तेलंगाना और आंध्र प्रदेश में तीन दिनों तक बारिश: मौसम विभाग

हैदराबाद: मौसम विभाग ने कहा कि तीन दिनों तक तेलंगाना और आंध्र प्रदेश के कुछ हिस्सों में बारिश और आंधी चलने की संभावना है। इसके चलते लोगों को सतर्क रहने की सलाह दी है। छत्तीसगढ़ पर पश्चिम बिहार से लेकर उत्तरी तेलंगाना तक कम दबाव का ट्रफ बना हुआ है। मौसम विभाग के अधिकारियों ने बताया कि द्रोणि के प्रभाव से तीन दिनों तक हल्की से मध्यम बारिश के साथ छिटपुट गरज के साथ छींटे पड़ने की संभावना है।

विभाग ने कहा कि रविवार को अनाकापल्ली, अल्लूरी, काकीनाडा, एलुरु, एनटीआर, पलनाडु, प्रकाशम, नेल्लोर, तिरुपति, चित्तूर, अन्नमैया और वाईएसआर जिलों में गरज के साथ हल्की बारिश होगी। एपी आपदा प्रबंधन एजेंसी ने कहा कि लोगों को सतर्क रहना चाहिए क्योंकि सत्यसाई, अनंतपुर, करानूल और नंद्याला जिलों में तेज हवाओं के साथ गरज के साथ छींटे पड़ने की संभावना है। आपदा प्रबंधन एजेंसी ने लोगों को पेड़ों के नीचे नहीं रहने की सलाह दी है।

इसी क्रम में कोमारमभीम आसिफाबाद, मंचेरियाल, जगित्याला, राजन्ना सिरिसिला, जयशंकर भूपालपल्ली, मुलुगु, भद्राद्री कोतत्ागुडेम, खम्मम, नलगोंडा, सूर्यापेट, जनगांव, सिद्दीपेट, यदाद्री भुवनगिरी, रंगारेड्डी, हैदराबाद, मेडचल मलकाजगिरी, महबूबनगर, नगर कर्नूल, वनपर्ती, नारायणपेट, जोगुलम्बा गदवाल जिलों के कई हिस्सों में हल्की से मध्यम बारिश होगी। 40 से 50 किलोमीटर प्रति घंटे की रफ्तार से आंधी चलने की संभावना है।

ఏపీ మరియు తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు, వాతావరణ శాఖ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ బిహార్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో 3 రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నేడు అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది.

తెలంగాణ

నేడు కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది.

22వ తేదీ జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో పలుచోట్ల వానలు పడతాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని చెప్పారు.

ఇక 23వ తేదీ నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్ కర్నూల్, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

అలాగే 24వ తేదీ రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు నాలుగు రోజుల పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటీవల కొద్దిరోజుల పాటు ఎండలతో సతమతమైన ప్రజలకు వర్షాలతో కాస్త ఉపశమనం లభిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X