్కువ సీట్లు ఉండబోతున్నాయి. మేం 17 సీట్లలో పోటీచేసే ఆలోచనతో ముందుకెళ్తున్నాం.

తెలంగాణలో బీజేపీకి ఓ మంచి వాతావరణం ఉంది. ప్రజలనుంచి సానుకూల స్పందన కనబడుతోంది.
మా ప్రతిపక్షాలు నైరాశ్యంగా ఉన్నాయి. వారికి తమ భవిష్యత్తు అంధకారంలో కనబడుతున్నాయి. ఇవాళ మేం తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు బీజేపీయే గెలవబోతోంది.

గ్రామస్థాయిలో 25 మంది యువకులు, మహిళలు, రైతులతో ఓ కమిటీ వేసి.. చేరికలు చేపడతాం. తెలంగాణలోని 12వేలకు పైగా ఉన్న గ్రామాల్లో మా కార్యకర్తలు కచ్చితంగా వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో అసందర్భంగా మారింది. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయాలకు తాళం వేశారు. తెలంగాణలోనూ రేపు అదే పరిస్థితి. బీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రం, దేశ ప్రయోజనాల దృష్ట్యా మోదీ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X