TPCC: ఘనంగా భారత జాతీయ కాంగ్రెస్ 38వ ఆవిర్భావ దినోత్సవం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…

హైదరాబాద్ : భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం గాంధీ భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ పార్టీ జెండా ను ఎగురవేశారు. పార్టీ వ్యవస్థాపకులు హ్యూమ్, జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలు చల్లి నివాళులు అర్పించిన కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్స్ అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, బలరాం నాయక్, సంభాని చంద్రశేఖర్, పొన్నం ప్రభాకర్, మల్లు రవి, సేవదల్ చీఫ్ ప్రసాద్, గడ్డం వినోద్, రామచంద్రారెడ్డి, వినోద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సంగిశెట్టి జగదీష్, రోహిన్ రెడ్డి, సమీర్ ఉల్లా, అనుబంధ సంఘాల ఛైర్మన్ లు మెట్టు సాయి, నూతి శ్రీకాంత్, సునీతా రావ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందన్నారు. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ.. పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారని రేవంత్ గుర్తు చేశారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారని చెప్పారు. తమ పార్టీ నేతలను బలిగొన్నా… దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్‭ను నిలబెట్టారని చెప్పారు. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… “దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు, అందరికీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించింది. ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చింది. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొట్లాడారు. నేతలను బలిగొన్నా దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారు. ప్రపంచ దేశాల ముందు శక్తివంతమైన దేశంగా భారత్ ను నిలబెట్టారు. పేదలను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ది మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకుండా ఆనాడు బీజేపీ అడ్డుకుంది.”

“తెలంగాణలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉందంటే.. అది కాంగ్రెస్ హయాంలో తీసుకున్న నిర్ణయమే. స్వాతంత్ర్యనికి పూర్వపు పరిస్థితులే ఇప్పుడు దేశంలో ఉన్నాయి. బ్రిటిష్ విధానాలను దేశ ప్రజలపై రుద్దాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచికాపాడేందుకే రాహుల్ గాంధీ పాద యాత్ర. తెలంగాణలో 375 కి.మీ రాహుల్ పాదయాత్ర చేశారు. చార్మినార్ లో జెండా ఎగరేసి ప్రజలకు సంపూర్ణ నమ్మకాన్ని కలిగించారు. మహాత్ముడి స్పూర్తితో ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు.”

“రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోదీ ప్రభుత్వానికి పట్టింపు లేదు. రాహుల్ పాదయాత్ర భయంతోనే మోదీ కోవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారు. దేశ సమగ్రతను పణంగా పణంగా పెట్టి బీజేపీ కుట్రలు చేస్తోంది. కేసీఆర్ చేతిలో ర్రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ ఎందుకు నిలదీయడంలేదు. రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మనకున్న సమస్యలను పక్కనబెట్టి ప్రజల కోసం కదలండి. జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు కడలిరండి. ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రతినబూనుదాం. వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని శ్రేణులను కోరుతున్నా.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X