తెలంగాణకు మొండిచేయి… కేంద్ర బడ్జెట్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : “కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఐదో బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది. రూ. 45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. పార్లమెంటు వేదికగా విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ, ఏదైనా సాగు నీటీ ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలను బడ్జెట్లో విస్మరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐటీఆర్ ప్రాజెక్ట్ ప్రస్తావన లేదు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ప్రతి పేదవాడి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

2014 ఎన్నికల సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు లెక్కన ఈ 9 ఏళ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రానికి 75 లక్షల ఉద్యోగాలు దక్కాల్సి ఉంది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు వివిధ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి 22 కోట్ల దరఖాస్తులు వస్తే 7 లక్షలు ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొంది. దీన్ని బట్టి ఉద్యోగ, ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రైతుల ఆదాయం సంగతి ఏమోగానీ పెట్టుబడి మాత్రం రెండింతలైంది. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని రకాలుగా కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది. ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రానికి మాత్రం నిధులు కేటాయించింది. కానీ తీవ్రమైన వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలంగాణ పట్ల మాత్రం కేంద్రం వివక్ష చూపింది. కరోనా కాలంలో అదుకున్న ఉపాధి హామీ పథకానికి నిధులను, పనిదినాలను కేంద్రం తగ్గించింది. పేదల పట్ల ఈప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ, పట్టింపు లేదు. ఏరకంగా చూసినా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను కాంగ్రెస్ ఖండిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అండగా నిలబడింది. బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ, బీఆరెస్ ఇద్దరు దోషులే. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణకు అన్యాయం చేశారు. ఇప్పటికైనా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయించాలి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రక్రియను మొదలు పెట్టాలి.
మోదీ గారు మీరు గుజరాత్ కు బుల్లెట్ ట్రైన్, అవసరమైన నిధులు తీసుకుపోతారు. మోదీగారు మీరు గుజరాత్ కు సీఎం కాదు.. ఈ దేశానికి ప్రధాని. నిధుల కేటాయింపులో గుజరాత్ కు కల్పించిన ప్రాధాన్యతను తెలంగాణకు కల్పించండి.

మోదీ అన్యాయం చేస్తుంటే.. నిలదీయాల్సిన బీఆరెస్.. సభలో నిస్సహాయంగా నిలబడింది. అవినీతిని కప్పి పుచుకోవడానికే.. కేసీఆర్ కేంద్రంతో కాళ్లబేరానికి దిగాడు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా చేసిన పాపాన్ని కడుక్కోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది కానీ నిధులు రాబట్టేందుకు చొరవ చూపడం లేదు. పార్లమెంటు వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం కలిగిన మోదీ.. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ అభివృద్ధి కోసం పునర్విభజన చట్టంలో చేసిన హామీలను ఎందుకు విస్మరిస్తున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.”

హాత్ సే హాత్ జోడో యాత్ర

“ఫిబ్రవరి 6 న ములుగు నుంచి సమ్మక్క సారక్క నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. జాతీయ స్థాయి నాయకత్వం కూడా వివిధ సందర్భాలలో ఈ యాత్రలో పాల్గొంటుంది. మొదటి విడతగా 60 రోజులు.. 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ఈ యాత్ర చేయాలనుకుంటున్నాం. ఆ తరువాత కొనసాగించే విషయం పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.”

ఎంపీ కోమటిరెడ్డివెంకటరెడ్డి కామెంట్స్…

“కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉంది. తెలంగాణ ప్రజలకు ఉపయోగం లేకుండా రూపొందించారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఊసేలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ మరోసారి విస్మరించింది.

విభజన చట్టాన్ని ఆమోదించి పదేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. బడ్జెట్‌ లో కూడా బీజేపీ రాజకీయమే చేసింది. ఎన్నికలున్న రాష్ట్రాలకు వెసులుబాటు ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు అన్యాయం చేసింది. ప‌న్ను మిన‌హాయింపు సగటు జీవికి నిరాశనే మిగిల్చింది.

ఏడు ప్రాధాన్యతా రంగాలన్నారు. అసలు ఉన్న రంగాలను గాలికొదిలేశారు. దేశ రైతాంగాన్ని, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా ఉంది ఈ బడ్జెట్‌.”

Telangana has been completely neglected in the union budget – says Revanth Reddy

Hyderabad: Revanth Reddy said that the fifth budget presented by Union Finance Minister Nirmala Sitharaman is a major disappointment. Huge injustice is being done to Telangana in the budget introduced with Rs.45 lakh crores. Promises like Bayyaram steel factory, Kazipet railway factory and national status for any irrigation project mentioned in the bifurcation act have been ignored in the budget. He also recalled that there is no mention of the ITIR project given by the Congress Party in the past.

During the 2019 elections, Prime Minister Modi promised to double the income of farmers by 2022 and construct houses for every poor person. During the 2014 elections, he promised to provide 2 crore jobs every year. None of these promises have been fulfilled. Revanth Reddy mentioned that 18 crore jobs are to be provided in these 9 years considering 2 crore jobs every year. Out of that, Telangana state needs to get 75 lakh jobs. He recalled that in response to a question asked by him in the last parliamentary session, it was stated that 7 lakh jobs were given out of the 22 crore applications received from the unemployed. This reveals that the Modi government has completely failed in creating jobs and employment.

He criticised that leave about doubling the income of the farmers, their input costs have been doubled certainly. This has led to the farmers to commit suicides. There was mention about the Palamuru-Ranga Reddy project when Modi visited Mahbubnagar during the 2014 elections. But till now the project has not been given national status. The centre has disabled Telangana in all the ways. He remarked that funds have been allocated to the state of Karnataka where elections are going on. But the Center has discriminated against Telangana which is facing severe agricultural crisis.

The Center has reduced the funds and working days for the Employment Guarantee Scheme which was a saviour during the Corona period. Revanth Reddy said that this government is least bothered about the poor. Congress is completely condemning the budget presented by Nirmala Sitharaman. He criticised that the state government stood by the centre for the injustice done by the central government. Both BJP and BRS are the culprits in the injustice done to Telangana in the budget. The two co-thieves Modi and KCR have done this injustice to Telangana.

He remarked that at least now, national status should be given to irrigation projects in Telangana. The Union government should allocate necessary funds to build houses for every poor person in the state and should start the railway coach factory. The process for the Bayyaram steel factory should also be started.
Revanth Reddy criticised “Mr. Modi, you will bring bullet train and necessary funds to Gujarat. Modi, you are not the CM of Gujarat, but the Prime Minister of this country.”

He asked to give equal priority to Telangana as given to Gujarat in allocation of funds. He said that BRS stood helplessly in the House when Modi is doing this injustice. KCR is in nexus with Modi to cover his corruption. BRS is trying to wash away its sin of boycotting the President’s speech but is not taking any initiative to bring funds. He questioned that Why Modi, who has complete faith in the parliamentary system is ignoring the promises made in parliament according to the reorganisation act for the development of Telangana.The centre is responsible for rectifying the injustice done to Telangana.

Haath Se Haath Jodo Yatra

Revanth Reddy announced that Haath Se Haath Jodo Yatra starts from Mulugu – Sammakka Sarakka on February 6. National level leadership also participates in this yatra at various occasions. The leaders intended to conduct this Yatra in 40 to 50 constituencies for 60 days in the first phase. After that they will discuss about its continuation in the party and will make a decision accordingly.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X