హైదరాబాద్: ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించటం లో ఎప్పుడు ముందు ఉండే ఎమ్మెల్సీ కవిత గారు మరో సారి పెద్ద మనసు చాటుకున్నారు.. మండుతున్న ఎండల నేపథ్యం లో వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాలను నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయించారు. కంటేశ్వర్ లో నగర మేయర్ నీతు కిరణ్, మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఎమ్మెల్సీ కవిత గారు స్వచంధంగా అందిస్తున్న సేవ కార్యక్రమాల గురించి వివరించారు..ప్రజలకు ఏలాంటి కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు ఎప్పుడు ఎమ్మెల్సీ కవిత గారు ముందు ఉంటారని చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద మనసు చాటుకున్నారనీ తెలిపారు.
వేసవి కాలం నేపద్యం లో మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం అందజేసేందుకు ప్రధాన కూడళ్లలో ఉచిత మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయించారని చెప్పారు. నిరంతరం ప్రజలకు సేవ కార్యక్రమాలు అందజేస్తూ అండగా ఉంటున్న ఎమ్మెల్సీ గారికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో రెడ్ కో మాజీ చైర్మన్ అలీమ్ బి ఆర్ స్ మాజీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి జాగృతి జిల్లా కన్వీనర్ అవంతి రావు, బి ఆర్ స్ నాయకులు జాగృతి కార్యకర్తలు పాల్గొన్నారు.