Hyderabad: 6వ రోజు దిగ్విజయంగా ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర. ఈరోజు మొత్తం 11.4 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్ర. ఇవాళ నిర్మల్ జిల్లా సిర్గాపూర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.
-లిక్కర్ దందాలో నీ బిడ్డకు సీబీఐ నోటీసులిస్తే.. తెలంగాణ ప్రజలెందుకు ఉద్యమించాలే?
-డ్రగ్స్, లిక్కర్, క్యాసినో, రియల్ ఎస్టేట్, గ్రానైట్ దందాల్లో కేసీఆర్ కుటుంబం పెట్టుబడులు
-విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన కేసీఆర్ కుటుంబం
-రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిన కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
-బీజేపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ కక్కిస్తాం
-దొంగ దందా చేస్తే మోదీ ప్రభుత్వం వీపంతా సాఫ్ చేస్తది
-కేసీఆర్ కుటుంబంపై ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్
-శ్రీకాంతచారిసహా అమరుల బలిదానాలపై రాజ్యమేలుతున్న కేసీఆర్
-కేసీఆర్ పాలనలో స్వర్ణకారులు అడుక్కుతినే దుస్థితి
- పెళ్లయి పిల్లలు పుట్టినా.. కల్యాణ లక్ష్మి చెక్కులు వచ్చే పరిస్థితి లేదు
- మరోసారి కేసీఆర్ గెలిపిస్తే చెప్పులు నెత్తిమీద పెట్టుకుని తిరగాల్సిన దుస్థితి వస్తది
-బీజేపీ అధికారంలోకి రాగానే తిరుమల, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ భూములను తిరిగి రైతులకిస్తాం
-ట్రిపుల్ ఐటీని విస్తరించి స్కిల్ డెవలెప్ సెంటర్ పెట్టి స్థానిక యువతకు ఉద్యోగాలిస్తామని హామీ
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దివాళా తీయించి చిప్ప చేతికిచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ప్రజలకు ఏం ఒరగపెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన వేల కోట్ల రూపాయలను లిక్కర్, డ్రగ్స్, క్యాసినో, రియల్ ఎస్టేట్ దందాల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని తెలిపారు. ‘‘కేసీఆర్ ఖబడ్దార్…. కేంద్రంలో ఉన్న నీతి, నిజాయితీతో పనిచేస్తున్న నరేంద్రమోదీ గారి ప్రభుత్వం. నీ వీపంతా సాఫ్ చేస్తరు. అందులో భాగంగానే లిక్కర్ స్కాంలో నీ బిడ్డకు నోటీసులిచ్చారు.’’ అని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్మంతా కక్కిస్తామని స్పష్టం చేశారు.
ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా 6వ రోజు పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కొద్ది సేపటి క్రితం సిర్గాపూర్ లో భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు….
• టిఆర్ఎస్ పార్టీ ఏక్ నిరంజన్ పార్టీ. ఈ దెబ్బతో కేసీఆర్ ఔట్. ఈరోజు శ్రీకాంతాచారి వర్ధంతి. జోహార్ శ్రీకాంతాచారి. శ్రీకాంత్ చారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది
• ఏ ముఖ్యమంత్రి కైనా షెడ్యూల్ ఉంటుంది. కేసీఆర్ కు మాత్రం షెడ్యూల్ అంటూ ఏదీ ఉండదు. తాగి పండుడు తప్ప, కేసీఆర్ కు ఏమీ తెలీదు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి ప్రగతిభవన్ కు… ప్రగతి భవన్ నుంచి బయటికి తెచ్చిన ఘనత బిజెపి దే. కేసీఆర్ ధర్నా చౌక్ ను ఎత్తేస్తే… అదే కేసీఆర్ ను అక్కడికి తీసుకువచ్చింది బిజెపినే.
• దుబ్బాక, హుజురాబాద్ లలో కేసీఆర్ కు బిజెపి దెబ్బ రుచి చూపించాం. జిహెచ్ఎంసి ఎన్నికల్లో 4 నుంచి 45 స్థానాలకు వెళ్లి, మనం ఏంటో కేసీఆర్, కేటీఆర్ లకు చూపించాం. మునుగోడులో కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేశాడో ప్రజలంతా చూశారు.
