यात्रीगण कृपया ध्यान दें : सिकंदराबाद से तिरुपति के बीच वंदे भारत एक्सप्रेस ट्रेन, यह है किराया और ऐसी हैं सुविधाएं

हैदराबाद : प्रधानमंत्री नरेंद्र मोदी शनिवार को तेलंगाना में दूसरी वंदे भारत एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाई। रेलवे अधिकारियों ने खुलासा किया कि सिकंदराबाद से तिरुपति जाने वाली वंदे भारत एक्सप्रेस ट्रेन सिकंदराबाद के प्लेटफॉर्म नंबर 10 पर सुबह 11.30 बजे रवाना हो गई।

सिकंदराबाद-तिरुपति वंदे भारत एक्सप्रेस ट्रेन शनिवार को शुरू हो गई है। इस महीने की 9 तारीख को सिकंदराबाद से तिरुपति के बीच यात्रियों के लिए नियमित सेवाएं चलाई जाएंगी। रेलवे अधिकारियों ने घोषणा की है कि यह सिकंदराबाद से सुबह 6 बजे रवाना होगी और तिरुपति से दोपहर 3.15 बजे वापस आएगी।

रेलवे अधिकारियों ने शुक्रवार से ट्रेन से यात्रा करने के लिए अग्रिम टिकट बुकिंग की सुविधा प्रदान की है। इस हद तक एसी चेयर कार के लिए 1680 रुपये और एक्जीक्यूटिव क्लास के लिए 3080 रुपये सिकंदराबाद से तिरुपति के लिए शुल्क लिया जाएगा। रेलवे अधिकारियों ने यह भी कहा कि तिरुपति से सिकंदराबाद का टिकट शुल्क एसी चेयर कार के लिए 1625 रुपये और एक्जीक्यूटिव क्लास के लिए 3030 रुपये निर्धारित किया गया है।

ट्रेन की विशेषताएँ

सिकंदराबाद से तिरुपति जाने वाली वंदे भारत ट्रेन तेनाली और गुडुरु स्टेशनों के बीच 130 किलोमीटर प्रति घंटे की रफ्तार से चलेगी। यह नलगोंडा, गुंटूर, ओंगोलू नेल्लोर होते हुए तिरुपति पहुँचेगी।

यह सिकंदराबाद से तिरुपति तक की कुल 661 किमी की दूरी 8.30 घंटे में तय करती है।

कोचों के बीच विद्युत चालित टच फ्री स्लाइडिंग दरवाजे लगाए गए हैं।

यात्रियों को ट्रेन में सुरक्षित रूप से चढ़ने के लिए स्लाइडिंग फुट स्टेप्स के साथ स्वचालित प्लग दरवाजे लगाए गए हैं।

ग्लोबल पोजिशन सिस्टम (जीपीएस) यात्रियों को समय-समय पर अगले स्टेशनों के बारे में जानकारी प्रदान करता है।

विकलांग यात्रियों की सुविधा के लिए विशेष रूप से डिजाइन किए गए वॉशरूम की व्यवस्था है।

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు, టిక్కెట్‌ చార్జీలు

హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో వందేభారత్‌ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

సికింద్రాబాద్‌-తిరుపతికి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శనివారం కొత్తగా ప్రారంభం కాబోతుంది. ఈ నెల 9న సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ప్రయాణికుల కోసం రెగ్యులర్‌ సర్వీసులు నడిపించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి సికింద్రాబాద్‌ , తిరిగి మధ్యాహ్నం 3.15కు తిరుపతి నుంచి బయలు దేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

రైలులో ప్రయాణించేందుకు శుక్రవారం నుంచి రైల్వే అధికారులు అడ్వాన్స్‌డ్‌ టిక్కెట్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పించారు. ఈ మేరకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఏసీ చైర్‌ కార్‌కు రూ.1680, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు రూ.3080 టిక్కెట్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ఏసీ చైర్‌ కార్‌కు రూ.1625, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌కు రూ.3030 చొప్పున టిక్కెట్‌ చార్జీలు నిర్ణయించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. (ఏజెన్సీలు)

రైలు ప్రత్యేకతలు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లనున్న వందేభారత్‌ రైలు తెనాలి-గూడూరు స్టేషన్ల మధ్య 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం చేయనుంది. నల్లగొండ, గుంటూరు, ఒంగోలు నెల్లూరు మీదుగా తిరుపతి చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వరకు మొత్తం 661 కిలో మీటర్ల దూరాన్ని 8.30 గంటల్లో చేరుకుంటుంది.

కోచ్‌ల మధ్య విద్యుత్‌తో పని చేసే టచ్‌ ఫ్రీ ైస్లెడింగ్‌ డోర్‌లను అమర్చారు.

ప్రయాణికుల సురక్షితంగా రైలు ఎక్కడానికి ైస్లెడింగ్‌ ఫుట్‌ స్టెప్‌లతో పాటు ఆటోమేటిక్‌ ప్లగ్‌ డోర్‌లు ఏర్పాటు చేశారు.

గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) ద్వారా ప్రయాణికులకు ఎప్పటికప్పుడు తర్వాత స్టేషన్ల సమాచారాన్ని అందిస్తుంది.

దివ్యాంగ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా రూపొందించిన వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X