हैदराबाद: जेल अधिकारी कैदियों को ठीक प्रकार से खाना नहीं दे रहे हैं। इससे पहले जेलों में कैदियों को अच्छा खाना और अन्य सुविधाएं मिलती थीं। लेकिन अब आलोचना हो रही है कि जेल प्रशासन उनकी ठीक से देखभाल नहीं कर रहे हैं।
इसका मतलब है कि पूर्व में कैदियों को सप्ताह में एक बार उनके खाने में मीट और चिकन करी परोसी जाती थी। यानी पहले कैदियों को मटन और चिकन देते हैं। लेकिन पिछले दो हफ्तों से तेलंगाना की चंचलगुडा और चर्लापल्ली जेलों में कैदियों को मटन और चिकन करी नहीं दे रहे हैं।
कैदियों की शिकायत/कहना है कि बजट के अभाव के चलते उन्हें परोसे जाने वाला मटन और चिकन नहीं दे रहे हैं। इतना ही नहीं जेलों में मटन सप्लाई करने वाले ठेकेदार का दो करोड़ रुपए से ज्यादा बकाया है। इसलिए ठेकेदार ने जेल प्रशासन को मटन और चिकन की सप्लाई करना बंद कर दिया है। इसके चलते जेल अधिकारी कैदियों को रविवार को दाल-सांबार खिला रहे हैं।
చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు మటన్, చికెన్ ఇవ్వడం లేదు, ఇది కారణం
హైదరాబాద్: పాపం ఖైదీల కడుపు మాడుస్తున్నారు జైలు అధికారులు. జైళ్లలో గతంలో ఖైదీలకు భోజనం, ఇతర సౌకర్యాలు బాగానే ఉండేవి. కాని ఇప్పుడే జైలు అధికారులు సరిగా చూసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే గతంలో జైళ్లలో ఖైధీలకు ఆహారంలో వారానికి ఒకరోజు మాంసం కూర వడ్డించేవారు. మటన్, చికెన్‌ను ఇచ్చేవారు. కాని గత రెండు వారాలుగా తెలంగాణలోని ప్రధాన కారాగారాలైన చంచల్‌గూడ, చర్లపల్లి జైలులో ఖైదీలకు మటన్, చికెన్ కూర బంద్ చేశారు.
ఖైదీలకు వడ్డించే మటన్, చికెన్ సరిపడ బడ్జెట్ రాకపోవడం నిధుల కొరతతో నేరస్తుల కడుపు మాడుస్తున్నారని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు జైళ్లకు మటన్ సప్లై చేసే కాంట్రాక్టర్‌కు బకాయి డబ్బులు కూడా రెండు కోట్ల రూపాయలకు పైగా ఉండటంతో అతను మటన్, చికెన్ సప్లై నిలిపివేయడంతో ఖైదీలకు పప్పు, సాంబార్ భోజనంతో సరిపెడుతున్నారు జైల్ అధికారులు.
తెలంగాణలో నేరాలు చేసిన వాళ్లను ఉంచే ప్రధాన జైళ్లు చంచల్‌గూడ, చర్లపల్లి జైలు. ఇక్కడ గత కొద్ది రోజులుగా మాంసాహారం పెట్టడం లేదు జైలు అధికారులు. అదేంటని ఖైదీలు ప్రశ్నిస్తే బడ్జెట్ విడుదల కాలేదని నిధుల కొరతను కారణం చూపిస్తూ గత రెండు వారాలుగా ఖైదీలకు మటన్, చికెన్ నిలిపివేశారు. అంతే కాదు మటన్, చికెన్ సప్లై చేసే కాంట్రాక్టర్‌కు రెండు కోట్ల రూపాయల బకాయి పెండింగ్‌లో ఉండటంతో అతను మటన్, చికెన్ సప్లై నిలిపివేయడం జరిగింది. (ఏజెన్సీలు)