ఆ 12మంది ఎమ్మెల్యేలపైనా సీబీఐ విచారణ చేపట్టాలి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (E)

*మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ నేతల ఫిర్యాదు
*2014 నుంచి జరిగిన ఫిరాయింపులపైనా విచారణ చేయాలి
*డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తామన్న రేవంత్
*విచారణ వ్యవస్థలు స్పందించకుంటే కోర్టుకు
*రాజకీయ పోరాటానికి వెనకాడమని హెచ్చరిక

హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన 12మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కోరింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఆధారాలతో టీపీసీసీ నేతల బృందం మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముందుగా సీఎల్పీలో భేటీ అయిన నేతలు అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశారు. 455 ఎఫ్.ఐ. ఆర్. తో పాటు తాము ఇచ్చిన ఆధారాలను కూడా పరిశీలించాలని తెలిపారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కేసీఆర్ కుట్రను ఛేదించాలని, కేసీఆర్ ఫిరాయింపు రాజకీయాలకు సమాధి కట్టాలన్నారు రేవంత్. టీపీసీసీ నేతల బృందం ఫిర్యాదు చేసే సమయంలో ఉన్నతాధికారులు లేకపోవడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి ఫిర్యాదు చేయడానికి వస్తే ఏసీపీ, సిఐ స్థాయి అధికారులు స్టేషన్ లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. అందుబాటులో ఉన్న ఎస్ఐ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.

పార్టీ ఫిరాయింపులతో కెసీఆర్ తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని విమర్శించారు రేవంత్. అందుకే 2014 నుంచి పాలనను గాలికి వదిలి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే పనిలో పడ్డారన్నారు. 2018లో కేసీఆర్ పార్టీలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, హామీలు అమలు చేయాలని జనం సంపూర్ణ మెజారిటీ ఇచ్చినా కేసీఆర్ ఆలోచనలో మార్పు రాలేదని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా ఫిరాయింపులను కొనసాగించారన్నారు.

ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే చూసి కేసీఆర్ ఓర్వలేకపోయారని, అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిరాయింపులకు ప్రోత్సహించారని రేవంత్ మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ వివిధ సందర్భాల్లో పిర్యాదు చేసినా స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు లంచంగా ప్రభుత్వం పదవులు, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చిందన్నారు.

డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేస్తాం

ఎమ్మెల్యేల కొనుగోలుపై పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని… అయితే కోర్టు పరిధిలో ఉంచాల్సిన ఆధారాలు సీఎం వద్దకు చేరాయని గుర్తు చేశారు రేవంత్. రాష్ట్ర పరిధిలో ఉన్న ఈ కేసును కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 12 మందిపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని, కేవలం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లోనే కాకుండా డీజీపీ, ఈడీ, సీబీఐ డైరెక్టర్ కు కూడా పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని తెలిపారు రేవంత్. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అవసరమైతే ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా రాజకీయ పోరాటం చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

  • TPCC leaders complained in Moinabad Police Station
  • Defections from 2014 should also be investigated
  • Revanth said that he will also complain to the DGP, ED and CBI director
  • To approach court if investigative agencies do not respond
  • Will not back down from political struggle said Revanth

Hyderabad: TPCC President Revanth Reddy has demanded that the CBI investigate the 12 MLAs who defected from the party. In the wake of the High Court’s order to hand over the MLAs’ purchase case to the CBI, the TPCC has requested that steps be taken to investigate MLAs who have defected from the party. In this regard, a group of TPCC leaders filed a complaint with the Moinabad police with full details. The leaders who first met in the CLP later went to the Moinabad Police Station and complained about the defecting MLAs.

CBI should investigate all those 12 MLAs: TPCC president Revanth Reddy

He also said that the evidence given by them should be examined along with FIR no 455. Revanth wants to break KCR’s conspiracy to make the state opposition less and to bury KCR’s defection politics. Revanth Reddy was angry at the absence of higher officials when the group of TPCC leaders complained. It is unfortunate that ACP and CI level officers are not present at the station when MPs and MLAs come to complain. They said that they have complained to the available SI.

Revanth criticized that KCR wanted to consolidate his power with MLA defections. That is why since 2014 they did not concentrate on administration and started to weaken the opposition. He said that in 2018, KCR had 88 MLAs and even though the people gave an absolute majority to implement the promises, there was no change in KCR’s thinking.

He said that even after coming to power for the second time, the defections continued. Revanth fumed that KCR could not bear to see a Dalit leader as the leader of the opposition and therefore encouraged Congress MLAs to defect. It was alleged that the speaker did not act fairly even though the Congress party complained on different occasions against the defecting MLAs. He said that the government has provided positions and financial benefits to the legislators who defected from the party.

We will also complain to DGP, ED and CBI Director

Revanth reminded that Pilot Rohit Reddy had filed a complaint at Moinabad Police Station about the purchase of MLAs… but the evidence to be kept within the jurisdiction of the court had reached the CM. The court has ordered a CBI investigation into this case, which was previously under the jurisdiction of the state, and in this context, it has been demanded that an investigation be conducted against the 12 people who defected from the party.

Revanth said that a full-scale investigation should be conducted on the defections that have taken place since 2014 and not only at the Moinabad police station but also with the DGP, ED and CBI director with full details. If the investigation systems do not respond properly, they will approach the court. Revanth warned the defected MLAs not to step in the legislatures again and to go back to fight the political battle if necessary.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X