అది ఫామ్‌హౌజ్‌ కాదు, నా బావమరిది ఉండే ఇల్లు, అది రేవ్‌ పార్టీ కాదు, ఫ్యామిలీ దావత్‌ : కేటీఆర్‌

ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం- కెటిఅర్
తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చాం
కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదు
రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు కాదు..
ఏలాంటి చట్టవిరుద్ద కార్యక్రమాలు లేకున్నా ప్రభుత్వ కుట్రతోనే మాపై దుష్ప్రచారం, రాజకీయ కుట్రలు
పదకొండు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారు,సివిల్ సప్లైస్ స్కాం, మూసీ స్కాం వంటి అన్ని రకాల రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారు చావుకు తెగించి ఉద్యమం చేసిన వాళ్లం. రేవంత్ రెడ్డి కుట్రలకు మేం భయపడం

నిన్నటి నుంచి ఒక ప్రహాసనం లాగా మాపై కుట్ర నడిపే ప్రయత్న చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో ఒక కటుంబం, దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం తప్పా? దాని కోసం కూడా అనుమతి తీసుకోవాలా రాజ్ పాకాల ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు, దాని కోసం అయన కుటుంబ సభ్యలు, మిత్రులతో ప్యామిలీ పంక్షన్ చేసుకున్నారు. అలాంటి కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొంత మంది పైశాచిక అనందం పొందుతున్నారు.

నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ప్రజా జీవితంలో ఉంటే మాపై ఏలాంటి మాటలైన, అడ్డగోలు ప్రచారం చేయవచ్చా. అది రాజ్ పాకాల ఇల్లు, ఫాం హౌజ్ కాదు, కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏంటీ? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే డ్రగ్స్ దొరకలేదని చెప్పారు, అయినా ఏందుకీ దుష్ప్రచారం. కేసు అదికంగా మద్యం ఉన్న కేసు అని అబ్కారీ కేసు అని చేప్తే మళ్లీ నార్కోటిక్ కేసు అంటున్నారు. కేవలం పై వారి అదేశాల మేరకు మాత్రమేనార్కోటిక్ కేసు అంటున్నారు. అక్కడ పార్టీలోకి చేరి అనేక మందికి టెస్టులు చేస్తే రాజ్ పాకాలకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, అయినా అయనను బిజెపి, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకి, ఏప్ ఐఅర్ కి తేడా ఏలా వచ్చింది. బాంబులు అని చెప్పి కొండను తవ్వ ఎలుకను కూడా పట్టలేదు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపం, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం. మీరిచ్చిన హమీల నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయం వంటి అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వెంట పడతాం. ప్రజా సమస్యలను వదిలిపెట్టి కుటుంబాల వెంట పడుతున్నాడు.

Also Read-

తన బావమరిది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ దావత్‌ను రేవ్‌ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మధ్యే జన్వాడలో తాను ఒక ఇల్లు కట్టుకున్నాడని ఇండ్లల్లోకి వెళ్లినప్పుడు అందర్నీ పిలవలేదని దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడని అని చెప్పారు. కానీ కొంతమంది దాన్ని రేవ్‌ పార్టీ అని సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఆ ఫ్యామిలీ దావత్‌లో 70 ఏళ్ల తన అత్తమ్మతో పాటు చిన్న పిల్లలు ఉన్నారని దాన్ని రేవ్‌ పార్టీ అని ఎలా అంటారని ప్రశ్నించారు. అసలు రేవ్‌ పార్టీ అంటే అర్థం తెలుసా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వరుస వైఫల్యాలు. వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారంటీలు కావచ్చు.. మూసీ కుంభకోణం కావచ్చు లేదా బావమరిదికి కట్టబెట్టిన అమృత్‌ టెండరే కావచ్చు వారు చేస్తున్న వివిధ స్కామ్‌లను ఎండగడుతూ ప్రధాన ప్రతిపక్షంగా నిరంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా వ్యవహరిస్తుంది. జంకకుండా, బెదరకుండా, ఎక్కడా రాజీ పడకుండా గత 11 నెలలుగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అన్ని తట్టుకుంటూ మా కార్యకర్తలు, నాయకులు ధీరోదాత్తంగా కేసీఆర్‌ నేర్పిన ఉద్యమబాటలో నడుస్తూ వచ్చాం. ఈ రోజు వాటికి రాజకీయంగా సమాధానం చెప్పే సమర్థత లేదు. రాజకీయంగా మేం లేవనెత్తిన ప్రశ్నలకు వివరణాత్మకంగా ప్రజల్ని సంతృప్తిపరిచేవిధంగా సమాధానం చెప్పే పరిస్థితి అంతకంటే లేదు.

