हैदराबाद: इस महीने की 10 तारीख को बीआरएस एमएलसी कल्वकुंट्ला कविता चेन्नई का दौरा करेंगी। कविता एक प्रसिद्ध संगठन द्वारा आयोजित “2024 चुनाव – कौन जीतेगा?” विषयक नामक चर्चा कार्यक्रम में भाग लेगी।
హైదరాబాద్: ఈనెల 10వ తేదీన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో “2024 ఎన్నికలు – ఎవరు విజయం సాధిస్తారు ?” అనే అంశంపై జరిగే చర్చ వేదికలో ఆమె పాల్గొంటారు.
ఈ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచి శివ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నమలై, బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు ఎమ్మెల్యే వాసంతి శ్రీనివాసన్, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతారు.
బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలను ఈ వేదిక ద్వారా కల్వకుంట్ల కవిత చాటిచెప్పనున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు.
సోమవారం నాడు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ వల్ల సామాజికంగా జరిగే లాభాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై చూపించే సానుకూల ప్రభావం గురించి వివరించనున్నారు. అంతేకాకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారు