Telangana : 22 जून से बोनालु उत्सुव

हैदराबाद/सिकंदराबाद: बोनालु फेस्टिवल 22 जून से हैदराबाद में शुरू होगा। गोलकोंडा किले में एलम्मा के पहले बोनम के साथ शुरू होगा और एक महीने तक चलेगा। लश्कर बोनल नौ जुलाई को होगा। इसके अगले दिन रंगम होगा। गोलकोंडा बोनालु और लश्कर बोनालु के बाद ओल्ड सिटी बोनालु आयोजित करने की प्रथा है।

జూన్ 22 నుంచి బోనాలు

హైదరాబాద్/సికింద్రాబాద్ :హైదరాబాద్​లో బోనాల పండుగ జూన్​ 22న ప్రారంభం కానుంది.  గోల్కొండ కోటలోని ఎల్లమ్మకు తొలి బోనంతో నెల రోజుల పాటు జాతర కొనసాగనుంది. లష్కర్​బోనాలు జులై 9 న నిర్వహించనున్నారు. ఆ తెల్లారి రంగం ఉంటుంది. గోల్కొండ బోనాలు, లష్కర్​ బోనాల తర్వాత ఓల్డ్ సిటీ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ.

హైదరాబాద్​లో బోనాల జాతర జూన్​ 22 నుంచి ప్రారంభం కానుంది. నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ కోటలోని  జగదాంబికా మహంకాళి (ఎల్లమ్మ) అమ్మవారికి తొలిబోనంతో మొదలవుతాయి. అక్కడ అమ్మవారికి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ప్రతి గురు, ఆదివారాల్లో ఉత్సవాలు కొనసాగుతా యని ఆలయ ఈవో శ్రీనివాస్ రాజు పేర్కొన్నారు. జులై 20న గురువారం తొమ్మిదో పూజతో ఆషాడ మాసం బోనాలు ముగుస్తాయన్నారు.

 లష్కర్​ (సికింద్రాబాద్) బోనాలు జులై 9న నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహా కాళి ఆలయ కొత్త పాలకమండలి ప్రమాణ ప్రోగ్రామ్​లో మంత్రి పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్​ కృష్ణ  కొత్త కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ… లష్కర్​ బోనాలు జులై 9న జరుగుతాయని, 10న రంగం నిర్వహిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X