తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ పవర్ మెన్ డైరీ- 2023 ఆవిష్కరణ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాటలు వినండోయ్

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కరెంటు గోస తీరింది

బట్టలు ఆరేసుకునే పరిస్థితి మారింది

కరెంటు ఉద్యోగుల సమస్యలన్నీ సీఎం దృష్టిలో ఉన్నాయి… తప్పకుండా పరిష్కారం అవుతాయి

తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ పవర్ మెన్ డైరీ – 2023 ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హనుమకొండ : తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక కరెంటు గోసలు ఉండేవని… తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి సీఎం కేసీఆర్ గారు వచ్చాక మారిందని, దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ తెలంగాణలో తప్ప ఎక్కడా లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.

బుధవారం హనుమకొండ, విష్ణు ప్రియ గార్డెన్స్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ పవర్ మెన్ డైరీ – 2023 ఆవిష్కరణలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాట్లాడుతూ…

“ఈ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 40 ఏళ్లు రాజకీయంలో ఉన్నాను. 7సార్లు గెలిచాను. గతంలో అధికారంలో ఉన్నపుడు ఎపుడూ మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలి పోయేవి. ఎన్నో గోసలు ఉండేవి. కానీ తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం మారింది. కరెంట్ తీగలు మీద బట్టలు ఈరోజు ఆంధ్రలో ఆరేసుకుంటున్నారు. తెలంగాణలో కాదు. మన దగ్గర ఉన్నంత కరెంట్, పవర్ దేశంలో ఎక్కడా లేదు. మన దగ్గర అధికారులు, ఉద్యోగులు, కార్మికులు బాగా కష్ట పడుతున్నారు. సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ప్రణాళిక అమలు చేస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారు.”

“ఈ రోజు గ్రామాల్లో కూడా 24 గంటలు కరెంట్ ఉంటుంది. కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. అలాంటి వారికి మీరు జవాబు చెప్పాలి. సీఎం కేసీఆర్ గారు మనసున్న మారాజు. ఇంకా ఏ సమస్య ఉన్నా సీఎం గారికి తీసుకోడం. మన ముఖ్యమంత్రిని మనం కాపాడుకోవాలి. కేసిఆర్ గారు నా బోందిలో ప్రాణం ఉన్నంత వరకు ప్రైవేట్ చేయను అన్నారు. రైతులు ఢిల్లీలో ధర్నా చేయడం వల్ల కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకుంది. ఆరోజు హైదరాబాద్, వరంగల్ లో కరెంట్ లేక ఇండస్ట్రీ లు మూత పడ్డాయి. కానీ నేడు కరెంట్ పుష్కలంగా ఉండడంతో మన దగ్గర అనేక కంపెనీలు వస్తున్నాయి. ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మనం కేసిఆర్ గారిని కాపాడుకోవాలి.”

“మీ సమస్యలన్నీ సీఎం గారి దృష్టిలో ఉన్నాయి. వాటిని మేము కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము. సమావేశంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, యూనియన్ అధ్యక్షులు వి. వెంకటేశ్వర్లు, ఎస్.పి. డి.సి.ఎల్ సీఎండి రఘుమా రెడ్డి, ఎన్.పి. డి.సి.ఎల్ సీఎండీ గోపాల్ రావు, విద్యుత్ శాఖ డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X