రేవంత్‌రెడ్డిపై డీజీపీకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల ఫిర్యాదు

హైదరాబాద్‌ : టిపీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్‌ రావు, ఎల్‌.రమణ, తాతా మధు, శంభిపూర్‌ రాజు, దండె విఠల్‌ కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీని కలిశారు.

రేవంత్‌ రెడ్డి నిన్న పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గ్రైనైడ్స్‌ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే, ఖచ్చితంగా ఇది చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని కోరారు. రేవంత్‌ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని డీజీపీని కోరారు. (ఏజెన్సీలు)

related news:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X