हैदराबाद: तेलंगाना सरकार ने दो और गारंटी लागू की हैं। 500 हजार रुपए का गैस सिलेंडर और मुफ्त बिजली योजना शुरू हो गई है। सरकार ने कहा है कि मुफ्त बिजली देने वाली गृहज्योति योजना के तहत अगले महीने के पहले सप्ताह में शून्य बिल जारी किए जाएंगे। प्रति घरेलू कनेक्शन अधिकतम 200 यूनिट बिजली निःशुल्क प्रदान की जाती है। इससे आगे का पूरा बिल चुकाना होगा। सरकार ने योग्य उम्मीदवारों के चयन के लिए दिशानिर्देश जारी किए हैं।
इस योजना के लिए सफेद राशन कार्ड को मानक के रूप में लिया गया है। जिन लोगों ने सरकार द्वारा आयोजित लोक प्रशासन (प्रजा पालना) कार्यक्रम में इस योजना को लागू करने के लिए आवेदन किया है, उनमें से केवल उन लोगों को पात्र के रूप में चुना जाएगा जिन्होंने अपना राशन कार्ड, आधार और बिजली कनेक्शन नंबर दिया है। 200 यूनिट तक बिजली इस्तेमाल करने वालों को बिजली कर्मी जीरो बिल जारी करेंगे। सरकार 20 तारीख तक इन बिलों की कुल राशि रियायत के तहत डीआईएससी को भुगतान कर देगी। बिजली विभाग ने कहा कि चूंकि बिजली की आपूर्ति केवल घरेलू उपयोग के लिए की जा रही है, अगर इसका उपयोग अन्य उद्देश्यों के लिए किया जाता है, तो बिजली अधिनियम और भारतीय दंड संहिता के तहत मामला दर्ज किया जाएगा और कार्रवाई की जाएगी।
सरकार ने कहा है कि जिन लोगों ने अब तक आवेदन नहीं किया है, वे उस क्षेत्र के एमपीडीओ, नगर निगम और जीएचएमसी कार्यालयों में आवेदन कर सकते हैं जहां उनका बिजली कनेक्शन है। आवेदन जमा करने के बाद कार्यालयों में रसीद दी जाएगी। इसे नजदीकी बिजली राजस्व कार्यालय में जमा करना होगा। इसके बाद बिजली कर्मचारी आवेदक के घर जाएंगे और राशन कार्ड और आधार विवरण की जांच करेंगे। यदि सब कुछ सही है तो आपको पात्र सूची में शामिल कर लिया जाएगा। अधिकारियों ने कहा कि यह एक सतत प्रक्रिया है और कोई भी व्यक्ति संबंधित कार्यालयों में आवेदन और रसीदें जमा कर सकता है।
लोक प्रशासन में मुफ्त बिजली के लिए 81.54 लाख लोगों ने आवेदन किया है। चूंकि उनमें से कुछ के पास राशन कार्ड नहीं हैं। इसलिए उनके आवेदन अलग रखे गए हैं। ग्रेटर हैदराबाद में जहां 49.50 लाख घरों में बिजली कनेक्शन है। वहीं केवल 19.85 लाख लोगों ने लोक प्रशासन में आवेदन किया है। इनमें से भी बड़ी संख्या में राशन कार्डों का ब्योरा नहीं है। 1 से 20 मार्च तक शून्य बिल जारी होने के बाद ही गणना हो सकेगी कि पहले माह में कितने लोग इस योजना के पात्र हैं। वर्तमान बिजली शुल्क के अनुसार, यह अनुमान लगाया गया है कि एक घर जो प्रति माह ठीक 200 यूनिट का उपयोग करता है, उनको लगभग 900 रुपये बचत होगी।
తెలంగాణలో ఉచిత గ్యాస్ సిలిండర్ మరియు విద్యుత్, మార్గదర్శకాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలు అమలు చేసింది. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలు ప్రారంభమయ్యాయి. అయితే ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఒక ఇంటి కనెక్షన్‌కు గరిష్ఠంగా 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తారు. అంతకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదలం చేసింది ప్రభుత్వం.
ఈ పథకానికి రేషన్‌కార్డునే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతూ దరఖాస్తులిచ్చిన వారిలో రేషన్‌కార్డు, ఆధార్, కరెంటు కనెక్షన్ నంబర్లను తెలిపినవారే అర్హులుగా ఎంపికవుతారు. అర్హుల్లో 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకున్న వారికి విద్యుత్ సిబ్బంది జీరో బిల్లులు జారీ చేస్తారు. ఈ బిల్లుల మొత్తం సొమ్మును 20వ తేదీకల్లా ప్రభుత్వం రాయితీ కింద డిస్కంలకు చెల్లిస్తుంది. ఇంటి వినియోగానికి మాత్రమే కరెంటు సరఫరా చేస్తున్నందువల్ల ఇతర అవసరాలకు వాడుకుంటే విద్యుత్ చట్టం కింద, ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ తెలిపింది.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు తమ కరెంటు కనెక్షన్ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తులు అందజేసిన తర్వాత కార్యాలయాల్లో రసీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి విద్యుత్ సిబ్బంది వెళ్లి.. రేషన్‌కార్డు, ఆధార్ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ అని.. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు, రసీదులు అందజేయవచ్చన్నారు అధికారులు.
ప్రజాపాలనలో ఉచిత కరెంటు కోసం 81.54 లక్షల మంది దరఖాస్తులిచ్చారు. వీరిలో కొందరికి రేషన్‌కార్డులు లేకపోవడంతో వారి అర్జీలను పక్కనపెడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 49.50 లక్షల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉండగా వీటిలో 19.85 లక్షల మంది మాత్రమే ప్రజాపాలనలో దరఖాస్తులిచ్చారు. వీటిలోనూ రేషన్‌కార్డుల వివరాలు లేనివి పెద్దసంఖ్యలో ఉన్నాయి. మార్చి నెల 1 నుంచి 20వ తేదీ వరకూ జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి. ప్రస్తుత కరెంటు ఛార్జీల ప్రకారం చూస్తే నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. (ఏజెన్సీలు)