हैदराबाद : टी20 वर्ल्ड कप 2024 में अफगानिस्तान ने बांग्लादेश को हराकर सेमीफाइनल पहुंच गई है। इसी के साथ ऑस्ट्रेलियाई टीम टी20 विश्व कप से बाहर हो गई है। ऑस्ट्रेलिया की उम्मीदें बांग्लादेश की टीम पर टिकी थीं। अब अफगानिस्तान का पहले सेमीफाइनल में 27 जून को सामने दक्षिण अफ्रीका से होगा। वहीं, भारतीय टीम का दूसरे सेमीफाइनल में इंग्लैंड के बीच होगा।
पहले बल्लेबाजी करते हुए अफगानिस्तान की टीम 20 ओवर में पांच विकेट पर 115 रन बना पाई थी। इसके बाद जब बांग्लादेश की टीम बल्लेबाजी के लिए आई तो कई बार बारिश ने खलल डाला। बांग्लादेश को सेमीफाइनल के लिए क्वालिफाई करने के लिए 12.1 ओवर में 116 रन बनाने थे। हालांकि, अफगानिस्तान ने नियमित अंतराल पर विकेट लिए। तंजीद हसन (0), कप्तान नजमुल हुसैन शांतो (5) और शाकिब अल हसन (0) कुछ खास नहीं कर सके। इसके बाद राशिद खान का जलवा देखने को मिला। उन्होंने सौम्य सरकार, तौहिद हृदोय, महमूदुल्लाह और रिशाद हुसैन को पवेलियन भेजा।
इसी क्रम में लिटन दास एक छोर से टिके रहे। उन्होंने टी20 अंतरराष्ट्रीय करियर का 11वां अर्धशतक लगाया। बीच में बारिश की वजह से मैच रुका और अंपायर्स ने एक ओवर घटा दिया। डकवर्थ लुईस नियम के तहत बांग्लादेश को 19 ओवर में 114 रन का लक्ष्य मिला। 80 रन पर बांग्लादेश ने सात विकेट गंवा दिए थे। जैसे ही गुलबदीन नईब ने तंजीम हसन शाकिब को पवेलियन भेजा, मैच और रोमांचक हो गया।
यह भी पढ़ें-
लिटन दास और तस्कीन अहमद क्रीज पर थे। लगा कि लिटन मैच जिता ले जाएंगे। आखिरी 12 गेंद में बांग्लादेश को 12 रन की जरूरत थी। नवीन उल हक गेंदबाजी के लिए आए और उन्होंने लगातार दो गेंद पर तस्कीन अहमद और मुस्तफिजुर रहमान को पवेलियन भेज अफगानिस्तान को जीत दिलाई और सेमीफाइनल में पहुंचाया। अफगानिस्तान की टीम किसी भी आईसीसी टूर्नामेंट के सेमीफाइनल में पहली बार पहुंची है। (एजेंसियां)
చరిత్రలో మొదటి సారి టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఆఫ్ఘనిస్తాన్
హైదరాబాద్ : 2024 టీ20 వరల్డ్ కప్ లోని సూపర్ 8 చిట్టచివరి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు మధ్య జరిగింది. సెమిస్ లో మిగిలిని చివరి బెర్త్ కోసం మూడు జట్లు ఆదార పడ్డాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో అత్యంత క్రియాశీలకంగా మారిన ఆప్ఘనిస్థాన్ జట్టు గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నం చేసింది. మరోపక్క బంగ్లాదేశ్ కూడా గెలిచి సెమీస్ వెళ్లాలని బావించింది కానీ ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక పోయింది.
ఇదిలా ఉంటే ఒక్క మ్యాచ్‌లో వర్షం ఏకంగా ఐదు సార్లు అడ్డుతగిలింది. ఈ క్రమంలో కేవలం 116 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించి సెమీస్ చేరుకుంది. దీంతో బంగ్లా గెలుపుపై చిట్ట చివరి ఆశలు పెట్టుకున్న ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ నుంచి ఎలిమినేట్ అయింది. ఆఫ్ఘన్ జట్టు సెమీ ఫైనల్ మ్యాచులో సౌతాఫ్రికాతో తలపడనుంది.
నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 5 వివెట్ల నష్టానికి కేవలం 115 పరుగులు చేసింది. అనంతరం 116 పరుగుల స్వల్ప లక్ష్యంతో చేజింగ్ దిగిన బంగ్లాదేశ్ జట్టను ఓ వైపు ఆఫ్ఘన్ బౌలర్లు, మరోవైపు వర్షం ఉక్కిరి బిక్కిరి చేశాయి. చివర్లో వర్షం కారణంగా మ్యాచును 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించారు. అయినప్పటికి బంగ్లాదేశ్ జట్టు గెలవలేకపోయింది.
తప్పనిసరి గెలవాల్సిన మ్యాచులో ఆఫ్ఘన్ బౌలర్లు అద్బుతమైన ప్రదర్శనను కనబరచారు. దీంతో బంగ్లా జట్టు 17.5 ఓవర్లకు ఆలౌట్ అయింది. అత్యంత కీలకమైన మ్యాచ్ లో విజయం సాధించిన ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో మొదటి సారి టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరుకుంది. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ 4 వికెట్లు, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు, ఫారూఖీ, నబీ చెరో వికెట్ తీసుకున్నారు. (ఏజెన్సీలు)