• మునుగోడు లో ఒక్క బీజేపీ పోలింగ్ బూత్ సభ్యుడిని ఎదుర్కొనేందుకు… ఒక్కో trs ఎమ్మెల్యే వచ్చి కూర్చున్నారు. మునుగోడు లో ఒక్క ఓటుకు రూ. 70 వేలు ఇచ్చి, ఓట్లు వేయించుకున్నారు. లంగతనం, దొంగతనం చేసి సంపాదించిన సొమ్మును మునుగోడు లో కుమ్మరించారు. అనేకమంది బిజెపి కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్లో పెట్టారు.
• బిజెపి అంటేనే టిఆర్ఎస్ నేతలు గజగజ వణుకుతున్నారు. దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు. తెగించి కొట్లాడే కార్యకర్తలే… నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
• మరోసారి కేసీఆర్ ని గెలిపిస్తే… సిర్గాపూర్ గ్రామంలో చెప్పులు నెత్తిమీద పెట్టుకుని, తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. తెలంగాణలో అసలైన నిజాం పాలన చూపిస్తున్నాడు కేసీఆర్. సిర్గాపూర్ గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా? ఇక్కడ పది రూపాయలకు బాటిల్ నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు
• తిరుమల, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలను పెట్టిండా? ఫ్యాక్టరీలను పెట్టకుంటే… ఆ జాగాలను తిరిగి, రైతులకు ఇవ్వాలా.. వద్దా? పెడితే షుగర్ ఫ్యాక్టరీ పెట్టు… లేకుంటే వాళ్ళ జాగా వాళ్ళకి ఇచ్చేయ్. బిజెపి ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా… రైతుల జాగాలను రైతులకు తిరిగి ఇప్పిస్తాం
• బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు. బీజేపీ ప్రభుత్వం వస్తే… బాసర ట్రిపుల్ ఐటిని విస్తరిస్తాం. స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. విద్యార్థులకు అండగా ఉంటాం.
• బిజెపి ప్రభుత్వం వస్తే… ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తాం. పేదోళ్ల బతుకులు బాగుపడాలంటే… బిజెపి ప్రభుత్వం రావాలి. సిర్గాపూర్ గ్రామంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చాయి? కెసిఆర్ ఎనిమిది నెలల్లో 100 రూములు కట్టుకుని, దానికి ప్రగతి భవన్ అని పేరు పెట్టుకున్నాడు. అయితే ప్రగతి భవన్.. లేదంటే ఫామ్ హౌస్ లో ఉంటాడు.
• ఈ మధ్య ఢిల్లీకి కూడా పోతుండు. కేసీఆర్ బిడ్డ ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఇరికింది. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, 2bhk హామీ నెరవేర్చలేదు. అభివృద్ధి చేయడానికి పైసలు లేవంటున్న కేసీఆర్… వేల కోట్లు మాత్రం దోచుకుంటున్నారు.
• డ్రగ్స్, లిక్కర్, క్యాసినో, గ్రానైట్ ఇలా అన్నిటిలో దందా చేసి, పెట్టుబడులు పెడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్… కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే బాగుపడుతున్నారు. పైన ఉన్నది మోడీ ప్రభుత్వం. దొంగ దందా.. లంగ దందా చేసే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితే లేదు.
• కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా చేస్తే నోటీసులు ఇవ్వరా? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడానికి, ఇప్పుడు తెలంగాణ తరహా ఉద్యమం చేయాలా? అసలు ఏం మాట్లాడుతున్నారు trs నేతలు?అసలైన తెలంగాణ వాదులము మేము.
• పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు, మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్. తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ మద్దతు ఇవ్వకుంటే… ఈరోజు కేసీఆర్ సీఎం అయ్యే వాడేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు. తెలంగాణ ద్రోహులను సంకలో పెట్టుకున్న పార్టీ… టిఆర్ఎస్ పార్టీ
• పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, కేసీఆర్ మందు తాగి ఇంట్లో పన్నడు. తెలంగాణ రావద్దని కోరుకున్నదే కేసీఆర్… ఎందుకంటే తెలంగాణ పేరుతో పైసలు వసూలు చేయడానికి. కేసీఆర్ నటనలో జీవిస్తాడు. కేసీఆర్ ఢిల్లీలో దొంగ దీక్ష చేశాడు. ఉద్యమంలో బాత్రూంలో కూడా మందు తాగిన చరిత్ర కేసీఆర్ ది.
• కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టిండా? కారుకు లోన్ పైసలు కట్టే స్తోమతలేని కేసీఆర్… నేడు వేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగాడు? కాళేశ్వరం ప్రాజెక్టు లో కోట్లు దండుకున్నాడు. రైతులకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే.
• ఒక ఎకరానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 30 వేల రూపాయల సబ్సిడీ ఇస్తోంది. కేసీఆర్ ఏమీ ఇస్తలేడు. 1400 మంది తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. పేదోళ్ల ఆత్మబలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో… నేడు పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. కెసిఆర్ కుటుంబమే రాజ్యమేలుతోంది
• ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ కింద తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల 40 వేల ఇండ్లను మోడీ మంజూరు చేశారు. మోడీ ఇచ్చిన ఇండ్లు, పైసలు ఎక్కడికి పోయాయి? మోడీకి పేరు వస్తుందనే ఇండ్లు ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో ఒక సంవత్సరంలో లక్ష ఇండ్లు కట్టించి, దసరా రోజు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఘనత బిజెపిది.
• ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికను, కేసీఆర్ చెత్తబుట్టలో పాడేశాడు. ఉద్యోగాలు ఇవ్వడు, నిరుద్యోగ భృతి ఊసే లేదు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంతా… కేంద్రం ఇచ్చిన నిధులతోనే. ఉచిత బియ్యం, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోదీదే
• రైతుబంధు హామీ ఏమైంది? రైతుబంధు పేరు చెప్పి రైతులకు వచ్చే ప్రయోజనాలన్నిటినీ, బంద్ పెట్టిండు. పెళ్లయి పిల్లలు పుట్టినా.. కల్యాణ లక్ష్మి చెక్కులు వచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ చేసింది ఏమిటో చెప్పాలి?
• కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు పెంచిండు. ఇంటి పన్ను కూడా పెంచిండు. ఇప్పటికే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుకు చేర్చిండు మళ్లీ ఒకసారి కేసీఆర్ కు అవకాశం ఇస్తే… మరో 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మారుస్తాడు. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం
సిర్గాపూర్ లో బిజెపి బహిరంగ సభ”
రమాదేవి, నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు:
“ప్రజా సమస్యలు తెలుసుకుని, రాబోయే రోజుల్లో వాటిని పరిష్కరించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. అవినీతి, కుటుంబ, అరాచక పాలనను అంతమొందించేందుకే బండి సంజయ్ అడుగుపెట్టారు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్ నిర్మల్ జిల్లా. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతి అంతా ఇంతా కాదు. ఎన్నో చెరువులను కబ్జా చేసిండు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అవినీతి జరుగుతోంది… అయినా చర్యలు శూన్యం.”
నిర్మల్ జిల్లాలోని సిర్గాపూర్ గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర. సిర్గాపూర్ గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి శ్రేణులు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న బండి సంజయ్.
నిర్మల్ జిల్లాలోని లోలం గ్రామంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. లోలం గ్రామంలో బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికిన స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు. బండి సంజయ్ పై పూల వర్షం కురిపించి, తమ అభిమానాన్ని చాటుకున్న గ్రామ బిజెపి కార్యకర్తలు. హారతులు పట్టి బండి సంజయ్ కి స్వాగతం పలికిన ఆడపడుచులు. ప్రజలకు అభివాదం చేస్తూ… పాదయాత్రగా ముందుకు సాగుతున్న బిజెపి రథసారధి. లోలం గ్రామంలో బిజెపి జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్. బండి సంజయ్ కి ఛత్రపతి శివాజీ చిత్రపటాన్ని బహుకరించిన స్థానిక కార్యకర్తలు. ఓ చిన్నారిని ఎత్తుకొని స్వయంగా సెల్ఫీ ఇచ్చిన బండి సంజయ్
బాల్య మిత్రులతో బండి సంజయ్. వీఆర్ఎస్ తీసుకున్న చిన్ననాటి స్నేహితుడికి బండి సన్మానం.
• బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను ఈరోజు సాయంత్రం పలువురు చిన్న నాటి మిత్రులు కలిశారు. వీరంతా కరీంనగర్ లోని సరస్వతి శిశుమందిర్ లో బండి సంజయ్ తో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులే.
