పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు… వేడి వేడి చర్చలు… మరి దీని సంగతి ఏమిటి?

పాలకులు ప్రజల సమస్యలు చర్చించకుండానే పాలన చేసే ఒకనాటి రాజరికం నుండి ప్రజల సమస్యలు చర్చించకుండా పాలన కొనసాగించలేని రాజ్యం ఇది. దీనినే ప్రస్తుతం ప్రజాస్వామ్యం అంటున్నాం. రాజ్యమంటే ఎవడురా? రాజ్యమంటే నేనే అనే ఫ్రెంచ్ పాలకుడైన పదహారవ లూయికి కాలం చెల్లి చాలాకాలం అయ్యింది. దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్! దేశమంటే మనుషులు కాబట్టి నేటి రాజ్య పాలకులకు ప్రజల సమస్యలను చర్చించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. అవ్వి నెరవేరుతాయా లేదా అనేది భవిష్యత్తులో బహిర్గతమవుతాయి.

దక్షిణ భారత రాష్ట్రాల్లో వాతావరణం

పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి కార్బన్ ఉద్గారాలతో చలికాలపు దట్టమైన పొగ మంచుతో కమ్ముకుపోతున్న ఢిల్లీ నగరంలో పార్లమెంట్ చలికాలపు సమావేశాలు వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ఆయుస్షు తగ్గినా కార్బన ఉద్గారాల వలన కాలేయపు సంబంధపు వ్యాధులు వచ్చినా మనుషుల మనుగడే ప్రశ్నార్థకంగా మారినా ఢిల్లీ నగరం నుండి పార్లమెంటును దేశంలోని యే ఇతర ప్రాంతాలకి తరలించదల్చుకోలేదు. దక్షిణ భారత రాష్ట్రాల్లో మెరుగైన సౌకర్యవంతమైన వాతావరణం ఉన్నప్పటికీ.

గౌతమ్ ఆధానీపై చర్చ

ఇకపోతే ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఆధునిక ప్రపంచం సృష్టించిన స్టాక్ ఎక్స్చేంజీలు. స్టాక్ ఎక్స్చేంజీలలో వాటాల కొనుగోళ్ల ద్వారా పోగుపడుతున్న కట్టల కట్టల డబ్బులు.షేర్ మార్కెట్ షేర్ల ధరలు కృతిమంగా పెంచుతూ అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదిస్తూ ఎదిగిన భారతీయ అఫర కుబేరుడు గౌతమ్ ఆదానీ. ఇవి మాత్రమే కాకుండా భారత కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎయిర్ పోర్టులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సంపాదన ఇంకా ఖండాలు దాటి విస్తరించడానికి నౌకాయానాలు పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ముప్పై నుండి నలబై శాతం వాటాలు తక్కువ ధరలకు కట్టబెట్టి భారత ప్రభుత్వం గౌతమ్ ఆదానినీ ప్రపంచ కుబేరుల జాబితాలో చేర్చింది.

Also Read-

కుబేరుడు గౌతమ్ ఆధానీ

దేశ ప్రస్తుత అఫర కుబేరుడు గౌతమ్ ఆధానీపై అమెరికా కోర్టులో లంచాల అభియోగం నమోదైన కేసు వ్యవహారంపై భారత పార్లమెంటులో శీతాకాలపు సమావేశాలలో వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. దేశీయ స్థాయిలో నుండి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోకి చేరిన తన అక్రమ సంపాదన ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలలో భారతీయ పేరు ప్రతిష్టలను దిగజార్చుతుంటే భారత ప్రభుత్వం మౌనవ్రతం చేస్తూ ఉంది.

వక్ఫ్ సవరణ బిల్లు

అలాగే గత పార్లమెంటు సమావేశాలలో అమోదం పొందిన వక్ఫ్ సవరణ బిల్లు కూడా అత్యంత ముఖ్యమైనది. మహమ్మద్ ప్రవక్త కాలంలో వక్ఫ్ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో నేటికీ కొనసాగుతుంది. భారతదేశాన్ని సుమారు వెయ్యిళ్లపాటు పరిపాలించిన ముస్లిం రాజులు మసీదుల పేరిట దర్గాల పేరిట విద్యాలయాల పేరిట విలువైన భూములను కేటాయించారు. ఎందుకంటే మసీదులు విద్యాలయాలు ఆర్థిక కొరత లేకుండా సజావుగా నడవాలని ఇవన్నీ కూడా నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయించారు.

వస్తువులను అమ్ముకోవడానికి బ్రిటీష్ వారు

ఇంగ్లాండ్ పారిశ్రామిక విప్లవం ఫలితంగా వస్తువులను అమ్ముకోవడానికి బ్రిటీష్ వారు ప్రపంచపు నలుమూలలకు వెళ్లాల్సిన ఒక అవసరం వచ్చినప్పుడు వారు మన ఇండియాకు కూడా రావడం జరిగింది. బ్రిటిష్ వారి చేతిలోకి పరిపాలన పగ్గాలు వెళ్లిన తర్వాత వేయి సంవత్సరాల వక్ఫ్ భూములను సవరించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఇండియా నుండి బ్రిటిష్ వారు వెళ్ళిన తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు పేరిట ఆ భూములను గుంజుకునే ఆలోచన చేస్తుంది.

అనుమానాలున్నాయి

వీటితో పాటుగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో చర్చించే కోస్టల్ షిప్పింగ్ బిల్లు, భారతీయ ఓడరేవుల బిల్లు, మర్చంట్ షిప్పింగ్ బిల్లులు మొత్తం పదహారు బిల్లులో కొన్ని ఇప్పటికే ఆమోదించివి కొన్ని కొత్త బిల్లులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూటమి గతంలో నూట డెబ్బై మంది పార్లమెంటు సభ్యులను పార్లమెంటు నుండి సస్పెండ్ చేస్తూ ఎన్నో బిల్లులను ఆమోదించుకున్న చరిత్ర ఆ పార్టీకి ఉన్నది. అలాంటప్పు ప్రస్తుత జరిగే పార్లమెంటరీ శీతాకాలపు సమావేశాల్లో చర్చలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగుతుందా అని అనుమానాలున్నాయి.

గుండమల్ల సత్యనారాయణ
8919998619

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X