Telangana Martyrs Memorial: గడువులోగా నిర్మాణం పూర్తి కావాలి – వేముల ప్రశాంత్ రెడ్డి

हैदराबाद: राज्य सड़क और भवन मंत्री वेमुला प्रशांत रेड्डी ने शनिवार को मुख्यमंत्री केसीआर के आदेश पर हुसैन सागर के तट पर राज्य सरकार की सबसे प्रतिष्ठित शहीदों के निर्माण का निरीक्षण किया। मंत्री ने अधिकारियों के साथ निर्माण कार्य का निरीक्षण लगभग तीन घंटे तक किया। इस दौरान मंत्री ने अधिकारियों और निर्माण कंपनी के प्रतिनिधियों से कहा कि यह तेलंगाना लोगों के दिलों के लिए एक स्पर्श संरचना है। इसीलिए इसका निर्माण बहुत ही अच्छी तरह से किया जाये।

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా సుమారు మూడు గంటల పాటు ఫ్లోర్ వైస్ కలియతిరిగి పనుల పురోగతిని పరిశీలించారు. ఇది తెలంగాణ ప్రజల గుండెలకు హత్తుకునే నిర్మాణంగా నిలిచిపోనుందని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు అత్యంత శ్రద్ధతో పనిచేయాలని అన్నారు.

మెయిన్ ఎంట్రన్స్, ల్యాండ్ స్కేప్ ఏరియా, వాటర్ ఫౌంటెన్, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ప్రాంతంలో పనులపై అధికారులకు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణంలో ఏర్పాటు చేసే మ్యూజియం, ఆడిటోరియం, పై అంతస్తులో ఏర్పాటు చేసే రెస్టారెంట్ నిర్మాణాలు పరిశీలించి పలు సూచనలు చేశారు.

దుబాయ్ నుండి ప్రత్యేకంగా తెప్పించి అమరుస్తున్న అరుదైన స్టెయిన్లెస్ స్టీల్ షీట్స్ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి షీట్స్ బిగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణంలో నిరంతరం జ్వలించే జాలలా ఉండే జ్యోతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. కేసిఆర్ గారు నిరంతరం స్మారక చిహ్నం నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారని, వారి ఆలోచనలకు అనుగుణంగా ఫినిషింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణ ప్రాంగణం అంతా పచ్చదనంతో,ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

తాను రెండు మూడు రోజులకు ఒకసారి ఆకస్మికంగా పనులను తనిఖీ చేస్తానని, పనుల పురోగతి రోజువారీగా పరిశీలిస్తానని మంత్రి వేముల చెప్పారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆర్ అండ్ బి అధికారులకు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X