BRS In Andhra Pradesh: భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్, రావెల కిషోర్ బాబు, దుమ్ములేపిన KCR Speech

देश के हित के लिए भारत राष्ट्र समिति

हैदराबाद: भारत राष्ट्र समिति पार्टी में पूर्व आईएएस तोटा चंद्रशेखर, पूर्व मंत्री रावेला किशोर बाबू और आंध्र प्रदेश राज्य के पूर्व आईआरएस चिंतला पार्थसारथी सोमवार को तेलंगाना भवन में मुख्यमंत्री केसीआर की उपस्थिति में शामिल हो गए। इस मौके पर उन्हें बीआरएस अंगवस्त्र पहनाकर पार्टी में स्वागत किया। उनके साथ टीजे प्रकाश (अनंतपुरम), ताडिवाका रमेश नायडू (कापुनाडु, राष्ट्रीय अध्यक्ष), गिद्दल श्रीनिवास नायडू (कापुनाडु, महासचिव) और रामा राव (एपी प्रजा संघ जेएसी अध्यक्ष) ने भी बीआरएस पार्टी में शामिल हो गये।

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో చేరారు.

ఈ సంద‌ర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు టీజే ప్ర‌కాశ్‌ (అనంత‌పురం), తాడివాక ర‌మేశ్ నాయుడు (కాపునాడు, జాతీయ అధ్య‌క్షుడు), గిద్ద‌ల శ్రీనివాస్ నాయుడు (కాపునాడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి), రామారావు(ఏపీ ప్ర‌జా సంఘాల జేఏసీ అధ్య‌క్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ స‌మావేశంలో మంత్రులు ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. తోట చంద్రశేఖర్‌ ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2014లో ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. అనంతరం జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన తరఫున గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేసినా.. అక్కడా ఆయనకు ఫలితం దక్కలేదు. ఇప్పుడు చంద్రశేఖర్ బీఆర్‌ఎస్‌లో చేరడం విశేషం.

బీఆర్ఎస్ అంటే త‌మ‌షా కోస‌మో, చ‌క్కిలిగింత‌ల కోస‌మో, దేశంలో ఒక మూల కోస‌మో, ఒక రాష్ట్రం కోస‌మో కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫ‌ర్ ఇండియా. క‌చ్చితంగా ల‌క్ష కి.మీ. ప్ర‌యాణ‌మైన తొలి అడుగుతోనే ప్రారంభ‌మ‌వుతుంది. ల‌క్ష్య శుద్ధి, సంక‌ల్ప శుద్ధి ఉంటే.. సాధించ‌లేనిదంటూ ఏమీ ఉండ‌దు. ప్ర‌పంచంలో మాన‌వ‌ జీవితంలో అనేక ప‌ర్యాయాలు ఆ విష‌యాలు రుజువ‌య్యాయి అని బీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థితో పాటు ప‌లువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.

మీ అంద‌రికి స్వాగ‌తం చెప్ప‌డంతో పాటు చాలా పెద్ద బాధ్య‌త‌ పెట్ట‌బోతున్నాను. ఒక‌ప్పుడు స్వాతంత్ర్యానికి పూర్వం రాజ‌కీయాలంటే త్యాగం. జీవితాల‌ను ఆస్తుల‌ను, కుటుంబాల‌ను, అవ‌స‌ర‌మైతే ప్రాణాల‌ను త్యాగం చేసేట‌టువంటి రాజ‌కీయాలు ఉండేవి. ఆ త‌ర్వాత స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్ల‌లో నాటి ప్ర‌ధాని నెహ్రూ ఆధ్వ‌ర్యంలో, అంబేద్క‌ర్ మార్గ‌ద‌ర్శ‌నంలో రాజ్యాంగాన్ని రూప‌క‌ల్ప‌న చేసుకుని కార్య‌ల‌కాపాలు మొద‌లుపెట్టాం. చ‌క్క‌టి ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాం అని కేసీఆర్ గుర్తు చేశారు.