• వీరిలో తాండూర్ ఆప్తాలమిక్ ఆఫీసర్ (కంటి వైద్యాధికారి) గా పనిచేసిన సందవెని మహేంద్ర నాథ్ యాదవ్ ఇటీవల వీఆర్ఎస్ (స్వచ్చంద పదవీ విరమణ) తీసుకున్నారు.
• ఈ నేపథ్యంలో మహేంద్ర నాథ్ యాదవ్ తన కుటుంబ సభ్యులు, బాల్యమిత్రులతో కలిసి సంజయ్ ను కలిసి ఆలింగనం చేసుకున్నారు.
• ఈ సందర్భంగా మహేంద్ర నాథ్ యాదవ్ ను శాలువా కప్పి సన్మానించిన బండి సంజయ్ వారి కుటుంబ సభ్యులు, బాల్య మిత్రులతో ఫోటోలు దిగారు. వారితో కలిసి సరదాగా నవ్వుకున్నారు. బాల్య స్ర్ర్ముతులు గుర్తు చేసుకున్నారు.
• బాల్య మిత్రమండలి కన్వీనర్ బండి శ్రీనివాస్ అధ్వర్యంలో జరిగిన ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు , వెల్దండి వేణు, విశ్వనాథ అనిల్, చెన్నాడె ప్రవీణ్, సురేందర్ రెడ్డి, మంచాల రమేష్, తోట ప్రకాష్, పుల్లూరి రమేష్ తదతరులు పాల్గొన్నారు.
లంచ్ అనంతరం తిరిగి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. కాసేపట్లో లోలం గ్రామానికి చేరుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర
దిలావర్ పూర్ లో బిజెపి బహిరంగ సభ:
సోయం బాపూరావు, ఆదిలాబాద్ ఎంపీ కామెంట్స్:
“దిలావర్పూర్ మండలం చాలా అన్యాయానికి గురైంది. ఈ మండలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా అభివృద్ధి చెందలేదు. ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా… రైతులను మోసం చేసింది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టిఆర్ఎస్ కావాలనే అడ్డుకుంది. SRSP భూ నిర్వాసితులకు కూడా ఇంకా న్యాయం జరగలేదు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడదాం.
తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్దం కండి. తెలంగాణ వచ్చినా ఒరిగిందేమిటి? డబుల్ ఇండ్లు రాలే… ఆత్మహత్యలు ఆగలే.. ఆకలిచావులున్నయ్. కేసీఆర్ బిడ్డకు నోటీసులిస్తే… తెలంగాణ ఎందుకు ధర్నా చేయాలి? వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబం. 3 నెలలుగా ఆగిపోయిన ఆసరా ఫించన్లు. ఇప్పటికే 2 నెలల ఫించన్ ను కట్ చేసిన కేసీఆర్. పేదలకు అరిగోస పెడుతున్న నియంత కేసీఆర్. ఫాంహౌజ్ లో సాగు చేసిన కేసీఆర్ కోటీశ్వరుడు ఎట్లా అయ్యారు? ఆరుగాలం పండించిన రైతులు బికారీలు ఎందుకు అవుతున్నారు? వడ్ల కొనుగోలు పైసలన్నీ ఇచ్చేది కేంద్రమే. వడ్ల సేకరణలో కేసీఆర్ చేసేది బ్రోకరిజమే. ఎకరానికి ఎరువుల పేరుతో 30 వేల సబ్సిడీ ఇస్తోంది కేంద్రమే. రైతు బంధు ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ పెట్టిన కేసీఆర్. 5 లక్షల అప్పు చేసి దోచుకుతింటున్న సీఎం. కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్.”
దిలావర్ పూర్ మండలానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించిన సంజయ్
“తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులున్నాయో… రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తతం చేశారు. ‘‘తెలంగాణ వచ్చాక డబుల్ బెడ్రూం ఇండ్లు రాలే. ఉద్యోగాలు రాలే. నిరుద్యోగ భ్రుతి అందలే. రుణమాఫీ రాలే. రైతుల ఆత్మహత్యలు ఆగలే. స్వర్ణకారులు, చేనేత కార్మికులుసహా చేతివ్రుత్తుల ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి సాధించిందేమిటో చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ బిడ్డకు లిక్కర్ స్కాంలో నోటీసులిస్తే… తెలంగాణ ప్రజలు ఎందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. 1400 మంది పేదల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు దోచుకున్న కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొట్టడానికి తెలంగాణ తరహాలో మరో మహోద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 6వ రోజు ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా దిలావర్ పూర్ మండల కేంద్రంలో భారీ హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు.”
