ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి పోలీస్ శాఖ సమస్యల పరిష్కారం కోసం బహిరంగ లేఖ రాసిన ఎమ్మెల్యే హరీష్ రావు

గౌరవ ఉప ముఖ్యమంత్రి
భట్టి విక్రమార్క గారికి,

రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులను కొన్ని జిల్లాలకు మాత్రమే అందించి మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరం రాష్ట్రంలోని కామారెడ్డి, నిజామాబాద్, మెదక్,సంగారెడ్డి సిద్దిపేటలోని దాదాపు 6 వేల మంది కానిస్టేబుల్ లకు సరెండర్ మరియు అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ గత ఎనిమిది నెలలుగా పెండింగ్ లో పెట్టారు. పెట్రోల్, డీజిల్ బిల్లులు కూడా నెలల తరబడి రాక పోలీసులు, పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

వీరి పట్ల ఎందుకు ఇంత వివక్ష.?
రాష్ట్ర పోలీసులలో వీళ్ళు భాగం కాదా?
ఒకే డిపార్ట్మెంట్ లోన్ ఇంత పక్షపాతం ఎందుకు ?
ఇది వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే.

యూనిఫామ్ సర్వీస్ వాళ్లు కాబట్టి వాళ్లు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళ సమస్యను నేను మీ దృష్టికి తెస్తున్నాను. తక్షణమే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Also Read-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X