వార్షిక ప్ర‌ణాళిక‌లు, పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక‌లు, ఒక విజ‌న్, డైరెక్ష‌న్ ఏ ప‌ద్ధ‌తిలో ఈ దేశం ముందుకు పోవాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కొన్ని బాట‌లు వేయ‌బ‌డ్డాయి. సాగుతూ వ‌చ్చాం. ఆ త‌ర్వాత రాజ‌కీయాలు, ప్ర‌జాజీవితంలో అనేక మార్పులు సంభ‌వించాయి. గ‌త 50 ఏండ్ల సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో నాకు అవ‌గాహ‌న క‌లిగిన‌టువంటి భార‌త‌దేశం ఏ ద‌శ‌కు చేరుకోవాల్నో చేరుకోలేదు. ప్ర‌జ‌ల కోరిక‌లు, స్వాతంత్ర్య ఫ‌లాలు సిద్ధించ‌లేదు. మ‌న కంటే అమెరికా, చైనా ముందున్న‌వి. అమెరికా భూభాగంలో 29 శాతం మాత్ర‌మే వ్య‌వ‌సాయ భూములు ఉన్నాయి. 16 శాతం మాత్ర‌మే సాగు యోగ్య‌మైన భూమి చైనాలో ఉంది. కానీ మ‌న దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎక‌రాల భూమి ఉంటే అందులో ర‌మార‌మి 40 కోట్ల ఎక‌రాల భూమి వ్య‌వ‌సాయానికి అనుకూలంగా ఉందని కేసీఆర్ తెలిపారు.

వ్య‌వ‌సాయం బాగా, అద్భుతంగా జ‌ర‌గాలంటే.. సూర్యకాంతి ఉండాలి. అప్పుడే పంట‌లు పండుతాయి. సూర్య‌కాంతి కూడా అపారంగా ఉంది. మ‌న వ‌ద్ద మూడు ర‌కాల ప‌ర్యావ‌ర‌ణ మండ‌లాలు ఉంటాయి. స‌ముద్ర తీర‌ప్రాంతాల్లో ఉండే వాతావ‌ర‌ణం ప‌లు రాష్ట్రాల్లో ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు, అతిశీతలంగా ఉండే హిమాల‌యాలు కూడా ఉన్నాయి. ఆగ్రో క్లైమాటిక్ కండిష‌న్‌లో యాపిల్, మామిడి పండుతాయి. మ‌న దేశంలో ప్ర‌తి ఏడాది ఒక ల‌క్షా 40 వేల టీఎంసీల వ‌ర్షం కురుస్తోంది. ఇది కేంద్రం చెబుతున్న లెక్క‌. 70 వేల టీఎంసీల నీరు పుష్క‌లంగా ఉంది. భూమి, సోలార్, పర్యావ‌ర‌ణ మండ‌లాలు ఉన్నాయి. ప‌ని చేసేట‌టువంటి మ‌న‌షులు ఉన్నారు. త‌గిన ప‌ద్ధ‌తిలో ముందుకు వెళ్తే.. ప్ర‌పంచంలోనే ఇండియా బెస్ట్ ఫుడ్ చైన్‌క‌లిగి ఉండే కంట్రీగా ఉండాలి. మ‌న రైతు లోకమంతా బ్ర‌హ్మాండంగా ఉండాలి. కానీ 13 నెల‌ల పాటు రైతులు ధ‌ర్నాలు చేసి, ప్రాణాలు కోల్పోయార‌ని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ల‌క్ష‌ల కోట్ల రూపాయాల విలువైన పామాయిల్, కందిప‌ప్పును దిగుమ‌తి చేసుకుంటున్నాం. ఎందుకు ఈ దేశం వంచించ‌బ‌డుతున్న‌ది. ఈ దుస్థితి కొన‌సాగాల్నా. లేదు నివారించ‌బ‌డాల్నా.. ప్ర‌జాజీవితంలో ఉండే ప్ర‌తి వ్య‌క్తి ఆలోచించాలి. బీఆర్ఎస్ అంటే త‌మ‌షా కోస‌మో, చెక్కిలిగింత‌ల కోస‌మో, దేశంలో ఒక మూల కోస‌మో, ఒక రాష్ట్రం కోస‌మే కాదు. బీఆర్ఎస్ ఈజ్ ఫ‌ర్ ఇండియా. క‌చ్చితంగా ల‌క్ష కి.మీ. ప్ర‌య‌ణ‌మైన తొలి అడుగుతోనే ప్రారంభ‌మ‌వుతుంది. ల‌క్ష్య శుద్ధి, సంక‌ల్ప శుద్ధి ఉంటే.. సాధించ‌లేనిదంటూ ఏది ఉండ‌దు. ప్ర‌పంచంలో మాన‌వ‌జీవితంలో అనేక ప‌ర్యాయాలు ఆ విష‌యాలు రుజువ‌య్యాయి అని కేసీఆర్ గుర్తు చేశారు.

