हैदराबाद: तेलंगाना के नये सचिवालय के उद्घाटन की तारीख आखिरकार तय हो गई है। मुख्यमंत्री के चंद्रशेखर राव ने 14 अप्रैल को अंबेडकर जयंती पर उद्घटान करने का फैसला किया। तेलंगाना सरकार ने सचिवालय का नाम डॉ बीआर अंबेडकर के नाम पर रखा है। इसके चलते विभिन्न वर्गों से अंबेडकर की जयंती पर उद्घाटन करने की मांग की जा रही थी। उनकी मांगों के अनुसार, केसीआर ने 14 अप्रैल से शुरू करने का फैसला किया।
सरकार ने इस महीने की 17 तारीख को केसीआर के जन्मदिन पर नये सचिवालय का उद्घटान करने का फैसला किया था। इसको लेकर अधिकारियों ने इंतजाम भी शुरू कर दिए हैं। लेकिन अप्रत्याशित रूप से केंद्रीय चुनाव आयोग ने राज्य में दो एमएलसी चुनाव के लिए अधिसूचना जारी कर दी है। इसके साथ ही एमएलसी चुनाव संहिता लागू हो गई। सरकार ने हाल ही में एक बयान जारी किया है कि सचिवालय का उद्घाटन स्थगित कर दिया गया है क्योंकि सरकार आचार संहिता के कारण नए कार्यक्रम शुरू नहीं कर पा रही है।
सरकार ने साफ कर दिया है कि वह जल्द ही सचिवालय के उद्घाटन किये जाने को लेकर दूसरी तारीख की घोषणा करेगी। लेकिन राजनीतिक दल और विभिन्न वर्गों के लोग मांग कर रहे हैं कि इसे अंबेडकर जयंती पर शुरू किया जाना चाहिए। हाईकोर्ट में मामले भी दर्ज किए गए हैं। केसीआर ने फैसला किया कि लोगों की मांगों के अनुसार 14 अप्रैल से शुरू करना बेहतर होगा क्योंकि एमएलसी चुनाव संहिता के कारण इसे वैसे भी स्थगित कर दिया गया था।
తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది
హైదరాబాద్ : వాయిదాలు పడుతూ వస్తోన్న తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఎట్టకేలకు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో ఆయన జయంతి రోజే ప్రారంభించాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వారి డిమాండ్ల మేరకు ఏప్రిల్ 14న ప్రారంభించేందుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేశారు.
ఈ నెల 17న కేసీఆర్ పుట్టినరోజున కొత్త సెక్రటేరియట్ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. కానీ అనుకోని విధంగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ కారణంగా ప్రభుత్వం కొత్త కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం లేకపోవడంతో సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది.
త్వరలోనే సచివాలయ ప్రారంభంకు సంబంధించి మరో తేదీని ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అంబేద్కర్ జయంతి రోజున ప్రారంభించాలని రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై హైకోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఎలాగూ వాయిదా పడటంతో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు ఏప్రిల్ 14న ప్రారంభిస్తేనే బాగుంటుందని కేసీఆర్ నిర్ణయించారు.
సచివాలయ ప్రారంభోత్సవం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. గత ఏడాది దసరా సందర్బంగా ప్రారంభించాలని భావించినప్పటికీ అది కురదలేదు. గత నెల సంక్రాంతి రోజున ప్రారంభోత్సవం చేయాలని అనుకున్నా అది కూడా సాధ్యం కాలేదు. ఇక ఈ నెలలో ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో చివరికి ఏప్రిల్ 14న ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖారారు చేసింది.
కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల సీఎంలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, వివిధ పార్టీల నేతలను గెస్ట్‌లుగా పిలవనుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జాతీయ నేతలు కూడా పాల్గొననున్నారు. కాగా సచివాలయ నిర్మాణ పనులన్నీ దాదాపు పూర్తవ్వగా లోపల మిగతా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ పనులన్నీ పూర్తి కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. (ఏజెన్సీలు)