महाराष्ट्र में हड़कंप मचा रही है बीआरएस पार्टी का विस्तार

हैदराबाद : बीआरएस पार्टी के विस्तार से महाराष्ट्र में हड़कंप मच रही है। दिन-ब-दिन मशहूर हस्तियों के बीआरएस में शामिल होने की संख्या बढ़ती जा रही है। उगादि त्योहार के दिन बीआरएस प्रमुख और मुख्यमंत्री केसीआर की उपस्थिति में लंबे राजनीतिक अनुभव वाले महाराष्ट्र के कई प्रमुख लोग बीआरएस में शामिल हो गये हैं।

మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ పార్టీ విస్తరణ ప్రకంపనలు సృష్టిస్తున్నది

హైదరాబాద్ : మహారాష్ట్రలో బి ఆర్ ఎస్ పార్టీ విస్తరణ ప్రకంపనలు సృష్టిస్తున్నది. రోజు రోజుకు బి ఆర్ ఎస్ లో చేరే ప్రముఖుల సంఖ్య పెరుగుతున్నది. ఉగాది పండుగ రోజే బి ఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పలువురు ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరారు.

వారికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహారాష్ట్రలోని కాందహార్ లోయలో ఈ నెల 26 న బి ఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రముఖులు బి ఆర్ ఎస్ లో చేరడం గమనార్హం.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరయ్యే ఆ సభలో ఇంకా భారీ చేరికలు ఉంటాయని బి ఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం పార్టీలో చేరిన వారిలో ప్రముఖులు హర్షవర్ధన్ జాదవ్, సురేష్ గైక్వాడ్, యెష్ పాల్ బింగే తో పాటు పలువురు బి ఆర్ ఎస్ లో చేరారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X