మ‌న దేశంలో స్థాపిత విద్యుత్ శ‌క్తి 4 ల‌క్ష‌ల మెగావాట్లు. కానీ దేశం ఏనాడూ కూడా రెండు ల‌క్ష‌ల 10 వేల మెగావాట్ల‌కు మించి వాడ‌లేదు. నీళ్లుంటాయి కానీ పొలాల‌కు రావు. క‌రెంట్ ఉంట‌ది కానీ ప్ర‌జ‌ల‌కు రాదు. వ‌న‌రులు, వ‌స‌తులు ఉండి ఈ దేశం ప్ర‌జ‌లు శిక్షించ‌బ‌డాలి. వంచించ‌బ‌డాలి. ఈ ప‌రిస్థితులు ఇలాగే కొన‌సాగాల్నా? ఇందులో ఏదైనా మార్పు రావాల్నా? అది ప్ర‌శ్న‌? మార్పుకోస‌మే ప్ర‌బ‌ల‌మైన‌, గుణాత్మ‌క‌మైన‌టువంటి మార్పు క‌చ్చితంగా తీసుకొచ్చి, ప్ర‌జ‌ల ఆలోచ‌నా స‌ర‌ళి మార్చి యావ‌త్ దేశంలో ఉండేటటువంటి ఆలోచ‌నాప‌రుల‌ను ఏకం చేసి, ఒక మ‌హోజ్వ‌ల‌మైన భార‌త నిర్మాణం కోస‌మే బీఆర్ఎస్ అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశ‌మంతా రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తాం. ద‌ళిత బంధు అమ‌లు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్‌కు రెండేండ్ల‌లో వెలుగుజిలుగుల భార‌త్ త‌యార‌వుతుంద‌న్నారు. దేశం మొత్తం రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వ‌డం అసాధ్యమేమీ కాదు. రూ. 1.45 ల‌క్ష‌ల కోట్ల‌తో దేశ‌మంతా రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇవ్వొచ్చు. బీఆర్ఎస్‌కు అధికార‌మిస్తే దేశం మొత్తం ద‌ళిత‌బంధు అమ‌లు చేస్తాం. దేశంలో ఏటా 25 ల‌క్ష‌ల మందికి చొప్పున ద‌ళిత‌బంధు ఇస్తాం. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌ర‌ణ చేస్తే నిలిపివేస్తాం. మోదీకి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నాం.. మీది ప్రైవేటైజేష‌న్, మాది నేష‌న‌లైజేష‌న్. విశాఖ ఉక్కును మోదీ అమ్మినా మళ్లీ బీఆర్ఎస్ తిరిగి తీసుకుంటుంది. ప‌బ్లిక్ సెక్టార్‌లో పెట్టుకుంటాం అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశాన్ని ఉజ్వ‌లంగా త‌యారు చేసే విష‌యంలో ఏపీ కూడా భాగస్వామి కావాలి. అచ్చ‌మైన అల‌సు సిస‌లైన ప్ర‌జా రాజ‌కీయాలు ప్రారంభం కావాలి. గోల్ మాల్ వ్య‌వ‌హారం నుంచి బ‌య‌ట‌ప‌డాలి. ప్ర‌జ‌ల‌ను కూడా బ‌య‌ట‌పడేయాలి. అందుకు పుట్టిందే బీఆర్ఎస్. త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాం. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఉన్న ప్ర‌జ‌లు ఈ రాష్ట్ర ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 6 ల‌క్ష‌ల 64 వేల గ్రామాల్లో మ‌న క‌మిటీలు ఏర్ప‌డాలి. త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ప్రారంభించాం. 4,123 అసెంబ్లీ నియోజ‌వ‌క‌ర్గాల్లో ప‌రుగెడుతాం. ఈ ఆలోచ‌నా స‌ర‌ళి, అన్ని రాష్ట్రాల్లో ర‌గులుకోవాలి. క‌ష్టం త‌ప్ప‌దు. ఏం చేస్తే మంచి సాధిస్తామో దానిపై అధ్య‌య‌నం చేయాలి. అలా ముందుకు పురోగ‌మిస్తే 100కు వంద శాతం విజ‌యం సాధిస్తాం. రాజ‌కీయ ప‌ని త‌నం ఒక ల‌క్ష్యాన్ని ఉద్దేశించి ఉండాలి. కానీ గేమ్ లా ఉండ‌కూడ‌దు అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 3 గంటలుగా స్లోగా వెహికల్స్ మూమెంట్ కొనసాగుతోంది. కాసేపట్లో బీఆర్ఎస్లో ఆంధ్రా నేతల చేరికలు ఉన్నాయి. దీంతో తెలంగాణ భవన్కు సీఎం వస్తుండటంతో హై సెక్యూరిటీ పెట్టారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి..వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X