हैदराबाद : सिकंदराबाद अग्नि दुर्घटना मामले में लापता हुए तीन व्यक्तियों में से एक के शव की पहचान कर ली गई है। अधिकारियों ने बताया कि फोम के इस्तेमाल से इमारत की गर्मी थोड़ी कम हो गई थी। अंदर गए अग्निशमन कर्मियों को पहली मंजिल पर एक मृत शरीर की रीढ़ की हड्डियां मिली।
पुलिस ने उसे नीचे उतारा और गांधी अस्पताल भेज दिया। दमकल, सुराग टीम और डीआरएफ के जवान बाकी दो के शवों की तलाश में जुटे हुए हैं। ऐसा लगता है कि बाकी मंजिलों पर भी इनके शव मिलने की आशंका है।
आपको बता दें कि डेक्कन स्पोर्ट्स मेंदुकान में काम कर रहे वसीम, जुनैद और जहीर आग की चपेट में आ गए थे। कहा जा रहा है कि बिहार के रहने वाले ये तीनों युवक एक साल से दुकानों में काम कर रहे थे। रेस्क्यू टीम ने आग में फंसे वसीम, जुनैद और जहीर को बचाने की पूरी कोशिश की, लेकिन कोई नतीजा नहीं निकला।
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం: గల్లంతైన ముగ్గురిలో ఒకరి మృతదేహం గుర్తింపు
హైదరాబాద్: సికింద్రాబాద్ అగ్నిప్రమాదం కేసులో గల్లంతైన ముగ్గురిలో ఒకరి డెడ్ బాడీని అధికారులు గుర్తించారు. ఫోమ్ ను ఉపయోగించడంతో బిల్డింగ్ వేడి కాస్త తగ్గడంతో లోపలికి వెళ్లిన ఫైర్ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్లో ఓ మృతదేహానికి సంబంధించి వెన్నెముకను గుర్తించారు. దాన్ని కిందకు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు.
మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం ఫైర్, క్లూస్ టీం, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు.
మిగిలిన ఫ్లోర్లలో వాళ్ల డెడ్ బాడీ దొరికే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్ అందులో చిక్కుకుపోయారు.
బీహార్కు చెందిన ఈ ముగ్గురు యువకులు ఏడాదిగా స్టోర్స్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకుపోయిన వసీం, జునైద్, జహీర్ లను రక్షించేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేసింది.
అయినా ఫలితం లేకుండా పోయింది. (Agencies)