హైదరాబాద్ : బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. తనపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డికి ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. నిత్యం ఆరోపణలు చేసే రాజగోపాల్ రెడ్డికి ఆమె కడిగి పారేశారు.
రాజగోపాల్ అన్న.. తొందరపడకు.. మాట జారకు అని కవిత సూచించారు. 28 సార్లు కాదు, 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు అని కవిత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
రాజగోపాల్ అన్న ..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC
మరోవైపు మానిక్కం ఠాగూర్ కు ఎమ్మెల్సీ కవిత రిప్లై ఇచ్చారు,
“నాపై నిందలు పూర్తిగా బోగస్ మరియు అవాస్తవం. నా నిబద్ధతను కాలమే రుజువు చేస్తుంది. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఎండగడుతుండడంతో బీజేపి భయపడుతున్నది.”