పేపర్ లీకు కేసులో కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు: రేవంత్ రెడ్డి

కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి

టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను అపహాస్యం చేశారు

హైదరాబాద్ జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి కేటీఆర్ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేశారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పేపర్ల లీకు కేసులో సిట్ నోటీసులకు అనుగుణంగా గురువారం విచారణకు హాజరైన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది విద్యార్థులు, నిరుద్యోగులని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిందే నిరుద్యోగులని ఆయన చెప్పారు. టీఎస్పీఎస్సీ హిందువులకు దేవాలయం, ముస్లింలకు మసీదు, సిక్కులకు గురుద్వార లాంటిదన్నారు.

తెలంగాణలో టీఎస్పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని, నియామకాలు లోపభూయిష్ఠంగా జరిగాయని ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీకేజీని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, పార్టీని విస్తరించుకువడంపైనే బీఆరెస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పై నిరుద్యోగులకు విశ్వాసం కలిగించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. పేపర్ లేక్ వ్యవహారంలో పూర్తి బాధ్యత మంత్రి కేటీఆర్ దే అన్నారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహణను ఏ ప్రభుత్వం పూర్తిగా అపహాస్యం చేసిందని ఆరోపంచారు.

ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్ రెడ్డి, కేటీఆర్ పీఏ తిరుపతికి పేపర్ లీకేజ్ లో కీలక భాగస్వామ్యం ఉందని రేవంత్ ఆరోపించారు. వంద మందికి పైగా 100 మార్కులు వచ్చాయని గతంలో తాము చెబితే… వారిని విచారించాల్సింది పోయి సిట్ ద్వారా నోటీసులిచ్చి ప్రభుత్వం మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అయినా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అధికారులకు పూర్తి వివరాలను వివరించామన్నారు. తమ వద్ద ఉన్న సమాచారాన్ని, వివరాలను సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ కు అందించామని తెలిపారు.

పేపర్ లీకేజీ పై తాను, బండి సంజయ్, కేటీఆర్ ముగ్గురం స్పందించమని, అయితే సిట్ కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు మాత్రమే నోటీసులిచ్చి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. అంటే తమను భయపెట్టేందుకె అధికారులతో ప్రభుత్వం ఈ పని చేయించినట్లు తెలుస్తోందన్నారు. అందుకే కేటీఆర్ వ్యాఖ్యల వివరాలను సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారణ చేస్తే అసలు నేరస్తులు బయటపడతారన్నారు. సిట్ విచారణ చేయకుండానే కేటీఆర్ నేరం ఎలా జరిగిందో తెలంగాణ సమాజానికి వివరించారని, ఇంత చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు సిట్ అధికారులు తమ దృష్టికి రాలేదనడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. కేటీఆర్ పై ఫిర్యాదు తీసుకోమని, కేవలం సమాచారం మాత్రమే తీసుకుంటామని అధికారులు చెప్పారని రేవంత్ తెలిపారు.

కెటీఆర్, జనార్దన్ రెడ్డి, అనితా రామచంద్రన్ ను విచారణ చేయాల్సిందేనని సిట్ అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు రేవంత్ రెడ్డి. రాజకీయ ఒత్తిడులకు అతీతంగా విచారణ చేయాలని కోరామన్నారు. ఈ నెల 24, 25న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన దీక్ష కార్యక్రమం ఉంటుందని, 25న సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం, టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసి విచారణ చేయడం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలనే మూడు నిర్దిష్టమైన డిమాండ్ల తో భవిష్యత్ కార్యాచరణతో ముందుకెళతామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇచ్చిన నోటిఫికేషన్లు, క్వాలిఫై అయిన వారి, ఉద్యోగాలు వచ్చిన వారి వివరాలు వెబ్ సైట్ లో ఉంచేలా చూడాలని అధికారులను కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆంధ్రా అధికారి చేతిలో తాళాలా?

30 లక్షల తెలంగాణ నిరుద్యోగుల భవిష్యత్ ఆంధ్రా వాళ్లే నిర్ణయిస్తున్నారని, రాష్ట్రం వచ్చినా ఆంధ్రా అధికారుల చేతిలోనే తాళాలు ఎందుకు ఉన్నాయి? అని రేవంత్ ప్రశ్నించారు. ఇంత పెద్ద వ్యవస్థకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదా ఉన్న ఒక్క తెలంగాణ బిడ్డ లేడా కేసీఆర్? తెలంగాణ బిడ్డల త్యాగాలను కేసీఆర్ అపహాస్యం చేశారని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఎన్ని అవమానాలైనా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్ కుటుంబమేనని…ఆ చీడ, పీడను వదిలించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. 30 లక్షల మంది ఉసురు ఉప్పెనై కేసీఆర్ కుటుంబాన్ని కప్పేసే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు రేవంత్.

