హైదరాబాద్ : దేశంలో రాజీవ్ గాంధీ సంస్కరణలే అమలవుతున్నాయని వి హనుమంతరావు అన్నారు, హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో అక్టోబరు 12న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణ చేయనున్నట్లు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాంచీపురం ఎంపీ విశ్వనాథన్, పేర్కొన్నారు.
ఈ మేరకు స్టేడియం ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లు ఆయన పరిశీలించారు, ఉప్పల్ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కాంగ్రెస్ ఇన్చార్జి మందమర్ల పరమేశ్వర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్చార్జి సింగిరెడ్డి, హరి వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శంభులశ్రీకాంత్ గౌడ్, జగదీష్, ఆది అవినాష, అక్సర్ యూసుఫ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ దేవరాజ్, శ్రీనివాస్, బసవరాజు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు. (ఏజెన్సీలు)
ఇది కూడ చదవండి-