“కెసిఆర్ కు తాగుడు, పండుడు తప్ప ఏమీ తెలియదు. ఈ టైం కి కూడా 90 ఎం.ఎల్ తాగి ఉంటాడు. కెసిఆర్ బిడ్డ లిక్కర్ దందా చేసింది. కెసిఆర్ బిడ్డకు నోటీసులు ఇస్తే… తెలంగాణ ప్రజలు ధర్నా చేయాలంట. 1400 మంది అమరుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇక్కడ కేసీఆర్ షాపులు ఎన్ని ఉన్నాయి? ఊర్లో గుడి, బడి లేకపోయినా… బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయి. కెసిఆర్ బిడ్డ ఢిల్లీలో లిక్కర్, క్యాసినో లో పెట్టుబడులు పెట్టింది. రైతులకు రుణమాఫీ చేయలేదు. దళిత బంధు లేదు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లేదు. మహిళలకు రుణాలు ఇవ్వలేదు.
ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కంప్లీట్ చేయలేదు. రోడ్లు లేవు. చదువుకుందామంటే కాలేజీలు లేవు…. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. కేసీఆర్ ను అభివృద్ధి చేయమంటే పైసలు లేవంటున్నాడు. వేలకోట్లు దండుకోవడానికి మాత్రం పైసలు ఉంటాయి. లిక్కర్ దందా, డ్రగ్స్, స్యాండ్ ఇలా అన్నీ దందాలు కేసీఆర్ వే. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూడా కేసీఆర్ పైసలు ఇవ్వడం లేదు. తెలంగాణకు మోడీ 2,40,000 ఇండ్లను మంజూరు చేస్తే… కేసీఆర్ ఇక్కడ ఎన్ని ఇల్లు కట్టించాడు? చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, కనీసం పెళ్లికి పిల్లనివ్వని పరిస్థితి నెలకొంది. రైతులను బికారీలుగా మార్చిండు. వరి వేస్తే ఉరే అంటాడు. సన్న వడ్లు, దొడ్డు వడ్లు అంటూ రైతులను ఆగం చేసిండు. సన్నవడ్లు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు ఈ ఎనిమిదేళ్లలో ఒక్క పైసా కూడా పంట నష్టం కింద పరిహారం ఇవ్వలేదు. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమంటే… రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ ది. ధాన్యం సేకరణలో నిధులను మంజూరు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. కేసీఆర్ చేస్తున్నది కేవలం బ్రోకరిజమే. ఒక్క రైతు బంధు పేరు చెప్పి, రైతులకు రావలసిన అన్నింటిని బంద్ చేసిండు. అన్నదాతలకు ఎరువులపై సబ్సిడీ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఒక్క ఎకరానికి సబ్సిడీపై 30 వేల రూపాయలు ఇస్తున్నది మోడీ ప్రభుత్వమే. ‘కిసాన్ రైతు సమ్మాన్ నిధి’ కింద ఎకరానికి రైతుకు రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుకు చేర్చిండు.”
పుట్టబోయే బిడ్డ పేరుపై కూడా లక్ష రూపాయల అప్పు పెట్టిండు. బీసీల కులవృత్తులను నాశనం చేసిండు. ఎస్టీలకు పోడు భూముల సమస్య పరిష్కరించలేదు. నేను చెప్పే లెక్కలు తప్పయితే… నన్ను ఏమైనా చేయండి. దిలావర్ పూర్ మండలానికి కేంద్రం నుంచి భారీగా నిధులను మంజూరు చేశారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి అంతా… కేంద్రం ఇస్తున్న నిధులతోనే. ప్రజల కోసం కొట్లాడితే… నన్ను కూడా 3 రోజులు జైలుకు పంపిండు. మీకోసమే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తున్నా. తిండి, నిద్ర లేకున్నా…. మీకోసమే తిరుగుతున్న. కేసీఆర్ పాలనలో పేదోళ్లు చచ్చిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా… అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 37 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు”
“12 మంది స్వర్ణకారులు ఆకలితో ఆత్మహత్య చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తన బిడ్డ కవితను. కాపాడుకునేందుకే… కేసీఆర్ మహిళ అనే సెంటిమెంటును రగిలిస్తున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్… తన కుటుంబంలో మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. పేదోల్లు కొట్లాడితే వచ్చిన తెలంగాణలో… పెద్దోడు రాజ్యమేలుతున్నాడు. మహారాష్ట్రలో ఒక్క సంవత్సరంలో… లక్ష ఇండ్లు కట్టించి, దసరా రోజే లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించిన ఘనత బిజెపి ది”
దిలావర్ పూర్ వచ్చేటప్పుడు ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకున్న
అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు… ఓట్ల కోసం రాలేదు… నేను ఇక్కడ పోటీ చేసే వ్యక్తిని కాదు. తెలంగాణలో బిజెపి ప్రభుత్వం వస్తే… ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఫసల్ బీమా యోజన అమలు చేస్తాం. కెసిఆర్ కబంధహస్తాల్లో బంధీ అయిన తెలంగాణ తల్లిని, బంధ విముక్తి రాలని చేద్దాం. తెలంగాణలో బిజెపి ఏర్పడ్డ తర్వాత, ఇదే చౌరస్తాకు నేను వస్తా. దిలావార్ పూర్ మండలానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులివే.
1) జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ మండలానికి 52 కోట్ల 92 లక్షల 90 వేలు ఇవ్వడం జరిగింది.
2) 15వ ఆర్థిక సంఘం ద్వారా 4 కోట్ల 50 లక్షలు 62 వేల 573 రూపాయలు.
3) స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఈ మండలం లో 2 కోట్ల 7 లక్షల 17 వేల 4 వందల రూపాయల నిధులతో 2838 మరుగుదొడ్ల నిర్మాణం చేయడం జరిగింది.
4) PM కిసాన్ సమ్మన్ నిధి ద్వారా 4449 రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి అందివ్వడం జరుగుతుంది.
5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా… అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిలావర్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో దివ్యాంగులతో కాసేపు ముచ్చటించిన బండి సంజయ్. దివ్యాంగులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేసిన బండి సంజయ్.
జనసంద్రమైన దిలావర్ పూర్
బండి సంజయ్ రాకతో జనసంద్రంగా మారిన నిర్మల్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలం. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా దిలావర్. పూర్ మండలానికి చేరుకున్న బండి సంజయ్. హారతులు పట్టి స్వాగతం పలికిన ఆడపడుచులు. బండి సంజయ్ ని చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, బిజెపి కార్యకర్తలు. భారీ జన సందోహం నడుమ పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్. బండి సంజయ్ ని చూసేందుకు చుట్టుపక్కల బిల్డింగులను ఎక్కి మరీ చూస్తున్న చిన్న పిల్లలు.
6వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోకి ప్రవేశించిన బండి సంజయ్ పాదయాత్ర. దిలావర్ పూర్ లోని ఎల్లమ్మ ఆలయంలో ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న బండి సంజయ్. కాసేపట్లో దిలావర్ పూర్ లోని ‘జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల’లో “ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని” పురస్కరించుకుని, దివ్యాంగులకు బ్యాగ్స్, బుక్స్, బిస్కట్స్ పంపిణీ చేయనున్న బండి సంజయ్. అనంతరం దిలావర్ పూర్ ప్రధాన కూడలి వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న బండి సంజయ్.
BREAKING
ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దివ్యాంగులతో కలిసి దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించనున్న బండి సంజయ్ కుమార్
6వ రోజు దిగ్విజయంగా కొనసాగుతున్న బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. బండి సంజయ్ అడుగులో అడుగు వేస్తూ పాదయాత్రలో నడుస్తున్న వేలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు. బండి సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్న యువత. కాసేపట్లో దిలావర్ పూర్ కు చేరుకోనున్న బండి సంజయ్ పాదయాత్ర>
BREAKING
6వ రోజు ప్రారంభమైన బండి సంజయ్ “ప్రజా సంగ్రామ యాత్ర”. రాంపూర్ శివారులోని రాత్రి శిబిరం నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర. రాంపూర్ నైట్ క్యాంప్ నుంచి గుండంపల్లి క్రాస్, ఎల్లమ్మగుడి ద్వారము , దిలావర్ పూర్, లోలం మీదుగా సిర్గాపూర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర. ఈరోజు మొత్తం 11.4 కిలోమీటర్ల మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర. ఇవాళ సిర్గాపూర్ శివార్లలో బండి సంజయ్ రాత్రి బస.