नये साल में सबका भला हो: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనం చేసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

భక్తుల చిరకాల వాంఛ ఉత్తర ద్వార దర్శనం అదృష్టం

శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కృపతో సీఎం కేసీఆర్ గారి కృషితో ప్రసిద్ధ పుణ్య క్షేత్రంగా యాదాద్రి

కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది

కొత్త సంవత్సరంలో అందరికి శుభాలు జరగాలి… సంతోషంగా ఉండాలి

मंत्री एर्राबेली दयाकर राव ने यदाद्री श्री लक्ष्मी नरसिम्हा स्वामी के दर्शन किये।

యాదాద్రి: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభాలు జరగాలని సంతోషంగా ఉండాలని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కోరుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈరోజు తన సతీమణి శ్రీమతి ఉషా దయాకర్ గారితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్వామి వారిని దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం ఇచ్చారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ…

“గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వములో తెలంగాణ ప్రజలకు 8 ఏళ్ల నుంచి శుభం జరుగుతుంది. రైతులు, సామాన్యులు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. అన్ని కార్యక్రమాల్లో, అభివృద్దిలో ముందుకు పోయాం. కేంద్రం సహకరించకపోయినా భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ముందుకు పోతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు. భక్తులు అంతా సంతోషంగా ఉన్నారు. చిన్న, చిన్న వసతులు పూర్తి అయితే ఇంకా బాగుంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు.

తిరుపతితో సమానంగా అభివృద్ధి జరిగింది. ప్రతి నూతన సంవత్సరం లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుంటాను. 40 ఏళ్ల నుంచి స్వామివారిని దర్శించుకుంటున్నాను. ఏ కార్యక్రమం చేసినా స్వామి ఆశీర్వాదంతో మొదలు పెడుతాను. ఈరోజు ఈ దేవాలయ వైభవం చూశాక చాలా సంతోషం కలుగుతుంది. ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు. భక్తుల చిరకాల వాంఛ ఉత్తర ద్వార దర్శనం రేపటి నుంచి ప్రారంభం కావడం నిజంగా సంతోషం. ఇందుకోసం సీఎం కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆలయంలో వసతులు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X