हैदराबाद : शहर में दो माओवादियों की गिरफ्तारी से हड़कंप मच गया है। पुलिस ने मधुकर चिन्ना और उसकी पत्नी श्यामला को गिरफ्तार कर लिया है, जो पिछले कुछ समय से फरार हैं। बाद में उन्हें महाराष्ट्र के गड़चिरौली में स्थानांतरित कर दिया गया। ज्ञातव्य है कि माओवादियों द्वारा किए गए कई हमलों में ये मुख्य आरोपी हैं। समाचार है कि इन माओवादी पर 10 लाख रुपये का इनाम भी है।
2005 में ये महाराष्ट्र के गड़चिरौली जंगल छोड़कर चोरी-छिपे हैदराबाद पहुंच गये। उसके बाद शहर के हयातनगर में बस गए। बताया गया है कि मधुकर चिन्ना एक निजी ट्रैवल कंपनी में सुरक्षा गार्ड के रूप में काम करने लगा। जबकि उनकी पत्नी श्यामला एक शॉपिंग मॉल में सेल्स वुमन के रूप में काम करने लगी। पुलिस को खुफिया एजेंसियों के माध्यम से मामले की जानकारी मिली। सुनियोजित छापेमारी के तहत दोनों को गिरफ्तार कर लिया गया। बाद में उन्हें गड़चिरौली ले जाया गया। इतने दिनों तक माओवादी दंपति इतने सावधान रहे कि कहीं उनकी मौजूदगी का पता न चल जाए। दोनों भीड़ में घुलमिल गये कि किसी शक ही नहीं हुआ। दोनों अपना जीवन व्यतीत करते रहे। लेकिन उनकी हरकतों पर नजर रख रही पुलिस ने आखिरकार उन्हें गिरफ्तार कर ही लिया।
హైదరాబాద్ : నగరంలో ఇద్దరు మావోయిస్టుల అరెస్టు కలకలం రేపుతోంది. గత కొంతకాలంలో తలదాచుకుంటున్న మధుకర్ చిన్నాతో పాటు ఆయన భార్య శ్యామలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని మహారాష్ట్రలోని గడ్చిరౌలికి తరలించారు. మావోయిస్టులు చేపట్టిన పలు దాడుల్లో వీరు కీలక నిందితులుగా ఉన్నట్లు తెలిసింది. వీరిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు సమాచారం.
2005లో మహారాష్ట్ర్లలోని గడ్చిరౌలి నుంచి అడవిని వదిలి రహస్యంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఆ తర్వాత నగర శివారు హయత్ నగర్‌లో తలదాచుకున్నారు. మధుకర్ చిన్నా ఓ ప్రైవేటు ట్రావెల్స్ వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తుండగా అతని భార్య శ్యామల ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ ఉమెన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. నిఘా వర్గాల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గడ్చిరౌలి తరలించారు. ఇన్ని రోజులు తమ ఉనికి తెలియకుండా మావోయిస్టు దంపతులు జాగ్రత్తపడ్డారు. జనంలో కలిసిపోయి ఎలాంటి అనుమానం లేకుండా జీవితం గడిపారు. అయితే వారి కదలిలకపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసారు.
మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా కోసం ఛత్తీస్‌గఢ్ పోలీసులతో పాటు తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు గత కొంతకాలంగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో హిడ్మా తలదాచుకున్నట్లు సమాచారం అందటంతో గత నెల 11న కూబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ- బీజాపూర్ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా హతమయ్యాడని వార్తలు వచ్చాయి.
అయితే హిడ్మా మృతి వార్తలపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. హిడ్మా సేఫ్‌గా ఉన్నట్లు లేఖలో మావోలు లేఖలో పేర్కొన్నారు. ‘ హిడ్మా చనిపోలేదు. హిడ్మా చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. హిడ్మా సేఫ్‌గానే ఉన్నాడు. దక్షిణ బస్తర్‌లోని జంగిల్ కొండలపై పోలీసులు వైమానిక దాడులకు పాల్పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్టు పార్టీ నాయకత్వం ఫ్లాగ్ దెబ్బతియాలనే లక్ష్యంతో పోలీసులు వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలూ లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా ఉంచారు.
వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై వైమానిక దాడులు. ఈ భీకర దాడుల కారణంగా రైతులు తమ పొలాలకు వెళ్లలేకపోతున్నారు. దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాల్సిన అవసరం ఉంది’ అని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. (ఏజెన్సీలు)