हैदराबाद : तेलंगाना भर में बुधवार से इंटर की परीक्षाएं शुरू हो गई हैं। परीक्षाएं सुबह 9 से दोपहर 12 बजे तक आयोजित की जाएंगी। 1,521 परीक्षा केंद्रों पर आयोजित होने वाली इंटर परीक्षाओं में कुल 9,80,978 छात्र शामिल होंगे।
इनमें से प्रथम वर्ष के 4,78,718 छात्र और द्वितीय वर्ष के 5,02,260 छात्र हैं। 58,071 छात्र सेकंड ईयर निजी तौर पर परीक्षा दे रहे हैं। परीक्षा के संचालन के दौरान किसी भी अप्रिय घटना से बचने के लिए इंटर बोर्ड ने कड़े इंतजाम किए हैं। सीएम रेवंत रेड्डी ने पहले ही अधिकारियों को यह सुनिश्चित करने का आदेश दिया है कि पेपर लीक होने की कोई संभावना न हो।
इसी क्रम में मंत्री पोन्नम प्रभाकर ने आरटीसी कर्मचारियों को महत्वपूर्ण निर्देश जारी किये हैं। इंटर के छात्र जहां भी हाथ दिखाये वहां पर संभव हो बस रोकें और उनकी मदद करें। यदि छात्र समय पर परीक्षा केंद्र नहीं पहुंचे तो वे परीक्षा लिखने का अवसर खो देंगे। इसलिए बस रोककर उनकी मदद की जाये।
తెలంగాణ ఇంటర్ పరీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. 1,521 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,80,978 మంది హాజరు కానున్నారు.
అందులో ఫస్టియర్ విద్యార్థులు 4,78,718 మంది ఉండగా, సెకండియర్ విద్యార్థులు 5,02,260 మంది ఉన్నారు. సెకండియర్ ఏడాది ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ఈ క్రమంలో మంత్ర పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్ విద్యార్థులు చెయ్యెత్తిన చోట బస్సు ఆపి వారికి సహకరించాలని సూచించారు. పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోలేకపోతే వారు పరీక్షను రాసే అవకాశం కోల్పోతారని పేర్కొన్నారు. అందుకే వారికి బస్సు ఆపి సహకరించాలని పేర్కొన్నారు. (ఏజెన్సీలు)