वाईएसआर तेलंगाना पार्टी: वाईएस शर्मिला की प्रजा प्रस्थानम पदयात्रा को 15 शर्तें

हैदराबाद : वरंगल पुलिस ने वाईएसआर तेलंगाना पार्टी की अध्यक्ष वाईएस शर्मिला की प्रजा प्रस्थानम पदयात्रा फिर से शुरू करने की अनुमति दे दी है। उन्होंने इस महीने की 28 तारीख से पदयात्रा जारी रखने की अनुमति मांगी, लेकिन पुलिस ने 15 शर्तों के साथ 2 फरवरी से पदयात्रा जारी रखने की अनुमति दी है।

पुलिस ने “पदयात्रा केवल सुबह 10 बजे से शाम 7 बजे तक की जानी चाहिए। पार्टियों, जातियों और धर्मों के बारे में कोई विवादित टिप्पणी न करें। इसके अलावा किसी का व्यक्तिगत अपमान नहीं करना चाहिए। सरकारी और गैर-सरकारी संगठनों के कार्यों में बाधा नहीं आनी चाहिए।” जैसी 15 शर्तें लगाई हैं।

इन शर्तों पर प्रतिक्रिया व्यक्त करते हुए शर्मिला ने कहा, “हमारी पदयात्रा केसीआर के शासन की अंतिम यात्रा है। केसीआर को डर है कि अगर लोग हर कदम पर जोरदार स्वागत कर रहे हैं तो मुख्यमंत्री को पसीना आ रहा है। सवाल करने वाली आवाज को चुप कराने की कोशिश कर रहे हैं। इसलिए 15 शर्तें रखी गई हैं।” जनता की समस्याओं को जानना हमारा कर्तव्य है।”

హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభానికి వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు 15 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.

“ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే పాదయాత్ర నిర్వహించాలి. పార్టీలు, కులాలు, మతాలను ఉద్దేశిస్తూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు. దీంతో పాటు వ్యక్తిగతంగా ఎవ్వరిపై దూషణలు చేయకూడదు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు.” లాంటి 15 షరతులను పోలీసులు పెట్టారు.

పోలీస్ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు రేపటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను ఫిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు. పాదయాత్ర ఆగిన చోట నుంచే అంటే నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తాండా నుంచే పాదయాత్ర మొదలు కానుంది.

వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట నియోజక వర్గాలలో పాదయాత్ర పూర్తవ్వగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగనుంది. వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘనపూర్, జనగాం, పాలకుర్తి, మహబూబాబాద్ మీదుగా పాలేరు నియోజక వర్గంలో మరోసారి అడుగు పెట్టేలా రూట్ మ్యాప్ సిద్ధం అవుతుంది.

ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3512 కిలో మీటర్లు పూర్తి కాగా 4 వేల కిలో మీటర్లు పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. ముగింపు సభ పాలేరు నియోజకవర్గంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. అయితే ఎవరి పాదయాత్రకు లేని షరతులు తమ పాదయాత్రకు పెట్టడంపై వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మా పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమయాత్ర. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే కేసీఆర్‌కి భయం పట్టుకుంది. పాలనపై ప్రజా వ్యతిరేకత వ్యక్తం అవుతుంటే కేసీఆర్‌కు చెమటలు పడుతున్నాయి. ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు. అందుకే 15 కండీషన్లు పెట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే మా కర్తవ్యం.” అంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X