Hyderabad: 9 డిసెంబర్ నాడు సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా, గాంధీ ఐడియాలజీ సెంటర్ లో రాజీవ్ గాంధీ ప్రమాద భీమా పథకం కింద, 2 లక్షల రూపాయల చెక్కులను 90 మంది ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఇవ్వడం జరిగింది.
టీపీసీసీ ఇన్సూరెన్సు మరియు క్లెయిమ్స్ విభాగం చైర్మన్ పవన్ మల్లాది మాట్లాడుతూ… ఇప్పటి వరకు 609 ప్రమాద సంఘటనలు టీపీసీసీ ఇన్సూరెన్సు ఆఫీస్ లో నమోదు కాగా 609 లో 520 ప్రమాదాల్లో చనిపోయినవారేనని తెలియజేసారు. ఇప్పటి వరకు టీపీసీసీ ఇన్సూరెన్సు & క్లెయిమ్స్ విభాగం మొత్తలు 100 చెక్కులను 100 కుటుంబాలకు ఇవ్వడం జరిగిందని మొత్తం 2 కోట్ల రూపాయల ఇన్సూరెన్సు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ CLP నాయకులు జానారెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, మాజీ మంత్రి వర్యులు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నా రెడ్డి, మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి, మాజీ మంత్రి ట్రెజరర్ సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంభాని చంద్ర శేఖర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వేంనరేందర్ రెడ్డి, మాజీ MLA ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, మాజీ MLA రామ్ మోహన్ రెడ్డి చెరుకు సుధాకర్ గారు , మల్కాజి గిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్, భూపతి రెడ్డి, మాల్ రెడ్డి రామ్ రెడ్డి, ఛామల కిరణ్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.