हैदराबाद: आंध्र प्रदेश के अनाकापल्ली जिले के अच्युतापुरम एसईजेड में रिएक्टर विस्फोट हादसे में मरने वालों की संख्या बढ़कर 14 हो गई है। जबकि 50 अन्य गंभीर रूप से घायल हो गये हैं। इलाज करने वाले डॉक्टरों ने कहा कि इनमें से कुछ की हालत गंभीर है और मरने वालों की संख्या बढ़ने की आशंका है। एसेंशिया फार्मा कंपनी में बुधवार दोपहर रिएक्टर फटने से सात कर्मचारियों की मौके पर ही मौत हो गई और सात अन्य की अस्पताल में इलाज के दौरान मौत हो गई।
विस्फोट से मजदूरों के शरीर हवा में उड़ गए और उनके शरीर पूरी तरह से क्षत-विक्षत हो गए। बताया जा रहा है कि हादसे के वक्त कंपनी में 300 से ज्यादा कर्मचारी काम कर रहे थे। विस्फोट की तीव्रता के कारण इमारत ढह गई और भीषण आग लग गई। तेज आवाज से जान बचाकर मजदूर और आसपास के गांव के लोग भाग खड़े हो गये। दमकलकर्मियों ने 11 दमकल गाड़ियों की मदद से आग पर काबू पाया। एनडीआरएफ के जवान भारी क्रेन की मदद से मलबा हटा रहे हैं। आशंका है कि अभी भी कुछ मजदूर मलबे में फंसे हो सकते हैं। इस हादसे पर सीएम चंद्रबाबू नायडू और पूर्व सीएम जगन ने दुख जताया है।
Also Read-
అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ ప్రమాదం
హైదరాబాద్ : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 50 దాకా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఎసెన్సియా ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో అక్కడిక్కడే ఏడుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
కాగా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరి పడటంతో వారి దేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. ప్రమాదం జరిగినపుడు కంపెనీలో దాదాపు 300 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నట్టు సమాచారం. పేలుడు తీవ్రతకు భవనం కుప్పకూలి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భారీ శబ్దానికి ప్రాణభయంతో కార్మికులు, సమీప గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది కార్మికులు చిక్కుకొని ఉండవచ్చు అనే అనుమానంతో భారీ క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (ఏజెన్సీలు)