అస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ లో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కవిత

దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే

స్వదేశంలో పెట్టుబడులు పెట్టండి

పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ !

ప్రవాసీ భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపు

హైదరాబాద్: స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీభారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. భారత్ లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, గత 9 ఏళ్లలో47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ లో భారత్ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రవాసి తెలంగాణయుల నివాసాల్లో బోనాలను అలంకరించుకొని స్థానిక దేవాలయానికి భారత్ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత చేరుకున్నారు. అక్కడ బోనాలను సమర్పించిన తర్వాత సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంటుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ నాటికి ఐటీ పరిశ్రమలో తెలంగాణలో3.5 లక్షల ఉద్యోగాలు ఉంటే ఇప్పుడు 9.5 లక్షలకుపైగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సంపదను పెంచి నిరుపేదలకు పంచుతున్నదన్నారు. జీఎస్డీపీలో జాతీయ సగటు కంటే తెలంగాణ ఎక్కువ నమోదు చేసిందని చెప్పారు.

భారత సంస్కృతిని, తెలంగాణ సంప్రదాయాలను ఆస్ర్టేలియా దేశానికి విస్తరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్రిస్ బేన్ లో ఉన్న తెలుగువారు, భారతీయులకు అభినందనలు తెలిపారు. ఆ దేశ చట్టాలను గౌరవిస్తూ ఉన్నతంగా జీవించాలని, సామాజిక సేవ చేయాలని ఆకాంక్షించారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లో భారతీయులు రాణిస్తుండడం గర్వకారణమన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘకాలం పోరాటం చేశామని, 60 ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కల సాకారమయ్యిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలోనే అన్ని రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకెళ్తున్నదని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని స్పష్టం చేశారు. దాదాపు అన్ని రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. గ్రామీణ, పట్టణాలను రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా అభివృద్ధి చేస్తోందని చెప్పారు.

బోనాల ఉత్సవాల్లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు శ్రీకర్ రెడ్డి అందెం, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షులు కాసర్ల నాగేందర్ రెడ్డి, BTA ప్రెసిడెంట్ కిషోర్, నాయకులు విజయ్ కోరబోయిన, స్వప్న దోమ, విరించి రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X