Hyderabad: The Best Oncologist Award 2025 will be presented to three eminent cancer professors from Telangana state on the occasion of World Cancer Day. The awardees are Professor Dr. Geetha Nagashri, Professor B. Umakanth Goud, and Professor Joseph Benjamin.
Professor Dr. Geetha Nagashri, a renowned gynecological cancer surgeon, has been supporting the establishment of a cancer-free society for the past 25 years. She has participated in numerous national and international conferences on cancer, raising public awareness about the disease.
Professor B. Umakanth Goud, a cancer treatment specialist, has received accolades for educating poor cancer patients from different districts of Telangana. He has been working tirelessly for the past 25 years to eradicate cancer.
Professor Joseph Benjamin, a professor of radiology, has been working to raise awareness about radiotherapy techniques in cancer diseases. He has presented numerous research papers at conferences on cancer radiation and has been providing guidance and encouragement to cancer patients from rural areas.
The award ceremony will be held at the Durbar Hall of Chakali Ailamma Mahila University, Koti, on February 4th at 11 am. The event will also include a rally on cancer disease with female students.
Also Read-
ఉత్తమ ఆంకాలజిస్ట్ అవార్డు 2025
హైదరాబాద్ : క్యాన్సర్ నివారణకై గత 25 సంవత్సరాలుగా క్యాన్సర్ రహిత సమాజ స్థాపనకు పాటుపడుతున్న ప్రొఫెసర్ డాక్టర్ గీతా నాగశ్రీ , ప్రొఫెసర్ బి. ఉమాకాంత్ గౌడ్ మరియు ప్రొఫెసర్ జోసఫ్ బెంజిమెన్ లకు ప్రపంచ క్యాన్సర్ వ్యాధి నివారణ దినం సందర్భంగా ద బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డు 20 25 ను ఎంపిక చేసినట్లు తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డాక్టర్. రాజనారాయణ ముదిరాజ్ మరియు సెక్రెటరీ జనరల్ డాక్టర్ కె పి హేమంత్ కుమార్ నేడు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.
ప్రపంచ క్యాన్సర్ నివారణ దినం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి ముగ్గురు ప్రొఫెసర్లను ఎంపిక చేశామని అన్నారు. ఈనెల ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ లోని దర్బార్ హాల్లో జరిగే కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని మరియు ప్రముఖ విద్యావేత్త మరియు జాతీయ పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మండలి సభ్యులు లయన్ డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లు పాల్గొని ప్రసంగిస్తారు అన్నారు ఈ సందర్భంగా విద్యార్థినిలతో క్యాన్సర్ వ్యాధిపై ర్యాలీని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ప్రొఫెసర్ డాక్టర్ గీత నాగశ్రీ గత 25 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధి నివారణకై గర్భాశయ, అండాశయ మరియు రొమ్ము క్యాన్సర్లతో సహా అన్ని రకాల గైనకాలజీ క్యాన్సర్ శస్త్ర చికిత్సనిపుణులు జాతీయ, అంతర్జాతీయ దేశాలలో క్యాన్సర్ పై ఎన్నో సదస్సులో పాల్గొని ప్రజలను జాగృతి పరిచారు. హైటెక్ సిటీ లోని కేర్ ఆస్పత్రిలో సీనియర్ గైనకాలజీ సర్జికల్ ఆంకాలజీ ఆంకాలజిస్ట్ గా సేవలందిస్తున్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ బి ఉమాకాంత్ గౌడ్ MNJ ప్రభుత్వ క్యాన్సర్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్లో క్యాన్సర్ చికిత్స నిపుణులు గత 25 సంవత్సరాలుగా నిరుపేదలకు ప్రత్యేకించి తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి వచ్చే క్యాన్సర్ రోగులకు ఓపికతో వ్యాధిపట్ల అవగాహన కల్పించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
ప్రొఫెసర్ జోసెఫ్ బెంజిమెన్ రేడియాలజీ ప్రొఫెసర్ గా ప్రభుత్వ MNJ క్యాన్సర్ ఆసుపత్రిలో సీనియర్ రేడియాలజీ గా సేవలందిస్తున్నారు. ఎంబిబిఎస్ ఎండి తర్వాత డిగ్రీలు పూర్తిచేసి క్యాన్సర్ నిర్మూలన నివారణకై ఎనలేని కృషి చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిలో వ్యాధితో రేడియో థెరపీ టెక్నిక్ ను ఎండి చదివే వైద్య విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ఆంకాలజీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ లో రేడియేషన్ ఆంకాలజీ సభ్యులుగా ఉండి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు.
ఎన్నో పరిశోధనా పత్రాలు క్యాన్సర్ రేడియేషన్ లో జరిగిన సదస్సులో సమర్పించారు. నిరుపేద ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే క్యాన్సర్ రోగులకు మంచి సలహాలు సూచనలు మనో మనో ధైర్యాన్ని ఇచ్చారు వారికి జాగృతి పరిచి క్యాన్సర్ రోగ నివారణకు కృషి చేస్తున్నారు.