కాలినడకన సిట్ కార్యాలయానికి

సిట్ నోటీసుల నేపథ్యంలో ఆధారాలు సమర్పించడానికి కాంగ్రెస్ నేతలతో కలిసి సిట్ కార్యాలయానికి తన నివాసం నుంచి బయలుదేరిన రేవంత్ రెడ్డి వాహన శ్రేణిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. బంజారాహిల్స్ తాజ్ కృష్ణ వద్ద రేవంత్ వాహనం మినహా మిగతా వాహనాలను వెళ్ళనివ్వకుండా ట్రాఫిక్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఆ వాహనాలను అనుమతించవలసిందేనని రేవంత్ వారించడంతో పోలీసులు వాహనాలను అనుమతించారు. లిబర్టీ చౌరస్తాకు చేరుకోగానే.. రేవంత్ వాహనం మినహా ఇతర అవహనాలు వెళ్లకూడదని పోలీసులు తేల్చి చెప్పారు. పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగిన రేవంత్.. ఆతరువాత కారు దిగి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కాలినడకన సిట్ కార్యాలయానికి చేరుకుని ఆధారాలు సమర్పించారు.

KTR is trying to protect big heads in paper leak case: TPCC president Revanth Reddy
KTR should be removed from the post of minister
The conduct of TSPSC examination was mocked

TPCC president Revanth Reddy said that they tried to protect the big heads of KTR by limiting the crime to two people. Revanth Reddy spoke to the media after attending the hearing on Thursday in accordance with the SIT notices in the paper leak case. He said that the students and the unemployed led the Telangana movement and it was the unemployed who upheld Telangana’s self-respect. TSPSC is like a Temple for Hindus, a Mosque for Muslims and a Gurdwara for Sikhs. He alleged that TSPSC has become a center for political rehabilitation in Telangana and the appointments have been made defectively.

He ridiculed that the government did not take steps to control the question paper leakage and the BRS government focused on expanding the party. He criticised the government for failing to instil confidence among the unemployed on TSPSC. He said the entire responsibility of paper leakage is with Minister KTR. They demanded that KTR should be dismissed from the post of the minister. He alleged that the government has completely mocked the conduct of the TSPSC examination.

Revanth accused Rajasekhar Reddy and KTR PA Tirupati of having a key role in the paper leakage. Earlier, when we said that more than 100 people had got 100 marks…instead of investigating them, the government is trying to scare us through the SIT notice. However, respecting the constitution, he explained the full details to the authorities. They said that they have given the information and details they have to SIT officer AR Srinivas. He said that he, Bandi Sanjay and KTR have responded to the paper leak, but SIT only gave notice to Congress and BJP Presidents and did not give notice to KTR. This was meant to scare us and the government got this done through their officials.

That is why the details of KTR’s comments were taken to the notice of the SIT officials, if KTR is given notice and investigated, the real criminals will be exposed. While saying that KTR explained to the Telangana society how the crime was committed even without SIT investigation, and questioned the officials as to what is the meaning of their observation that KTR’s comments have not come to their notice. Revanth said that the authorities told him that they will not take complaint against KTR and that they will take only information.

Revanth Reddy said that they have made it clear to the SIT officials that KTR, Janardhan Reddy and Anita Ramachandran should be investigated. He said that the investigation should be done without political pressure. He said that there will be a Sit in Protest against Unemployment at Osmania University on 24th and 25th of this month and there will also be protest programs at Kakatiya University on the evening of 25th. He said they will move ahead with three specific demands: dismissal of KTR from the post of minister, dissolution of the TSPSC Board and investigation, investigation of the TSPSC paper leak case by the CBI or a Sitting Judge. Revanth Reddy said that they have requested the authorities to ensure that the notifications issued after the state formation, the details of those who have qualified and those who have got jobs are placed on the website.

Keys in the hands of Andhra officer?

Andhra people are deciding the future of 30 lakh Telangana unemployed. Why are the keys in the hands of Andhra officials even after the state formation? Revanth asked. Is there no one competent from Telangana within the system eligible for the position of Assistant Section Officer? He criticised KCR for making a mockery of the sacrifices of Telangana children. He made it clear that he will face any number of insults and cases for students and the unemployed. He said that KCR’s family is the pest and trouble of Telangana. Revanth said that the end day for KCR’s family is nearing with the agony of 30 lakh people.

Walked to SIT office

The police tried to stop the convoy of Revanth Reddy, when he left his residence for the SIT office along with the Congress leaders to submit evidence in the wake of the SIT notices. At Banjara Hills Taj Krishna, the traffic police tried to stop all vehicles except Revanth’s vehicle. But when Revanth insisted that those vehicles should be allowed, the police allowed the vehicles. On reaching Liberty Chowrastha, the police decided that no other vehicles except Revanth’s vehicle should go. After arguing with the police for a while, Revanth got out of the car and reached the SIT office on foot along with the Congress ranks and submitted the evidence.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X