ఆరు గ్యారంటీల అమలు గానీ ఇంకా చాలా విషయాలపై ప్రభుత్వంలో ఏ ఒక్కరూ ముందుకొచ్చి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకే మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబసభ్యులు, మా బంధువుల మీద కేసులు బనాయించి, కుట్రలు చేసి, మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలి, ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి, ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తుంది.’ అని కేటీఆర్‌ అన్నారు. కానీ రేవంత్‌ రెడ్డికి, రాహుల్‌ గాంధీకి చెప్పేది ఒక్కటే అని తాము ఉద్యమంలో అడుగుపెట్టిన నాడే చావుకు తెగించి వచ్చిన వాళ్లమని గుర్తుచేశారు. కేసులకో మీరు చేసే చిల్లర ప్రయత్నాలకు భయపడేవాళ్లం కాదని స్పష్టం చేశారు

రేవ్‌ పార్టీ అంటూ ఇవాళ పొద్దుట్నుంచి ఒక ప్రహాసనంలా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ‘ఇవాళ తెలంగాణలో ఒక కుటుంబం తన కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో దసరాకో, దీపావళికో.. తమ ఇంట్లో దావత్‌ చేసుకోవడం కూడా తప్పేనట. దానికి కూడా పర్మిషన్‌ కూడా తీసుకోవాలట. ఇది ఎన్నడూ లేదు కాబట్టి మాకు తెల్వది.’ అని అన్నారు. ‘ఇక అది ఫామ్‌ హౌజ్‌ అని అంటున్నారు. అది ఫామ్‌హౌజ్‌ కాదు అది నా బావమరిది రాజ్‌ పాకాల ఉండే ఇల్లు. ఆయన హైదరాబాద్‌లోని ఒక గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటుండె. అక్కడ ఇల్లు ఖాళీ చేసి 15 రోజుల కిందట జన్వాడలోని రిజర్వ్‌ కాలనీలో కట్టుకున్న ఇంటిలో గృహప్రవేశానికి వెళ్లిండు. ఇండ్లళ్లకు పోయినప్పుడు బంధుమిత్రులను పిలవలేకపోయిండు వాళ్లందర్నీ దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకుని ఇండ్లళ్లకు పోయిన దావత్‌ అది.. ఫ్యామిలీ ఫంక్షన్‌ అది’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. సోషల్‌మీడియాలో కొంతమంది పైశాచికత్వంతో అది రేవ్‌ పార్టీ అని చెబుతున్నారని మండిపడ్డారు.

రేవ్‌ పార్టీ అంటే అసలు అర్థం తెలుసా మీకు. ఆ దావత్‌లో మా అత్తమ్మ ( నా భార్య వాళ్ల తల్లి ) ఉంది.. చిన్న పిల్లలు ఉన్నారు. రెండు, నాలుగు, ఏడేళ్ల వయసు ఉన్న పిల్లల నుంచి డెబ్బై ఏళ్ల వయసు ఉన్న పెద్దావిడ దాకా ఉంటే.. ఒక కుటుంబమంతా బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తుంటే.. దాన్నొక భూతద్దంలో పెట్టి రేవ్‌ పార్టీ అని ప్రచారం చేసి ఇవాళ పైశాచిక ఆనందం పొందుతున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. అది ఫామ్‌హౌజ్‌ కాదు తన బావమరిది ఇల్లు అని.. అక్కడ జరిగింది ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ గ్యాదరింగ్‌ అని పునరుద్ఘాటించారు. ‘ పురుషులు, మహిళలు పార్టీలో ఉన్నారని పొద్దుట్నుంచి మాట వింటూనే ఉన్నా.. వాళ్లు పురుషులు, మహిళలు కాదు భార్యాభర్తలు కుటుంబసభ్యులు. వాళ్లను కూడా విడదీసి పురుషులు, మహిళలు అంటూ అనుమానాలు కలిగేవిధంగా ప్రచారం చేశారు.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు21 గంటలు శోధించి చివరికి తెలుసుకున్నదేంటని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వారి తీరు ఉందని ఎద్దేవా చేశారు.

డ్రగ్స్‌ ఆనవాళ్లు ఏమీ దొరకలేవని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, ఎక్సైజ్‌ సీఐనే స్టేట్‌మెంట్లు ఇచ్చారని చెప్పారు. ఫ్యామిలీ అంతా కూర్చొని పార్టీ చేసుకునే దగ్గర డ్రగ్స్‌ అని ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే పురుషులు, మహిళలు అంటూ అనుమానం కలిగేలా మాట్లాడటం దుర్మార్గమని అన్నారు. అక్కడ యూరిన్‌ టెస్టులు చేసిండ్రు. పొద్దుట్నుంచి తన బావమరిదిని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు దూషిస్తున్నారని అన్నారు. ఇవాళ తన బావమరిదితో పాటు 12 మందికి నెగెటివ్‌ వచ్చిందని తెలిపారు. ఒక వ్యక్తిది మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని అన్నారు. ఆ ఒక్కడికి పాజిటివ్‌ వస్తే ఆయన ఎక్కడ డ్రగ్స్‌ తీసుకున్నడో అది శోధించకుండా, ఇవాళ ఈ విచ్‌ హంటింగ్‌ ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X